కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్రం మరో కఠినమైన నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన 75 జిల్లాల్లో ఈ మార్చి 31వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం….కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదు అయిన జిల్లాల్లో పూర్తి నిషేధ ఆజ్ఞలు అమలు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల చీఫ్ సెక్రెటరీలతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి కరోనా పరిస్థితిపై చర్చ జరిపి ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా త్వరలోనే ప్రకటనలు విడుదల చేస్తాయని తెలుస్తోంది.
తెలంగాణలోని ఐదు జిల్లాలు ::హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం.
ఆంధ్ర ప్రదేశ్ లో విజయవాడ ,విశాఖ,ప్రకాశం జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించాలని ఆదేశాలు జారీ చేసింది
మార్చి 22 అర్ధరాత్రి నుండి మార్చి 31 అర్ధరాత్రి వరకు గూడ్స్ రైళ్లు తప్ప ఎక్స్ప్రెస్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు, సబర్బన్ రైళ్లు, కోల్కతా మెట్రో, కొంకణ్ రైవేలు సర్వీసులను మార్చి 31 వరకు రద్దు చేస్తున్నట్టు రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.