వైరస్ ప్రభావం రోజు రోజుకు పెరిగిపోతున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఎగ్గిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ జె ర్యాన్ జెనీవాలో మాట్లాడుతూ,గతంలో పోలియో, మశూచిలను విజయవంతంగా పారద్రోలిన ఘనత భారత్‌దని,ఇప్పుడు కరోనా వైరస్ ను కూడా ఇండియా సమర్ధవంతంగా ఎదుర్కొనగలిగే సత్తా ఉందని, ఆ నమ్మకం ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఉందని పేర్కొన్నారు.అలా తరిమికోట్టాలి అంటే ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలి అని కోరారు.
News
చైనాలో పుట్టిన మరో కొత్త వైరస్..ఒకరి మృతి! ఆ వైరస్ కథ ఇదే..!
కరోనా వైరస్ చాలదన్నట్లు చైనాలో మరో కొత్త వైరస్ ఇపుడు అందరిని బయపెడుతుంది. చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అధికారికంగా తెలిపింది. వారి కధనం ప్రకారం ఆ కొత్త వైరస్ పేరు హంట వైరస్. చైనాలోని షాంగ్దండ్ ప్రొవియన్సులో 39 ఏళ్ళ వయసున్న ఓ వ్యక్తికి హంట అనే వైరస్ సోకింది. దీంతో అతను మృతి చెందాడు అని ఆంగ్ల వెబ్సైట్లలో పబ్లిష్ అయ్యింది. అతను మరణించిన తరువాత 32 మందిని పరీక్షించామని, ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామని నివేదిక పేర్కొంది.

కాగా ఈ వైరస్ వ్యాప్తికి ఎలుకలే ప్రధాన కారణమని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. ఇంటిలో చుట్టుపక్కల పరిసరాల్లో ఎలుకల వలన హంటావైరస్ వ్యాప్తించే ప్రమాదం ఉందని పేర్కొంది. ఎలుకల లాలజలం, మూత్రం లేదా దాని వ్యర్థాలను తాకిన తర్వాత ఎవరైనా తమ కళ్లు, ముక్కు, నోటిని తాకితే అది సంక్రమిస్తుందని తెలిపింది.

1959 లో ఈ వైరస్ ను మొదటిసారిగా గుర్తించారు. దీనికి సంబంధించిన వ్యాక్సిన్ 2016 నుంచి అందుబాటులోకి వచ్చింది. అప్పుడెప్పుడో ప్రభావం చూపిన హంట వైరస్ ఇపుడు మళ్లీ రావడంతో అందరు బయపడి పోతున్నారు. ఈ వైరస్ భారిన పడితే శ్వాసకోశ వ్యాధికి గురవుతారని పేర్కొంది.
A person from Yunnan Province died while on his way back to Shandong Province for work on a chartered bus on Monday. He was tested positive for #hantavirus. Other 32 people on bus were tested. pic.twitter.com/SXzBpWmHvW
— Global Times (@globaltimesnews) March 24, 2020
గతంలో తిరుమల ఎప్పుడు మూసి వేసారో తెలుసా? అప్పుడు రెండు రోజులు..!
తిరుమలలో శ్రీవేంకటేశ్వస్వామి దర్శనానికి భక్తులను వారంపాటు అనుమతించకూడదని టీటీడీ అధికారులు నిర్ణయించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞాణంలోని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తిరుమల శ్రీవారి ఆలయం మూసి వేస్తారంటూ బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో పేర్కొన్నారు.ఇప్పుడు ఆ విషయం వెలుగులోకి వచ్చింది.ఆ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సాధారణంగా గ్రహణం సమయంలో మాత్రమే మూసి వేస్తారు.

ఇది ఇలా ఉంటె…200 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ ఆలయం గతంలో 1892 లో రెండు రోజులు మూసివేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. అయితే అప్పుడు మూసివేయడానికి గల కారణాలు తెలీదు. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి కరోనాను నియంత్రించే కారణంగా మూసివేశారు.
పెళ్లయిన వారం రోజులకే…పెళ్లి కార్డు పైన అదంతా రాసి..! అసలేమైంది?
వివాహమైన వారం రోజులకే వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చివ్వెంల మండలంలోని కుడకుడ గ్రామంలో గల వినాయకనగర్‌లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్తే…ఆత్మకూర్(ఎస్) మండలం ఘట్టికల్ గ్రామానికి చెందిన సామ ఇంద్రారెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ వినాయకనగర్‌లో నివాసముంటున్నారు. ఆయనకీ ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురు మౌనిక(24) సీఏ పూర్తి చేసి మంచి వేతనంతో ఉద్యోగం చేస్తోంది.

మౌనికారెడ్డి ని ఈసీఎల్‌కు చెందిన బద్దం శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు సాయికిరణ్‌రెడ్డికి ఇచ్చి ఈ నెల 15న సూర్యాపేటలో పెళ్లి చేసారు పెద్దలు. కట్నకానుకల కింద రూ. 10 లక్షల నగదు, సుమారు 35 తులాల బంగారం, 4 కేజీల వెండి అప్పజెప్పారు.సాయి కిరణ్ రెడ్డికి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడని, ఘట్కేసర్ దగ్గర 5 ఎకరాల భూమి ఉందని చెప్పి పెళ్లి చేసారు. అతడికి ఉద్యోగం లేకపోగా, ఆస్తిపాస్తులు కూడా లేవని తెలుసుకున్న మౌనికారెడ్డి తల్లిదండ్రులు అతడిని నిలదీశారు. దీంతో సాయి కిరణ్ రెడ్డి మౌనికను ఇక్కడే ఉండాలి లేకుంటే వీడుకోలు ఇవ్వాలని బెదిరించారు.

దీంతో భర్త ప్రవతన తట్టుకోలేక తనకు జరిగిన మోసంపై మనస్తాపం చెంది తన పెళ్లి కార్డుపైనే చివరి లెటర్ రాసి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది మౌనిక రెడ్డి. శనివారం రాత్రి కూడా వినాయకనగర్‌లోని తమ నివాసానికి వెళ్లారు. ఆదివారం ఉదయం ఎంత కొట్టినా గది తలుపులు తీయకపోవడంతో కిటికీల్లోంచి చూడగా ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని మౌనికారెడ్డి ఆత్మహత్యకు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరో ఇటలీగా మారుతున్న అమెరికా…ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో…!
ముందు నుండి చెప్తున్నట్టుగానే కరోనా వైరస్ ని అరికట్టాలంటే వ్యాప్తి చెందించకుండా ఉండడమే మార్గం. అందులో భాగంగానే ఈ జనతా కర్ఫ్యూ. ఇప్పటివరకు కరోనాకి మందు కనుగొనబడలేదు. వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో ప్రపంచ దేశాలన్ని ప్రయత్నిస్తున్నాయి. కనిపెట్టడానికి మరికొన్ని నెలల సమయం పట్టొచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలు, అరవైఏళ్ల పై బడిన వారే వైరస్ బారిన పడుతున్నారు. మరణాల శాతం కూడా వారిలోనే అధికం. అందువలన వీరిని ఎట్టి పరిస్థితిలో ఇంటి నుండి బయటికి రానివ్వొద్దని ప్రధాని పిలుపునిచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ నెల 31 వరకు లాక్ డౌన్ అని ఆదేశాలు ఇచ్చారు.

ఇది ఇలా ఉండగా…ఈ కరోనా మహమ్మారికి ప్రపంచమంతా వనుకుంటుంది. ఇటలీ పరిస్థితి తలుచుకుంటే కన్నీళ్లు వస్తున్నాయి. ఇప్పుడు అమెరికాలో కూడా తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది కరోనా. దేశంలో కేసుల సంఖ్య 36,756కి పెరిగింది. ఒక్కరోజే 12,549 కొత్త కేసులు రికార్డయ్యాయి. 420 మంది వైరస్‌కు బలయ్యారు. ఒక్కరోజులో రికార్డ్ స్థాయిలో 94 మంది చనిపోయారు. కేసుల లిస్టులో ఇటలీ తర్వాతి ప్లేస్ అమెరికాదే. అంటే ప్రపంచంలో టాప్ 3 అమెరికానే. ఒక్క న్యూయార్క్‌లోనే 21,381 కేసులు నమోదు కాగా, ఒక్కరోజులోనే 11,009 కొత్త కేసులు రిపోర్ట్ అయ్యాయి.

దీని ఎఫెక్ట్ అక్కడ ఉద్యోగాలపై కూడా పడింది. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా యువత ఉద్యోగాలు కోల్పోతున్నారు.కరోనా పరిస్థితుల నేపథ్యంలో దేశం లాక్డౌన్ దిశగా సాగుతోంది. పెరిగిపోతున్న కేసులతో న్యూయార్క్ స్టేట్ మొత్తాన్ని మూసేశారు. రెండు రోజుల్లోనే కరోనా ఎక్కువ గల కేసుల్లో టాప్ 3 స్థానానికి వెళ్ళింది అమెరికా. మొదటి స్థానంలో చైనా, రెండో స్థానంలో ఇటలీ ఉండగా..ఇప్పుడు మూడో స్థానంలో అమెరికా చేరింది.
మీకేమైనా స్పెషల్ రూల్స్ ఉన్నాయా…లాక్ డౌన్ పట్టించుకోని వారిపై కలెక్టర్ ఫైర్..! (వీడియో)
కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్రం మరో కఠినమైన నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన 75 జిల్లాల్లో ఈ మార్చి 31వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల లోను ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ఆంక్షలు విధించారు ముఖ్యమంత్రులు. ఈ క్రమంలో ఇది పట్టించుకోకుండా కొందరు రోడ్లమీదకు అనవసరంగా వస్తున్నారు.

లాక్‌డౌన్‌ను పట్టించుకోకుండా జనం రోడ్లపైకి రావడంతో తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తారు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్.వారిని ఆపి మరీ క్లాస్ తీసుకుంటున్నారు. ఏమాత్రం టెన్షన్ లేకుండా యథేచ్ఛగా రోడ్లపైకి జనం రావడాన్ని తప్పుబట్టారు.వాహనాలపై వెళ్లే వారిని ఆపి.. ఏంటి బయటకు ఎందుకు వచ్చారు? నువ్వు ఏమైనా గొప్పోడివా? నీకు ఏమైనా కొత్త రూల్స్ ఉన్నాయా? అంటూ.. కార్లు, బైక్‌లు ఇలా తేడా లేకుండా ఆపి క్లాస్ తీసుకున్నారు.. అటుగా వెళ్తున్న ఓ ఫ్యామిలీని సైతం ఆపి ఆగ్రహం వ్యక్తం చేశారు కలెక్టర్.ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
watch video:
కరోనా కారణంగా రొమాన్స్‌ని ఆపలేం…ముద్దు ఫొటోలతో సీరియల్ నటి సంచలన పోస్ట్.!
కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్రం మరో కఠినమైన నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన 75 జిల్లాల్లో ఈ మార్చి 31వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల లోను ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ఆంక్షలు విధించారు ముఖ్యమంత్రులు.
ఇది ఇలా ఉండగా… ‘నందిని’ సీరియల్ ఫేమ్ నిత్యారామ్ మాత్రం జనతా కర్ఫ్యూ సమయంలో కరోనా కారణంగా రొమాన్స్‌ని ఆపలేం అంటూ వింతగా పోస్ట్ చేసింది. ఆస్ర్టేలియాకు చెందిన గౌతమ్ అనే బిజినెస్‌మెన్‌ను వివాహం చేసుకున్న నిత్య రామ్ ‘కరోనా కారణంగా రొమాన్స్‌ని ఆపలేం’ అంటూ కొటేషన్ పెట్టి మాస్కులు ధరించి ముద్దు పెట్టుకుంటున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది.
కరోనా వైరస్ కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.మార్చి 22 అర్ధరాత్రి నుండి మార్చి 31 అర్ధరాత్రి వరకు గూడ్స్ రైళ్లు తప్ప ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు, సబర్బన్ రైళ్లు, కోల్‌కతా మెట్రో, కొంకణ్ రైవేలు సర్వీసులను మార్చి 31 వరకు రద్దు చేస్తున్నట్టు రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

75 జిల్లాలో మార్చి 31 వరకు లాక్ డౌన్….మన తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లాల్లో అంటే.? లిస్ట్ ఇదే.!
కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్రం మరో కఠినమైన నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన 75 జిల్లాల్లో ఈ మార్చి 31వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం….కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదు అయిన జిల్లాల్లో పూర్తి నిషేధ ఆజ్ఞలు అమలు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల చీఫ్ సెక్రెటరీలతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి కరోనా పరిస్థితిపై చర్చ జరిపి ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా త్వరలోనే ప్రకటనలు విడుదల చేస్తాయని తెలుస్తోంది.
తెలంగాణలోని ఐదు జిల్లాలు ::హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం.
ఆంధ్ర ప్రదేశ్ లో విజయవాడ ,విశాఖ,ప్రకాశం జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించాలని ఆదేశాలు జారీ చేసింది

మార్చి 22 అర్ధరాత్రి నుండి మార్చి 31 అర్ధరాత్రి వరకు గూడ్స్ రైళ్లు తప్ప ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు, సబర్బన్ రైళ్లు, కోల్‌కతా మెట్రో, కొంకణ్ రైవేలు సర్వీసులను మార్చి 31 వరకు రద్దు చేస్తున్నట్టు రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
జనతా కర్ఫ్యూ లెక్క చేయకుండా రోడ్ల మీదకి వచ్చిన వాళ్లకు హైదరాబాద్ పోలీసులు ఎలా బుద్ది చెప్పారో చూడండి
ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచచ్చిన విషయం అందరికి తెలిసిందే. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కట్టదిట్టమైన చర్యలు చేపట్టాయి. ఈ రోజు ఉదయం ఏడు గంటల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారు . జనతా కర్ఫ్యూను సక్సెస్ ఫుల్ చేసేందుకు హైదరాబాద్ పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. కూడళ్ల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేసి.. జనం రోడ్లపైకి రాకుండా చేస్తున్నారు,కొందరు వ్యక్తులు జనతా కర్ఫ్యూ లెక్కచేయకుండా హైదరాబాద్ లోని పంజాగుట్ట ప్రాంతం లో రోడ్ల పై తిరుగుతున్నారు,వీరిపై హైదరాబాద్ పోలీసులు చర్యలు తీసుకున్నారు,జనతా కర్ఫ్యూ ఉంది అని తెలిసి కూడా కారణం లేకుండా బయటకి వచ్చినందుకు వారికి ప్లకార్డు ఇచ్చి కూడళ్లలో ప్రదర్శింపజేశారు.ఇందులో ఎక్కువగా యువకులు ఉండడం గమనార్ధం .
#JantaCurfew || All those found on the roads without a valid reason are being stopped by cops and are made to stand holding these placards at junctions such as #Punjagutta, #Rasoolpura @HYDTP#JantaCurfew22march #CoronavirusPandemic#Hyderabad#COVID19outbreak pic.twitter.com/SGJvZAQGS1
— TOI Hyderabad (@TOIHyderabad) March 22, 2020

#HYDTPweCareForU In view of Janata Curfew @insptr_srnagar displaying placards to observe Janata curfew voluntarily. @AddlCPTrHyd #JanataCurfewChallenge pic.twitter.com/Pyu8xgaHXI
— Hyderabad Traffic Police (@HYDTP) March 22, 2020
జనతా కర్ఫ్యూ ఉన్నప్పటికీ కొందరు వాహనదారులు రోడ్ల మీదకి వచ్చారు ,వారిని హైదరాబాద్ పోలీసులు అడ్డుకొని మీకు దండం పెడతాం ఇంటికెళ్లిపోండి అంటూ హైదరాబాద్ పోలీసుల వేడుకున్నారు ,ఈ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది .

