మారుతి రావు ఆత్మహత్య చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. మారుతీరావు అంత్యక్రియలు మిర్యాలగూడలో పూర్తయ్యాయి. కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. తమ్ముడు శ్రవణ్ అన్న చితికి నిప్పంటించారు. ప్రణయ్ కుటుంబ సభ్యులతో కలిసి పోలీసు వాహనంలో వచ్చిన అమృత తండ్రిని చివరి చూపు చూడకుండానే కొన్ని సెకన్ల వ్యవధిలోనే వెను తిరిగింది. మారుతీరావు కుటుంబ సభ్యులు, స్థానికులు అమృత గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో కొంచెం సేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే ఆమె చివరి చూపు చూడలేకపోయింది.

ప్రణయ్ హత్య కేసు నుండి బయటపడేందుకు మారుతీ రావు ఎన్నో ప్రయత్నాలు చేసారు. ప్రణయ్ హత్యకు సంబంధించి 302 సెక్షన్ తోపాటు ఎస్సీ,ఎస్టీ చట్టం కిందా చార్జిషీటు నమోదైంది. దీంతో ప్రణయ్ అసలు ఎస్సి కాదు అని నిరూపించాలి అనుకున్నాడు మారుతీ రావు. అమృత ప్రణయ్ ఫ్యామిలీని రహస్యంగా ఫొటోలు తీశారు. వాళ్ళు చర్చి కి వెళ్లారు, గుడికి వెళ్ళరు అని ఆధారాలు చూపించాలి అనుకున్నాడు. మతం మారినట్లు ఫొటోల కంటే ఏదైనా పేపర్ ఎవిడెన్స్ ఉంటే బలంగా ఉంటుందని మారుతిరావుకు సూచించినట్లు లాయర్ సుబ్బారెడ్డి చెప్పారు.

మారుతీరావు ఆత్మహత్యపై ఆయన కూతురు అమృత నిన్న ఇలా స్పందించింది.. మారుతీరావు మరణవార్త అఫిషియల్‌గా తమకు సమాచారం లేదని తెలిపారు. నాన్న ఆత్మహత్య చేసుకున్నాడన్న సంగతి టీవీలో చూసే తెలుసుకున్నామని అమృత తెలిపారు.ప్రణయ్ హత్య తర్వాత తన తండ్రితో ఎప్పుడు కలవలేదని, కనీసం చూడలేదని తెలిపింది. ఇక చేసిన తప్పును తెలుసుకొని కూడా ఆత్మహత్య చేసుకున్నారేమో అని వ్యాఖ్యానించింది అమృత.

మారుతీ రావు చివరగా రాసిన లెటర్ లో అమృత గురించి ఇలా రాసారు. “తల్లీ అమృత.. అమ్మ దగ్గరికి వెళ్ళిపో”. అని రాసినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఇంకా చాలా విషయాలు అందులో రాసారు అంట. అమృతను ఎలాగైనా కలవాలని మిర్యాలగూడకు చెందిన వారితో కూడా రాయబారం పంపాడు. కానీ, అమృత మాత్రం ఏమాత్రం మెట్టు దిగలేదు. కూతురు దూరం కావడంతో పాటు కేసులు పెట్టడంతో మనస్తాపానికి గురైనట్లు,దాంతో కూతురు ఇక తన మాట వినదని నిర్ణయించుకోని ఆత్మహత్య విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు అని తెలుస్తుంది.



రామ్ చరణ్, మనోజ్, అల్లు అర్జున్, అల్లరి నరేష్ ఇలా అందర్నీ చిన్నప్పటి నుంచి చూశానని, వారంతా తనతో ఎంతో ప్రేమగా ఉంటారని చెప్పింది. ఝుమ్మంది నాదం సినిమా సమయంలో మమ్మీ అంటూ మనోజ్ గట్టిగా అరిచాడని తెలిపింది. మేజర్ చంద్రకాంత్ సమయం నుంచి మనోజ్ తనను మమ్మీ అనే పిలుస్తాడని చెప్పుకొచ్చింది. మేజర్ చంద్రకాంత్ సినిమాలో మనోజ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు . అదే చిత్రంలో సుధ మోహన్ బాబు అక్కగా నటించారు.
చిరంజీవితో సుధ ప్రయాణం గ్యాంగ్ లీడర్ సినిమా కంటే ముందు నుండి ఉంది . ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో అనేక సినిమాల్లో సుధ నటించారు. వాటిల్లో ఆమెలో సుధ పోషించిన పాత్రకి అభినందించకుండా ఉండలేం, కోడల్ని హింసిస్తున్న భర్త కోటాశ్రీనివాసరావుని చంపే సీన్లో సుధలోని మరోయాంగిల్ నటన చూడొచ్చు. అప్పటి వరకు సౌమ్యమైన పాత్రలు పోషించిన సుధ , ఆ పాత్రతో తనలోని రౌద్రాన్ని చూడొచ్చు.





















