ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో వాదనలు సీరియస్ గా జరిగాయి. ఆ తరువాత ఈ కేసు విచారణను శుక్రవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
శుక్రవారం నాడు మధ్యాహ్నం రెండు గంటలకు తదుపరి విచారణ చేపడతామని కోర్టు వెల్లడించింది. అయితే ఈరోజు (మంగళవారం) ఇరుపక్షాల లాయర్లు హోరాహోరీగా తమ వాదనలు వినిపించారు. ఏపీ గవర్నమెంట్ తరఫున లాయర్ ముకుల్ రోహత్గి, చంద్రబాబు తరఫున హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఈ కేసులో ముఖ్యంగా సెక్షన్ 17A చుట్టూ వాదనలు జరిగాయి. చంద్రబాబు తరుపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ హరీశ్ సాల్వే 17A సెక్షన్‌కు చెందిన వివిధ అంశాలు, గతంలో కొన్ని కేసుల్లో ఇచ్చిన తీర్పుల గురించి ధర్మాసనం ముందు ఉంచారు. వాటిలో రఫేల్ కొనుగోళ్ల విషయంలో యశ్వంత్ సిన్హా వేసిన పిటిషన్, అలాగే రఫేల్ కేసులో ఇచ్చిన తీర్పును కూడా కోర్టు ముందు ఉంచారు. రఫేల్ కొనుగోళ్ల పై 2019లో యశ్వంత్ సిన్హా వేసిన రివ్యూ పిటిషన్లను జస్టిస్ కేఎం జోసెఫ్ డిస్మిస్ చేసిన విషయాన్ని కోర్టుకు గుర్తుచేశారు.
బుల్లర్ కేసుతో పాటు పలు కేసులలో తీర్పులను వివరించిన సాల్వే, స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడు పై రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ చట్టబద్ధం కాదని అన్నారు. ఈ కేసులో బుల్లర్ కేసులో ఇచ్చిన తీర్పును పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నానని ధర్మాసనాన్ని సాల్వే కోరారు. చంద్రబాబు పై రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ ను తాను సవాల్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. దానిలో ఎక్కడా చంద్రబాబు నాయుడు పేరు లేదని సాల్వే వాదించారు. ఆ తరువాత ఏపీ సీఐడీ తరఫున లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.
రోహత్గీ వాదిస్తూ, 2018కి ముందు కొంతవరకు విచారణ జరిగి ఆగిపోయిందని, అంతేకాని విచారణ జరగలేదని కాదని వాదించారు. హైకోర్టులో విచారణ పూర్తి అయ్యాక పత్రాలు ఇచ్చామని, దానిని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదన్నారు. 2018 చట్ట సవరణ చేసిన అనంతరం చంద్రబాబును ఎఫ్ఐఆర్లో చేర్చితే, దానిని రాజకీయ ప్రతీకార చర్యగా వ్యవహరించకూడదని అన్నారు.
చంద్రబాబు మీద తగిన ఆధారాలు లభించిన అనంతరం 2021లో కేసు రిజిస్టర్ చేశారని, ఈ కేసులో ఆయనను ఎప్పుడు చేర్చినా కూడా విచారణ కొనసాగుతున్నట్లుగా పరిగణించాలని కోర్టులో వాదించారు. ఇక నేరం ఎప్పుడు జరిగిందో, అప్పుడు ఉన్న చట్టం ప్రకారంగానే విచారణ చేయాలని సుప్రీం కోర్టు ముందుకు తీసుకెళ్లారు. తదుపరి విచారణను సుప్రీం కోర్టు శుక్రవారంకు వాయిదా వేసింది.
Also Read: చంద్రబాబు నాయుడు లాయర్ కోర్టులో వినిపించిన వాదనలు ఏంటి..? అసలు ఏం జరిగిందంటే..?

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు 30 రోజులుగా జైల్లో ఉన్నారు. ఈ కేసులో సెప్టెంబరు 10న అరెస్ట్ అయిన చంద్రబాబు, రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అక్టోబరు 5న మూడవసారి ఆయనకు ఏసీబీ కోర్టు రిమాండ్ ను పొడిగించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు దాఖలు చేసిన 3 ముందస్తు బెయిల్ పిటిషన్లు ఏసీబీ కోర్టు కొట్టివేసింది.
ఫైబర్‌నెట్, అమరావతి రింగ్ రోడ్డు, అంగళ్లు కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు A-24గా, అమరావతి రింగ్ రోడ్డు కేసులో A-1 గా, అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబు A1గా ఉన్నారు. అయితే సీఐడీ అధికారులు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను కూడా ఏసీబీ కోర్టు తిరస్కరించింది.
మరో వైపు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఐడీ తన పై రిజిస్టర్ చేసిన కేసును కొట్టివేయాలని చంద్రబాబు తరపున దాఖలు అయిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బోస్, జస్టిస్ త్రివేదీ బెంచ్ ముందు సీఐడీ తరపున లాయర్ రోహత్గీ, మాజీ సీఎం చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా, హరీష్ సాల్వే, మనుషేక్ సింగ్ సింఘ్వీ వాదించారు. 17ఏ చుట్టూనే వాదనలు జరుగుతున్నాయి. రాజకీయల వల్ల కక్ష సాధింపుకు పాల్పడకుండానే సెక్షన్ 17ఏను తీసుకొచ్చారని లాయర్ హరీశ్ సాల్వే వాదిస్తున్నారు.


ఈ సంఘటన 2018 లో ఫిబ్రవరిలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ హెడ్ మాస్టర్ పేరు డి బాలు. తమిళనాడులోని విల్లుపురంలో మునిసిపల్ సెకండరీ పాఠశాలకు హెడ్ మాస్టర్ పనిచేస్తున్నారు. ఆయన పనిచేస్తున్న పాఠశాలకు ఆ ప్రాంతంలోని విద్యార్థులు హాజరుకాకపోవడం అనేది అక్కడ చాలా సాధారణ విషయం. దాంతో విద్యార్థులు పాఠశాలకు తీసుకురావడానికి ప్రత్యేకంగా ఏదైనా చేయాలని, అక్కడ ఉన్న కట్టుబాటును మార్చాలని డి బాలు నిర్ణయించుకున్నారు.
ఆ హెడ్ మాస్టర్ వయసు 56 ఏళ్ళు , ఆయన గత 30 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. చదువు మీద ఇంట్రెస్ట్ లేక పాఠశాల మానేసిన పిల్లలు, పాఠశాలకు హాజరు కానీ విద్యార్థులు, చదువును నిర్లక్ష్యం చేసే విద్యార్థుల ఇళ్ళకు ఆ హెడ్ మాస్టర్ ప్రతిరోజూ వెళతాడు. విద్యార్థుల తల్లిదండ్రులను పిల్లలను పాఠశాలకు పంపించమని వారిని అభ్యర్థిస్తాడు. ఒక విద్యార్థి క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్లడం లేదు. దాంతో బాలు మోకాళ్ళపై కూర్చుని చేతులు జోడించి చదువుకోమని వేడుకుంటున్నాడు.
విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరు కావాలని, బాగా చదువుకుని జీవితంలో పురోగతి సాధించాలని చెప్తూ బతిమిలాడుతున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు మరియు ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. విద్యార్థుల ఫ్యూచర్ కోసం ఈ హెడ్ మాస్టర్ గారు చేస్తున్న పనికి నెటిజెన్లు అభినందిస్తూ కామెంట్లు పెట్టారు.
మానసిక చికిత్స పొందుతున్న ఆ మహిళతో సాన్నిహిత్యం ఏర్పడడంతో ప్రమీల ఆమె గురించి అడిగింది. అప్పుడు సదరు మహిళ తాను మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాకు చెందినట్టుగా, తనకు ఇద్దరు కుమారులు ఉన్నారని తెలిపింది. మూడు సంవత్సరాల క్రితం తాను ఎక్కాల్సిన రైలు కాకుండా వేరే రైలులో ఎక్కానని చెప్పారు. ఆమెకు తన కుటుంబ సభ్యులను సంప్రదించడానికి వివరాలు కూడా లేకపోవడంతో పుదుక్కోట్టైలో చిక్కుకుపోయానని ఆ మహిళ చెప్పింది.
వివరాలు తెలుసుకున్న ఆ మెడికల్ స్టూడెంట్ ఆ మహికు సహాయం చేయాలని నిర్ణయించుకుంది. ఆ మహిళ ఫొటోను మరియు వివరాలను సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ వైరల్ కావడంతో ఆ మహిళ పేషెంట్ స్నేహితురాలికి ఆ పోస్ట్ కనిపించింది. స్నేహితురాలు వెంటనే వీడియో కాల్ చేసి మహిళతో మాట్లాడింది. గత శుక్రవారం ఆ మహిళను ఆమె భర్తతో మాట్లాడించారు.
వీడియో కాల్ తర్వాత, మహిళ కుటుంబం తరువాతి రోజు శనివారం ఆమెను కలవడానికి పుదుక్కోట్టైకి వచ్చింది. ఆ మహిళ తప్పిపోయినపుడు ఆమె కుటుంబసభ్యులు లోకల్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు. కానీ ఆ మహిళ ఆచూకీ దొరకలేదు. దాంతో ఆమె మరణించి ఉంటుందని అనుకున్నారు. మానసిక చికిత్స వల్ల మహిళ పరిస్థితి మెరుగుపడిన తరువాత ఆమెకు తన వివరాలు గుర్తుకు వచ్చాయి. ఒక్క పోస్ట్ వల్ల మూడు సంవత్సరాల తర్వాత తన కుటుంబాన్ని కలుసుకుంది.
ఎనిమిదేళ్ల చిన్నారి తన నాన్న పై కోపం రావడంతో అతన్ని అమ్మడం కోసం “ఫాదర్ ఆన్ సేల్” నోటీసును వారి ఇంటి డోర్ మీద అంటించింది. ఆ నోటీసులో “తన నాన్నను రెండు లక్షలకు కొనుక్కోవచ్చని, మరిన్ని వివరాల కోసం డోర్ బెల్ కొట్టాలని” చిన్నారి పేర్కొంది.
ఈ నోటీసును చూసిన ఆ చిన్నారి తండ్రి సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పోస్ట్ చేసారు. అందులో తన విలువ అంత తక్కువ కాదని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ నోటీస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక ఎనిమిదేళ్ల పాప తన నాన్నని రెండు లక్షల రూపాయలకు అమ్ముతున్నట్లు రాసిన నోటీసును ఇంటి బయట పెట్టటం చూసి నెటిజెన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఫన్నీ ఎమోజీలు పెడుతున్నారు.
కొందరు నెటిజెన్లు తండ్రిని అమ్మకానికి పెట్టిన ఎనిమిదేళ్ల చిన్నారి తెలివితేటలకి వివిధ రకాల కామెంట్లు, రియాక్షన్స్ ఇస్తున్నారు. పలువురు నెటిజన్లు చేసిన ఫన్నీ కామెంట్లలో కొన్నిటికి ఆ చిన్నారి తండ్రి సమాధానం కూడా ఇచ్చారు. ఈ రోజు సోషల్ మీడియాలో తాను చూసిన హాస్యాస్పదమైన విషయం ఇదే అని ఒక నెటిజెన్ కామెంట్ చేశారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఈ పోస్ట్ పై స్పందిస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్స్ లో ఈ పోస్ట్ ని 29 వేల మందికి పైగా చూశారు. వందల మంది నెటిజెన్లు ఈ పోస్ట్ ను లైక్ చేశారు.
అయితే, కేసీఆర్ కన్నా ముందు నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, ఇందిరా గాంధీ, ఎన్టీఆర్ వంటి చాలా మంది నాయకులు రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. అయితే ఇలా పోటీ చేయవచ్చా ఆనే విషయం పై ఎన్నికల కమిషన్ 2018లో సుప్రీంకోర్టులో వాదన వినిపించింది. సెక్షన్ 33(7)ను సవరించి ఒక అభ్యర్థి ఒక స్థానం నుండి మాత్రమే పోటీ చేసేలా రూల్స్ ను మార్చాలని, అది కుదరకపోతే రెండు స్థానాల నుంచి పోటీ చేసిన అభ్యర్థి రెండు చోట్ల గెలిస్తే, వారు వదులుకున్న నియోజకవర్గానికి జరిగే బై ఎలెక్షన్స్ ఖర్చును వారే భరించాలని ప్రతిపాదించింది.
ఇక అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు లక్షలు, లోక్ సభ నియోజకవర్గానికి పది లక్షలు ఖర్చు భరించాలని ఎలెక్షన్ కమిషన్ ప్రతిపాదించింది. సెక్షన్ 33(7) ప్రకారం ఒక అభ్యర్థి రెండు నియోజవర్గాల నుంచి ఒకేసారి పోటీ చేయవచ్చు. దీనిని 1996లో చట్ట సవరణ ద్వారా కలిపారు. 1996కి ముందు ఎలెక్షన్స్ లో అభ్యర్థులు ఒకేసారి ఎన్ని స్థానాల నుంచైనా పోటీ చేసే అవకాశం ఉండేది. ఈ సవరణ తరువాత 2 స్థానాలకు పరిమితం చేశారు.
ఒకప్పుడు నడిచిన డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి తీసుకొస్తే బాగుంటుందని నెటిజన్లు కొన్ని రోజుల క్రితం ట్విట్టర్ వేదికగా మినిస్టర్ కేటీఆర్ ని కోరారు. వారి రిక్వెస్ట్‌కు అంగీకరించిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులు మళ్లీ తీసుకొస్తామని హామీ కూడా ఇచ్చారు. ఆ మాట ప్రకారం, డబుల్ డెక్కర్ బస్సులను ఇటీవల తీసుకొచ్చారు. 12 కోట్ల రూపాయలు వెచ్చించి,హెచ్ఎండీఏ సహకారంతో 6 ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించారు.
‘జాయ్ రైడ్’ పేరుతో ఈ బస్సులను ఉచితంగా తిప్పుతున్నారు. ఫిబ్రవరి నుండి ఈ బస్సులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నడుస్తున్నాయి. ఈ డబుల్ డెక్కర్ బస్సులను పంజగుట్ట నుండి హైటెక్ సిటీ వరకు నడుస్తాయి. ఈ రూట్ లో మూడు బస్సులు ఉన్నట్టు తెలుస్తోంది. మరో బస్సు ట్యాంక్ బాండ్ రూట్ లో నడుస్తుందని, ఇంకో బస్సు , సాలార్జంగ్ మ్యూజియం రూట్ లో తిరుగుతుందని సమాచారం.
ఆరవ బస్సు అబిడ్స్ రూట్ లో నడుస్తుందని తెలుస్తోంది. ఈ ఆరు బస్సుల్లోనూ ఉచితంగా ప్రయాణించవచ్చు. ఫ్రీ అని తెలియని చాలామంది ఈ బస్సుల రూపాన్ని చూసి, ఎంత టికెట్ ఉంటుందో అని, ఆ బస్సుల ఎప్పుడు వస్తాయో తెలియక కొంతమంది ఎక్కడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ బస్సుల్లో జర్నీ ఉచితం. టికెట్ అవసరం లేకుండా ప్రయాణం చేయవచ్చు.
మహానగరం హైదరాబాద్ లో దేశంలోనే అతి పెద్ద షాపింగ్ మాల్ అందుబాటులోకి వచ్చింది. కూకట్‌పల్లిలో లులు మాల్ నగరవాసులకు అతిపెద్ద షాపింగ్ స్పాట్‌గా నిలుస్తోంది. హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో రీసెంట్ గా మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం అయిన ఈ మాల్ స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. ఓపెనింగ్ రోజు ఈ మాల్ కి విపరీతమైన ప్రచారం లభించింది. నెట్టింట్లో కూడా ఈ మాల్ పై విపరీతంగా చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో నగర వాసులు ఒక్కసారైనా ఈ మాల్ ను సందర్శించాలనుకుంటారు. దీనికి తోడు 3 రోజుల సెలవుల రావడంతో పెద్ద సంఖ్యలో లులు మాల్ ను సందర్శిస్తున్నారు. ఈ మాల్ కు వచ్చే జనాల వల్ల కూకట్ పల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. శనివారం నాడు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కాగా, ఆదివారం నాడు వీకెండ్ కావడంతో మాల్ కు జనం ఒక్కసారిగా వేల సంఖ్యలో పోటెత్తారు. మాల్ లోపల జనాలు నిండిపోయి ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఎక్కడ చూసినా జనాలే ఎస్కలేటర్లు, బిల్లింగ్ కౌంటర్లు ఇలా అన్నీ చోట్ల పూర్తిగా జనాలతో మాల్ నిండిపోయింది.
ఈ రద్దీలో కొంతమంది మాల్ లో అందినంతవరకు దోచుకున్నారు. ఆహార పదార్థాలను సీసీ కెమెరాల కళ్లుగప్పి మరీ దోచేశారు. మాల్లో ఉన్న ఆహార పదార్థాలన్నిటిని కస్టమర్లు తినేశారు. బిస్కెట్లు, సమోసాలు, ఫ్రూట్స్, కూల్ డ్రింక్స్, ఏది చేతికి దొరికితే దానిని తినేశారు. కొంతమంది సగం తినేసి సగం మాల్ లో నచ్చినట్టు విసిరి పడేశారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు చూసిన నెటిజెన్లు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ లో నగర వాసులు మన పరువును అంతర్జాతీయ స్థాయిలో తీసారని కామెంట్లు చేస్తున్నారు.