మెగాస్టార్ చీరంజీవికి సెకండ్ ఇన్నింగ్స్‌లో రిలీజ్ అయిన సినిమాలు అంత క్రేజ్‌ని తెచ్చిపెట్టలేదు. హిట్ అయ్యిందని చెప్పుకోదగ్గ సినిమా ఏదైనా ఉందంటే అది వాల్తేర్ వీరయ్య మాత్రమే. సైరా నరసింహారెడ్డి మంచి టాక్ వచ్చిన సరే.. అనుకున్నంత కలెక్షన్లు అయితే రాలేదు.
బడ్జెట్ వంద కోట్లు దాటిన.. ఆశించినంత స్థాయిలో అయితే సినిమా బిజినెస్ జరగలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గాడ్ ఫాదర్ ఏవరేజ్ టాక్ రాగా.. ఆచార్య, బోళాశంకర్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌గా నిలిచాయి. అందరికీ తెలిసిన కథలు.. అదే రీమేక్ సినిమాలు చేయడం వల్ల రిజల్ట్ నెగిటివ్ వచ్చిందని చీరంజీవి అభిప్రాయం.

కథలో కొత్తదనం లేకపోవడమే సినిమాలు హిట్ కొట్టటలేదని భావించిన చీరంజీవి.. ఈసారి జగదేకవీరుడు అతిలోకసుందరి వంటి ఫాంటసీ కథలతో వస్తున్నట్లు సమాచారం. వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో చీరంజీవి ఓ కొత్త కథతో మెగా 157 సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం యూవీ క్రియేషన్స్ 170కోట్ల వరకు ఖర్చు చేస్తుందని వార్త ప్రచారం అవుతోంది.

చీరంజీవి తక్కువగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్న.. ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ గురించి ఎక్కువగా బడ్జెట్ అవుతున్నట్లు సమాచారం. సైరా సినిమా తర్వాత మరో భారీ బడ్జెట్ సినిమా ఇదేనేమో.


పాతబస్తీలో ఉండే లియాఖత్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఆదివారం రాత్రి బిర్యానీ తినడానికి పంజాగుట్ట చౌరస్తాలో ఉన్న మెరిడియన్ హోటల్‌కు వచ్చాడు. రెండు బిర్యానీలు ఆర్డర్ చేసి, తింటూ ఎక్స్ట్రా రైతా కోసం వెయిటర్‌ను అడిగారు. ఆ వెయిటర్ ఎన్నిసార్లు చెప్పినా తీసుకురాలేదు. దాంతో గట్టిగా అడిగారు. అలా అరిచినందుకు హోటల్ సిబ్బంది లియాఖత్ ను చితకబాదారు. అతని ఫ్రెండ్స్ 100కు కాల్ చేయగా, పోలీసులు వచ్చి, వారిని బయటకు తీసుకొచ్చారు. కానీ హోటల్ సిబ్బంది పోలీసుల ముందే మరోసారి లియాఖత్ మరియు అతని ఫ్రెండ్స్ పై దాడి చేశారు.
ఆ తరువాత పోలీసులు లియాఖత్‌తో పాటుగా మెరిడియన్ హోటల్ సిబ్బందిని కూడా పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అయితే సిబ్బంది చేతిలో గాయపడిన లియాఖత్ ఆయాసం వస్తోందని, తనని ఆసుపత్రికి తీసుకెళ్లాలని కోరాడు. కానీ పోలీసులు పట్టించుకోకుండా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. స్టేషన్ లో లియాఖత్ మాట్లాడుతూనే కుప్ప కూలిపోయాడు. హాస్పటల్ కి తరలించగా, అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.
సమాచారం తెలిసిన లియాఖత్ ఫ్యామిలీ మెంబర్స్ హాస్పటల్ కు వెళ్ళి ఆందోళన చేశారు. దాడి జరిగిన వెంటనే పోలీసులు లియాఖత్ హాస్పిటల్‌కు తీసుకెళ్లకపోవడం వల్లే మరణించాడని అతని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఈ ఘటన పై హత్యనేరం కింద ఆ హోటల్ సిబ్బంది పై కేసు రిజిస్టర్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పంజాగుట్ట ఎస్సై శివశంకర్ మరియు హెడ్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.

బీబీసి న్యూస్ తెలుగు కథనం ప్రకారం, సీఐడీ పోలీసులు చంద్రబాబును అరెస్ట్ చేసిన తరువాత సీఆర్పీసీ సెక్షన్ 50(1)(2) క్రింద నోటీసు ఇచ్చి, ఆయనను అరెస్టు చేస్తున్నట్లుగా ప్రకటించారు. అలాగే చంద్రబాబు మీద సెక్షన్ 120 (బి), 166, 167, 418, 420, 465, 468, 471, 409, 201, 109 రెడ్ విత్ 34, 37 ఐపీసీ సెక్షన్లు, ఇవి కాకుండా 1988 అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 12, 13(2) రెడ్ విత్ 13(1)(సి), (డి) కింద కేసును రిజిస్టర్ చేశారు. దీంతో చంద్రబాబు నాయుడి పై పై పెట్టిన ఆ సెక్షన్లు ఏమిటి? అవి ఏం చెబుతున్నాయనేది హాట్ టాపిక్ గా మారింది.
ఈ విషయం పై తెలంగాణ హైకోర్టు సీనియర్ లాయర్ లక్ష్మీనారాయణ బీబీసీతో మాట్లాడుతూ, ఈ సెక్షన్లను ఎలాంటి సందర్భంలో పేర్కొంటారు అనేది, ఆ సెక్షన్లు రుజువైతే ఎలాంటి శిక్షలు పడుతాయనే విషయాన్ని వివరించారు. ‘ఇవి నాన్ బెయిలబుల్ సెక్షన్లు అని సీఐడీ నోటీసులుఇచ్చింది. అంటే బెయిల్ రాకూడదనే విధానంలో కేసులు పెట్టినట్లుగా, ఈ సెక్షన్లు, తీవ్రతను బట్టి శిక్ష పడే అవకాశం ఉంటుందని ’ అని చెప్పారు.

ఈ కేసులో కూడా విజయవాడ సిబిఐ కోర్టులో లూథ్రా చంద్రబాబు తరుపున వాదించారు. అయితే సిద్దార్ధ్ లూథ్రా దేశంలోనే టాప్ 10 లాయర్ల లో ఒకరు మాత్రమే కాదు. దేశంలో అత్యధిక ఫీజు అందుకునే లాయర్లలో ఒకరు. ఇలాంటి ఖరీదైన లాయర్ ను టిడిపి నియమించుకుంది. ఈ కేసును వాదించడానికి లాయర్ సిద్ధార్ధ్ లుథ్రా ప్రత్యేక ఫ్లైట్‌లో ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చారు.
లుథ్రా ఢిల్లీలో కాకుండా వేరే రాష్ట్రాలలో లేదా ప్రాంతాలలో కేసు వాదించడం కోసం రోజుకు ఫీజు రూ. 1.5 కోట్లు తీసుకుంటారని సమాచారం. అంతే కాకుండా లుథ్రా ప్రయాణానికి ప్రత్యేకమైన ఫ్లైట్ మరియు లగ్జరీ కారుతో పాటుగా స్టార్ హోటల్లో వసతి ఏర్పాటు చేయాలని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో శనివారం తెల్లవారుజామున నంద్యాలలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి, 24 గంటలు పూర్తి అయ్యే సమయంలో ఆదివారం ఉదయం 6 గంటలకు పోలీసులు విజయవాడ ఏసీబీ కోర్టు ముందు ప్రవేశపెట్టారు. చంద్రబాబు తరుఫున సుప్రీంకోర్టు లాయర్ సిద్ధార్థ లూథ్రా గంటకు పైగా వాదించారు. ఆయన వాదన మొదలవగానే కోర్టు లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
స్కిల్ డెవలెప్మెంట్ కు సంబంధించి ఏపీలో రూ.241 కోట్ల స్కామ్ జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు సీమెన్స్ సంస్థ – డిజైన్‌టెక్ సంస్థలు రూ.3300 కోట్లకు ఒప్పందం చేసుకున్నాయి. దీనిలో ఏపీ ప్రభుత్వం 10శాతం నిధులు, 90 శాతం నిధులు సీమెన్స్ సంస్థ చెల్లించేలా అగ్రిమెంట్ జరిగింది. ప్రభుత్వం తరపున 10 శాతం నిధులు జీఎస్టీతో సహ రూ.370 కోట్లను చెల్లించింది. అయితే ప్రభుత్వం చెల్లించిన ఈ నిధులలో రూ.240 కోట్లు సీమెన్స్ సంస్థకు కాకుండా వేరే సంస్థకు బదలాయించారు.
చంద్రబాబు ఆర్డర్స్ తో ఈ నిధులు రిలీజ్ అయ్యాయని అభియోగం. స్కిల్‌కి సంబంధించిన పనులు జరగలేదని, ఎలాంటి శిక్షణ ఇవ్వలేదని ఆరోపణలు. ప్రభుత్వం రిలీజ్ చేసిన రూ.371 కోట్లు విదేశాలకు వెళ్లి, సుమారు 70 షెల్ కంపెనీల ద్వారా తిరిగి దేశానికి వచ్చేయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు పై నాన్‌బెయిలబుల్ కేసు రిజిస్టర్ చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 50(1)(2) ల కింద ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం నోటీసులు ఇచ్చింది.
అరెస్ట్‌కు సంబంధించిన పత్రాలను చంద్రబాబుకు, ఆయన లాయర్లకు ఇచ్చిన తరువాతే సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్ట్ చేసి, విజయవాడకు తరలించారని అంటున్నారు. చంద్రబాబు తన అరెస్టు పై స్పందిస్తూ, తాను ఎలాంటి తప్పూ చేయలేదని, ప్రజా సమస్యల పై ప్రశ్నిస్తుంటే అణిచివేస్తున్నారన్నారు. ఏ తప్పు చేశానో కూడా చెప్పకుండా అరెస్టు చేస్తున్నారని వాపోయారు.
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలోని ఆర్కే బీచ్ లోని ముప్పై ఐదు కిలోమీటర్ల సాగరతీరంలోని ఇసుక ఎప్పుడు బంగారు రంగులో మెరిసిపోతూ టూరిస్తులను, స్థానికులు ఆకర్షిస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చి ఇసుకతిన్నెల పై ఎంజాయ్ చేసేవారికి గురువారం నాడు షాక్ తగిలింది. బంగారు వర్ణంలో మెరిసిపోయే ఆర్కే బీచ్ లోని ఇసుక ప్రస్తుతం నలుపురంగులో కనిపిస్తుంది. కోస్టల్ బ్యాటరీ మరియు వుడా పార్క్ నడుమ ఉండే సముద్రతీరం నల్లగా మారింది. దాంతో విశాఖ ప్రజలు అక్కడ ఏం జరుగుతుందో అనే భయాందోళనలో మునిగిపోయారు.
ఆర్కే సముద్రతీరంలో బంగారు వర్ణంలోని ఇసుక నల్లగా మారిపోవడం ఎప్పుడూ చూడని విశాఖ ప్రజలు సముద్రతీరానికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. స్థానికులు ఈ విషయం గురించి మాట్లాడుతూ ఇసుక నల్లగా మారపోవడం ఇప్పటి దాకా ఎప్పుడు చూడలేదని అంటున్నారు. అయితే ఈ విషయం పై నిపుణులు మాట్లాడుతూ ఇసుకలో ఉన్న లైట్ మరియు హెవీ మినరల్స్ సపరేట్ కావడం వల్లే ఇసుక నల్లగా మారింది చెబుతున్నారు.
వాతావరణంలోని మార్పుల కారణంగా అలల ఉధృతి పెరిగిన సమయంలో తీరంలో ఉండే లైట్ మినరల్స్ నీటిలో కలిసి సముద్రంలో కలుస్తాయని, అయితే హెవీ మినరల్స్ మాత్రం బీచ్ లోనే ఉండిపోతాయని అంటున్నారు. హేవిగా ఉండే మినరల్స్‌లో అధికంగా ఇలమనైట్, జింకాన్, గార్నెట్, రుటైల్, సిలిమినైట్ లాంటివి ఉంటాయని చెబుతున్నారు. ఇసుక నల్లగా మారడానికి ముఖ్యంగా ఇలమనైట్, రుటైల్ లాంటి బరువున్న మినరల్స్ లే కారణం అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ రెండు హెవీ మినరల్స్ నల్లని రంగులో ఉంటాయని అందువల్లనే ఇసుక కూడా నల్లగా మారుతుందని చెబుతున్నారు.