ఇటీవల పంజాబ్ లో చెందిన ఒక సంఘటన చర్చలకి దారి తీసింది. వివరాల్లోకి వెళితే, పంజాబ్ కి చెందిన 10 సంవత్సరాల మాన్వి మార్చ్ 24వ తేదీన తన పుట్టినరోజు జరుపుకుంది. అక్కడే ఉండే ఒక బేకరీలో ఆన్ లైన్ ఆర్డర్ చేసి ఒక చాక్లెట్ కేక్ తెప్పించుకున్నారు. కేక్ తిన్న తర్వాత కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. కానీ కొంత సేపటి తర్వాత అందరూ కూడా అనారోగ్యానికి గురి అయ్యారు. మాన్వి, ఆమె సోదరి వాంతులు చేసుకున్నారు. నోరు పొడిబారుతోంది అని మాన్వి ఏడ్చింది. కళ్ళ ముందరే చివరి శ్వాస విడిచింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి, ఆక్సిజన్ అందించారు.
అయినా కూడా ప్రయోజనం లేకపోయింది. కేక్ లో వాడిన పదార్థాల వల్ల ఇలా జరిగింది అని అన్నారు. ఈ కేక్ లో సాచరైన్ అనే ఒక పదార్థాన్ని అధిక మొత్తంలో ఉపయోగించారు. ఇది ఒక ఆర్టిఫిషియల్ స్వీట్నర్. సాధారణంగా దీన్ని తినే పదార్థాలలో, తాగే పదార్థాలలో తక్కువ మొత్తంలో వాడుతారు. కానీ ఈ కేక్ లో మాత్రం దీన్ని ఎక్కువగా ఉపయోగించడంతో అనారోగ్య సమస్యలు వచ్చాయి. చక్కెరకి ప్రత్యామ్నాయంగా దీన్ని ఉపయోగిస్తారు. ఇది ఎక్కువగా వాడితే రక్తం లో ఉన్న గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. దీని వల్ల కడుపు నొప్పి వస్తుంది.
ఆ తర్వాత ఇది ఎక్కువగా అయితే, ఆ పదార్థం ఉపయోగించిన ఆహార పదార్థాన్ని ఎక్కువగా తీసుకున్న వ్యక్తి చనిపోయే అవకాశాలు ఉంటాయి. ల్యాబ్ రిపోర్ట్స్ లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ కేక్ తయారు చేసిన బేకరీ యాజమాన్యం మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం మాత్రమే కాకుండా, జరిమానా కూడా విధిస్తాము అని చెప్పారు. మాన్వి పుట్టినరోజు సెలబ్రేషన్స్ వీడియోని కూడా వాళ్ళు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు అని అనుకున్నారు. కానీ కొంత సేపటికి ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. దీని గురించి తెలుసుకునే వాళ్ళందరూ కూడా తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
watch video :
ਪਟਿਆਲਾ ਤੋਂ ਦੁਖਦਾਈ ਖ਼ਬਰ ਕਿਉਂਕਿ ਅਦਾਲਤ ਬਜ਼ਾਰ ਵਿਖੇ ਕੇਕ ਕਾਨ੍ਹਾ ਤੋਂ ਔਨਲਾਈਨ ਆਰਡਰ ਕੀਤਾ ਜਨਮ ਦਿਨ ਦਾ ਕੇਕ ਖਾਣ ਤੋਂ ਬਾਅਦ 10 ਸਾਲਾ ਬੱਚੀ ਮਾਨਵੀ ਦੀ ਮੌਤ ਹੋ ਗਈ ਅਤੇ ਪਰਿਵਾਰ ਦੇ ਪੰਜ ਮੈਂਬਰ ਬੀਮਾਰ ਹੋ ਗਏ। ਪੁਲਸ ਨੇ ਬੇਕਰੀ ਦੀ ਦੁਕਾਨ ਦੇ ਮਾਲਕ ਖਿਲਾਫ ਸ਼ਿਕਾਇਤ ਦਰਜ ਕਰ ਲਈ ਹੈ। pic.twitter.com/a32TooKeth
— Jes Bhullar (@jesbhullar) March 30, 2024
ALSO READ : ఆశ్చర్యానికి గురి చేస్తున్న “బాలకృష్ణ” ఆస్తుల విలువ…భార్య, కొడుకు పేరు మీద ఎన్ని కోట్లున్నాయంటే.?