ఇటీవల విడుదలైన టాప్ హీరోస్ సినిమాలన్నీ నిరుత్సాహ పరచగా మహేష్ బాబు మాత్రం వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు. డైరెక్టర్ పరశురాం దర్శకత్వంలో వచ్చిన మహేష్ బాబు “సర్కారు వారి పాట” మంచి వసూళ్లను రాబట్టింది.
మహేష్ తదుపరి చిత్రం త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేయనున్నట్టు ఇదివరకే ప్రకటించారు.
మహేష్ బాబు త్రివిక్రమ్ తో ఇంతకు ముందు అతడు, ఖలేజాలో నటించాడు. అతడు థియేటర్ లో యావరేజ్ టాక్ తెచ్చుకున్నా.. టెలివిజన్ లో మాత్రం బ్లాక్ బస్టర్ లకే బ్లాక్ బస్టర్ అయ్యింది. ఖలేజా థియేటర్ లో మెప్పించకపోయినా టెలివిజన్ లో ఆకట్టుకుంది. అయితే వీరిద్దరి కలయికలో వచ్చే హ్యాట్రిక్ మూవీపై ఇటు గురూజీ అభిమానులకు, మహేష్ ఫాన్స్ కి భారీ అంచనాలు ఉన్నాయి.
త్రివిక్రమ్ భీమ్లా నాయక్ షూటింగ్ లో, మహేష్ సర్కారు వారి పాట షూటింగ్ లో ఉండడంతో ఈ సినిమా పట్టాలు ఎక్కడానికి ఆలస్యం అవుతూ వచ్చింది. భీమ్లా నాయక్ సినిమా విడుదల అనంతరం ఈ సినిమాకు సంబంధిన డిస్కషన్ కోసం ఆ మధ్య సర్కారు వారి పాట షూటింగ్ లో ఉన్న మహేష్ ని దుబాయ్ వెళ్లి మరీ కలిశారు డైరెక్టర్ త్రివిక్రమ్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ థమన్.
ఈ సినిమా జూన్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని ఇంతకు ముందు ప్రకటించారు కానీ అనివార్య కారణాల వల్ల ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పుడు జూ లై 2వ వారం నుంచి ప్రారంభించనున్నారు అని సమాచారం. ఈ సినిమాకు పూజ హెగ్డే కథానాయిక కాగా, థమన్ మ్యూజిక్ డైరెక్టర్. హారిక హాసిని క్రియేషన్స్ లో తెరకెకించనున్నారు. ఇది పూర్తయ్యాక మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వం వహించే పాన్ ఇండియా మూవీ నటించనున్నాడు.