చాలా మందికి మొబైల్స్ లో గేమ్స్ ఆడడం సరదాగా ఉంటుంది. కానీ, ఏ గేమ్ ఆడినా అందులో మనలని ఇరిటేట్ చేయడానికి యాడ్స్ తప్పకుండ ఉంటూనే ఉంటాయి. ఆన్ లైన్ గేమ్స్ సంగతి పక్కన పెడితే.. ఆఫ్ లైన్ లో ఆడే గేమ్స్ కి కూడా ఈ యాడ్స్ బాధ తప్పడం లేదు. ఈ యాడ్స్ కి చెక్ పెట్టాలంటే ఒక్కటే సొల్యూషన్ ఉంది.
అదేంటంటే.. మీరు గేమ్స్ ఆడే టైం లో.. మీకు ఎలాంటి కాల్స్ రావు అనుకుంటే ఫోన్ లో ఏరోప్లేన్ మోడ్ ను ఆన్ చేయండి. అప్పుడు మీరు ఎంత సేపు ఆదుకున్న మీకు యాడ్స్ రావు. ఒకవేళ మీకు ఏమైనా ఇంపార్టెంట్ కాల్స్ వస్తాయి అనుకుంటే ఈ మోడ్ ను ఆన్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే గేమ్స్ కోసం ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేస్తే.. మీకు కాల్స్ రాకపోవచ్చు.