టైం టేబుల్ అనే పదం ప్రతి విద్యార్థికీ పరిచయమే.. చిన్నతంలో మన స్కూల్లో టైం టేబుల్ ప్రకారం అన్ని సబ్జెక్ట్‌లు నేర్పిస్తూ ఉండేవారు. టైం టేబుల్ ఫాలో అవుతూ టీచర్స్ మనకు క్రమశిక్షణ అలవాటు చేస్తుంటారు . అలాగే మనం కొంచెం పెద్దయిన తర్వాత కూడా ఏ పని ఏ విధంగా చేయాలని ఓ టైం టేబుల్ నిర్ణయించుకుని ఉంటాం.
అయితే అసలు విషయానికి వస్తే కేవలం ఆరు సంవత్సరాలు తన కొడుకు కోసం ఒక టైం టేబుల్ సిద్ధం చేసింది ఓ మాతృమూర్తి . ఈ టైం టేబుల్ ఇప్పుడు సోషల్ మీడియాల పుణ్యమా అని వైరల్ గా మారి నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంది.

ఆ తల్లి ఈ టైం టేబుల్ ని ఎలా సెట్ చేసిందంటే ఉదయం 7:50 అలారం సమయమని రాసింది. బెడ్ పై నుంచి ఎనిమిది గంటలకు లేవాలి. అదేవిధంగా ఏ టైం కి బ్రష్ చేయాలి, ఏ టైం కి బ్రేక్ ఫాస్ట్ చేయాలి, ఈ టైంకి ఆడుకోవాలి, ఈ టైంకి చదువుకోవాలి, ఈ టైం కి క్లీనింగ్ చేయాలంటూ అంటూ నిద్రపోయే వరకు టైం టేబుల్ సెట్ చేసేసింది.
టైం టేబుల్ ఫాలో అవడానికి రూల్స్ కూడా ఉన్నాయండోయ్. ఈ టైం టేబుల్ ఫాలో అయ్యే సమయంలో ఏడవకూడదు, గట్టిగా కేకలు పెట్టకూడదు, పోట్లాడకూడదు అనే రూల్స్ కూడా ఉన్నాయి ఈ టైం టేబుల్ లో.
Also Read: విడాకుల రూమర్స్ పై స్పందించిన హేమచంద్ర, శ్రవణ భార్గవి..! ఇది మంచి విషయమే అంటూ..?

అంతేకాదండోయ్ పిల్లవాడు ఖచ్చితంగా టైం టేబుల్ ఫాలో అయిపోతే రోజుకు పది రూపాయలు ప్రైస్ మనీ ఇస్తారంట. వారం రోజులు ఫాలో అయిపోతే వంద రూపాయల ప్రైజ్ మనీ అంటూ కొడుకు కోసం టైం టేబుల్ సెట్ చేసింది ఆ తల్లి. ఈ టైం టేబుల్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి హల్చల్ చేస్తుంది. నెటిజెన్లు సైతం ఈమె టైం టేబుల్ రూల్స్ ఫిదా అయిపోయారు. ఏమి క్రమశిక్షణలో పెట్టావు తల్లి కొడుకు ను అంటూ కామెంట్ చేస్తున్నారు.
Also Read: హెల్మెట్ మ్యాన్: రెడ్ సిగ్నల్ పడగానే ఇతను డాన్స్ ఎందుకు చేస్తాడో తెలుసా.?

ఆధ్యాత్మిక గురువు మొరారీ బాపు అయోధ్య రామ మందిర నిర్మాణానికి అతిపెద్ద విరాళాన్ని అందించారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు మొరారీ బాపు రామ మందిర నిర్మాణానికి అత్యధిక విరాళం ఇచ్చినట్టు ప్రకటించారు. మొరారీ బాపు గుజరాతీకి చెందిన ఆధ్యాత్మిక గురువు, రామ కథా పారాయణుడు.
1946లో గుజరాత్ లో జన్మించిన మొరారీ బాపు రామాయణ ప్రతిపాదకుడు. 60 ఏళ్ళుగా పండితుడు రామ కథా పఠనం ద్వారా సనాతన ధర్మం యొక్క ప్రాథమిక సూత్రాలను దేశ విదేశాల్లో చెబుతూ వస్తున్నారు. రామజన్మభూమి ట్రస్టుకు ఇప్పటికే రూ.11.3 కోట్లు ఇచ్చామని బాపు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కథ ప్రదర్శన, విదేశాల నుండి సేకరించిన మిగిలిన నిధులను రామజన్మభూమి తీర్థ ట్రస్ట్‌కు చేరుస్తారు. ఇలా మొత్తం రూ.18.6 కోట్ల విరాళాలు సేకరించిన మొరారీ బాపు ట్రస్ట్‌కు అందించారు.
శాంతియుతంగా అయోధ్య వివాద పరిష్కరించుకోవాలని మొరారీ బాపు పిలుపునిచ్చారు. రామ భక్తుడైన మొరారీ బాపు రామమందిరం ప్రారంభోత్సవంతో మనసు నిండిపోయిందని చెప్పారు. రాముడు ఏ ఒక్క దేశానికి లేదా వర్గానికి చెందినవాడు కాదని రాముడు అందరికీ చెందినవాడని అంటారు. రామ్ లల్లా దీక్ష తరువాత, ఫిబ్రవరి 24 నుండి మార్చి 3 వరకు మొరారీ బాపు అయోధ్యలో కథను ప్రదర్శించనున్నారని తెలుస్తోంది.
“ఒకే చోట కదలకుండా ఎక్కువ సేపు కూర్చుని ఉండటం ఆరోగ్యానికి మంచిది కాదు. అయితే కూర్చుని ఉన్నప్పుడు కాళ్ళను తరచూ ఊపడం లేదా కదిలించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని” అని న్యూట్రిషనిస్ట్‌గా యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్‌లో వర్క్ చేసే జానెత్ కాడే వెల్లడించింది. గంటల తరబడి కుర్చీలో కూర్చుని ఉండటం వల్ల, బాడీలోని మెటాబాలిజం రేటు తగ్గిపోతుంది. దానివల్ల బ్లడ్ షుగర్‌ను, బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేసే సామర్థ్యం పై ఎఫెక్ట్ పడుతుంది. అలాగే శరీరంలోని ఫ్యాట్ ను కరిగించేందుకు అడ్డంకిగా కూడా మారుతుంది.
తలుపులు, కిటికీలు, లేని ట్రైన్స్ ఉంటాయి. కొన్నిట్రైన్స్ బోగీలకు తలుపులు, కిటికీలు ఉండవు. పూర్తిగా క్లోజ్ చేసి ఉంటుంది. వీటిని ఎన్ఎంజీ ట్రైన్స్ అంటారు. మిగతా రైళ్లతో పాటుగా ఎన్ఎంజీ ట్రైన్ ను కూడా ఇండియన్ రైల్వే నడుపుతోంది. సాధారణంగా రైలు ప్రయాణం చేసేవారు ఎక్కడో ఒక చోట ఎన్ఎంజీ రైలును గమనించే ఉంటారు. ప్యాసింజర్ ట్రైన్స్ ను ఎన్ఎంజీ రైళ్లుగా మారుస్తారు.
ఎన్ఎంజీ రైలు అంటే..
ప్యాసింజర్ – ఎన్ఎంజీ రైళ్లు..
లోపల ఉండే సీట్లన్నీ తొలగిస్తారు. లైట్లు, ఫ్యాన్లు తీసివేసి, దృఢంగా మార్చడం కోసం ఐరన్ స్ట్రిప్స్ ను వాడతారు. దీనినే ఎన్ఎంజీ అంటారు. కార్లు, ట్రాక్టర్లు, మినీ ట్రక్కులు వంటి వెహికిల్స్ ను ట్రాన్స్ పోర్ట్ చేయడానికి ఉపయోగిస్తారు.
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో గాంధీ నడిచిన దారిని ఇప్పటికీ గాంధీ రోడ్డు అని పిలుస్తుంటారు. ఈ రోడ్ లో ఒక ఓల్డ్ బేకరీ ఉంది. అది ఇప్పటిది కాదు. స్వతంత్రం రాకముందు, 1933 లో ప్రారంభించిన రామకృష్ణ బేకరీ ఇది. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో ఈ షాప్ లో లభించే స్వీట్ చాలా ఫేమస్. ఈ బేకరీలో ఇప్పటికీ స్వాతంత్ర ఉద్యమ ఆనవాళ్లు కనిపిస్తుంటాయి. ఈ బేకరిని 1936 లో శ్రీ రామ కృష్ణయ్య మొదలుపెట్టారు. ఇప్పటికీ వారి వారసులు దానిని కొనసాగిస్తున్నారు.
గాంధీజీ 1921 లో ఈ మార్గం గుండా నడిచారని చెబుతారు. అంతటి ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాంతంలో గత తొంబై సంవత్సరాలుగా రామకృష్ణ బేకరీ ఒక ప్రత్యేక స్వీట్ ను అందిస్తోంది. ఆ స్వీట్ పేరు బాసంతి. దీనిని బాసుంది అని కూడా పిలుస్తారు. ఈ స్వీట్ ని చూస్తే స్థానీకులకే కాకుండా తిరుపతికి వచ్చే టూరిస్టులకు కూడా నోరూరుతుంది. పాలకోవాను ఇష్టపడే స్వీట్ లవర్స్ బాసంతిని సైతం అంతే ఇష్టంగా తింటారు.
బాసంతి కప్పు ధర 50 రూపాయలు. దీనిని ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది. ఈ బేకరిని గాంధీజీ కూడా సందర్శించారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఆ బేకరీలో కనిపిస్తాయి. “90 సంవత్సరాలుగా బాసంతి తయారీలో ఎటువంటి మార్పులు చేయలేదని, అప్పటిలానే ఇప్పుడు తయారు చేస్తూ వస్తున్నమని” నిర్వాహకులు కుమార్ వెల్లడించారు.













ఇన్ అర్బీటాల్ మాల్ ఎదురుగా ఉన్న రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ లో పదకొండు అయ్యిందంటే చాలు. అక్కడికి ఫుడ్ కోసం చాలామంది వస్తారు. సాయి కుమారి అనే మహిళ తన భర్తతో కలిసి రోడ్డు పక్కన ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు. ఆహారం టేస్టీగా ఉండడం, తక్కువ ధరలకు ఎక్కువ ఆహారం ఇస్తుండడంతో వారి ఫుడ్ బిజినెస్ బాగా సాగుతోంది. వంట అంతా ఆమె చేస్తుంది. ఆమె మాట్లాడుతూ, ఉదయం 5 గంటలకు వంటలు చేసుకుని, 11 గంటలకు షాప్ ఓపెన్ చేస్తామని చెప్పారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఒక పాప, బాబు అని చెప్పారు.
2011 నవంబర్ 29 కి స్టార్ట్ చేసారట. ఆమె గుడివాడకు చెందినవారు. ఈ బిజినెస్ ప్రారంభించక ముందు ఆమె మెషీన్ కుట్టేవారట. ఆమె భర్తకు ఫుడ్ బిజినెస్ అంటే ఆసక్తి ఉండడంతో, ఆయన సపోర్ట్ చేయడంతో ఆమె కూడా బిజినెస్ లో కి వచ్చారు. లాక్ డౌన్ సమయంలో అనాథలకు ఆహార సరఫరా చేసే వాళ్ళు సాయికుమారికి కాంట్రాక్ట్ ఇచ్చి ఆహారం వండించేవారట.
ఆమె సింగర్ హేమచంద్ర అమ్మగారింట్లో వంట చేసేవారు. బిజినెస్ విషయంలో వాళ్ళు కూడా ప్రోత్సహించారు. ప్లేట్ వెజ్ కి 60 రూపాయలు కాగా, నాన్ వెజ్ ప్లేట్ 80 రూపాయలకు అందిస్తున్నారు. బాగార వంటి రైస్ ఐటెమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. నాన్ వెజ్ లో గ్రేవీ చికెన్, ఫ్రైడ్ చికెన్, లివర్ ఫ్రై, బోటి కర్రీ, అండా కర్రీ, చేపల కర్రీ వంటి ప్లేట్ కు ఒక ఐటెం చొప్పున అందిస్తున్నారు. రోజుకు 300 వందల మంది వరకు వస్తారని వెల్లడించారు.