భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే భవిష్యత్తు గురించి చెప్పేవాటి పై కొంతమందికి నమ్మకం ఉండదు. కానీ ఎక్కువ శాతం జాతకాలను, జ్యోతిష్యాన్ని నమ్ముతుంటారు. భవిష్యత్తులో తమ ఆరోగ్యం, జీవితం ఎలా ఉంటుందనే విషయాల గురించి తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు.
ఇలాంటి వాటిలో జ్యోతిష్య శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ జ్యోతిష్యంలో కూడా అనేక పద్ధతులు ఉంటాయి. కొందరు అరచేతిలోని రేఖలను చూసి కూడా వారి భవిష్యత్తు గురించి చెప్తారు. అయితే అరచేతిలోని ఆయుష్హు రేఖను వ్యాపించిన విధానాన్ని బట్టి వారి ఆయుష్హు, ఆరోగ్యం గురించి తెలుసుకోవచ్చట. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం..
జ్యోతిష్యం చెప్పే పద్ధతులలో ‘హస్త సాముద్రికము’ ఒకటి. హస్త సాముద్రికము అంటే మనిషి అరచేతిలో ఉన్న రేఖల ఆధారంగా వారి భవిష్యత్తు గురించి తెలుపుతారు. ఈ శాస్త్రం ప్రకారం ఎవరైనా ఒకరి అరచేతిని చూసి చెప్పేటపుడు ముందుగా వారి ఆయుష్హు రేఖ గురించి చెప్పాలని అంటారు. ఈ ఆయుష్హు రేఖ చూపుడు వేలు మరియు బొటనవేలు మధ్య మొదలై మణికట్టు దగ్గర ముగుస్తుంది. ఈ రేఖ ఆరోగ్యం, ఆయుష్హు, అంగవైకల్యం, జబ్బులు మరియు శారీరక శక్తిని గూర్చి తెలుపుతుంది.
ఆయుష్హు రేఖ వ్యాపించి ఉన్న విధానాన్ని బట్టి వాటి ఫలితాలు..
- ఆయుష్హు రేఖ బొటనవేలు కుడి ప్రక్కన గల రెండవ కుజ స్థానం పై నుండి అర్ధ చంద్ర ఆకారంగా మణికట్టు వరకు లోతుగా ధృడంగా, స్పష్టంగా వ్యాపించి ప్రకాశవంతంగా ఉంటే వారు జీవితాంతం ఆయురారగ్యాలతో, ఐశ్వర్యంతో జీవిస్తారు. వీరు సుమారు వంద, నూట ఇరవై సంవత్సరాలు జీవిస్తారు.
- ఈ ఆయుష్హు రేఖ దారం వలె సన్నగా, కాంతివంతంగా ఉంటే ఎంతో మేధాసక్తి కలవారు అయ్యి, చురుకుదనంతో ఉంటారు.

- ఈ ఆయుష్హు రేఖ వెడల్పుగా ఉంటే కనుక అటువంటి వారు ఎక్కువగా శారీరక బలం కలిగి ఉంటారు. కాస్త మొరటుగా ఉంటారు. వీళ్ళకు ఆలోచనా శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల వీరు ఎవరో ఒకరికింద పనిచేస్తూ ఉంటారు. లేదా కూలిపని లాంటివి చేసుకుంటూ జీవితాన్ని గడుపుతారు.
- ఈ ఆయుష్హు రేఖ ఇంకా ఎక్కువ వెడల్పుగా ఉంటే, వీళ్ళు పూర్తిగా అజ్ఞానంతో ఉంటారు. సొంత నిర్ణయాలు కూడా తీసుకోలేరు.

- ఈ ఆయుష్హు రేఖ బొటనవేలుకు దగ్గరగా వ్యాపించి ఉంటే, వాళ్ళకు ఆయుష్హు తక్కువగా ఉంటుంది. వీళ్ళకు స్త్రీ వాంఛ చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఆడవారికి చాలా దూరంగా ఉంటారు. అంతేకాకుండా గురు స్థానం మరియు శుక్ర స్థానములు పల్లముగా ఉన్నట్లయితే లేదా లోతు ఎక్కువగా ఉన్నట్లయితే అటువంటివారు నపుంసకులుగా చెప్తారు.
- ఈ ఆయుష్హు రేఖ చూపుడు వెళుకు దగ్గరగా గురు స్థానం నుండి ప్రారంభం అయితే అటువంటి వారు పెద్ద రాజకీయ నాయకులుగా ఎదుగుతారు. లేదంటే గవర్నమెంటు ఉద్యోగంలో పెద్ద స్థాయిలో ఉంటారు.

- ఈ ఆయుష్హు రేఖ ప్రారంభంలో శిరో రేఖతో పెనవేసుకుని ఉన్నచో వాళ్ళు ప్రతిదానికి సందేహపడతారు. ఏ విషయంలోనూ సొంత నిర్ణయాలు తీసుకోలేరు. ప్రతిదానికి ఇతరులను సలహాలు అడుగుతూ ఉంటారు. పిరికితనం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా రిస్క్ చేయరు.
- ఈ ఆయుష్హు రేఖ ప్రారంభంలో శిరో రేఖ, ఆత్మ రేఖలతో కలిసి, ఈ మూడు రేఖలు ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్నట్లయితే వీళ్ళు తమ ప్రాణం తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.

- ఈ ఆయుష్హు రేఖకు కొద్ది దూరంలో శిరో రేఖ ఉన్నట్లయితే చాలా మంచి ఫలితాలను సూచిస్తుంది. ఇటువంటి వారికి ధైర్యసాహసాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు చాలా చురుకుగా ఉంటారు.
- ఈ ఆయుష్హు రేఖ ప్రారంభంలో చిన్నగా, పంగల కర్రలగా ఉంటే, అటువంటి వారు మంచి ప్రవర్తన కలిగి ఉంటారు.
- ఈ ఆయుష్హు రేఖ వ్యాపించే క్రమంలో ఎక్కడైనా తెగి పోయినట్టుగా ఉంటే చిన్న వయసులో మరణం సంభవిస్తుంది. తెగి పోయి వేరే రేఖలతో కలిసిపోయి చతురస్రం ఏర్పడితే మరణ ప్రమాదం నుండి బయటపడుతారు.
Also Read: బొటన వేలు ఇలా ఉన్నవారిని పెళ్లి చేసుకుంటే ఏం అవుతుందో తెలుసా..?







ఇతర రంగులతో పోల్చినపుడు పసుపు రంగు ఎక్కువగా ఆకర్షణీయంగా ఉంటుంది. రిఫ్లెక్షన్ ఎక్కువగా వచ్చే పసుపు రంగు ఇతరుల దృష్టిని కూడా వెంటనే ఆకర్షిస్తుంది. ఆ కారణం వల్లనే రైల్వేస్టేషన్లో ఉండే బోర్డులకి పసుపు రంగును ఉపయోగిస్తారు. పసుపు రంగు నేమ్ బోర్డులను దూరం నుండి కూడా ప్రయాణికులు సులభంగా రాబోయే స్టేషన్ పేరును గుర్తించగలరు. పసుపు రంగు బోర్డు పైన నలుపు రంగులో స్టేషన్ పేరుని రాస్తారు. ప్రయాణించే సమయంలో ఇతర రంగులు, వస్తువుల కంటే పసుపు రంగువాటి పైనే దృష్టి వెంటనే పడుతుంది. ఆ కారణంతోనే పసుపు రంగు బోర్డు, నలుపు రంగు అక్షరాలను రైల్వే శాఖ ఉపయోగిస్తుంది.
మరో విషయం ఏమిటి అంటే పసుపు సైన్ బోర్డు పై నలుపు రంగు అక్షరాలు మాత్రమే ఉండటానికి కారణం ఇతర రంగులు పసుపు రంగు పై హైలైట్ కావు. అందుకే నలుపు రంగుతో ఊరి పేర్లు రాస్తారు. ఇలా రాయడం వల్ల దూరం నుండి కూడా ఆ బోర్డు పై ఉన్నదానిని చదవవచ్చు. ప్రస్తుతం టెక్నాలజీ బాగా పెరగడంతో తరువాత ఏ స్టేషన్ రాబోతోంది అనేది రైలులో స్టేషన్ రాకముందే తెలుసుకోవచ్చు. లోకోపైలట్లకు జీపీఎస్ ద్వారా తరువాతి స్టేషన్ ఎంత దూరం ఉందనేది తెలుస్తుంది. అయితే గతంలో దూరం నుండే కనిపించే పసుపు బోర్డును చూడగానే లోకోపైలట్ రైలు వేగాన్ని తగ్గించేవారని అంటున్నారు.
Also Read: 





1. పాలకు పాములు ఆకర్షితులవుతాయా ?
2. పాముల తలపై వజ్రాన్ని కలిగి ఉంటాయా?
3. పాములు పగబడతాయా?
4. పాములు నాగస్వరానికి డాన్స్ చేస్తాయా?
5. పాములు తమ ఆహారాన్ని నములుతాయా? 




