టూటీ ఫ్రూటీల‌ను ఇలా చేస్తారా..?? నెట్టింట వైరల్ గా మారిన వీడియో..!!

టూటీ ఫ్రూటీల‌ను ఇలా చేస్తారా..?? నెట్టింట వైరల్ గా మారిన వీడియో..!!

by Anudeep

Ads

కేక్స్, ఐస్ క్రీమ్స్, డ్రింక్స్, డిజ‌ర్ట్స్ వంటి వాటిని తయారు చేసేట‌ప్పుడు చూడ‌డానికి అందంగా క‌న‌బ‌డ‌డానికి వాటిలో టూటీ ఫ్రూటీల‌ను వేస్తూ ఉంటాం. టూటీ ఫ్రూటీల‌ను వేయ‌డం వ‌ల్ల మ‌నం చేసే ప‌దార్థాలు రుచిగా ఉండటం తో పాటు.. చాలా అందంగా కూడా క‌న‌బ‌డ‌తాయి. అలాగే ఇవి తియ్య‌గా రుచిగా ఉంటాయి. ఇవి మ‌న‌కు ఎక్కువ‌గా బ‌య‌ట వివిధ రంగుల్లో దొరుకుతూ ఉంటాయి.

Video Advertisement

అయితే టూటీ ఫ్రూటీల‌ను వేటితో తయారు చేస్తారో మీకు తెలుసా..?? ఇవే కాదు.. మనం రోజు వారి జీవితం లో వాడే చాలా ఆహార పదార్థాలు ఏ పదార్థాలతో తయారవుతాయి అన్న విషయం చాలా మందికి తెలియదు కూడా.. ఇప్పుడు చూడటానికి అందం గా .. ఆకర్షణీయం గా కనిపించే టూటీ ఫ్రూటీల‌ను ఎలా తయారు చేస్తారో చూద్దాం.. టూటీ ఫ్రూటీల‌ను సాధారణంగా పచ్చి బొప్పాయి ముక్కలతో చేస్తారు. అంతే కాకుండా పుచ్చకాయ తొక్క తో కూడా టూటీ ఫ్రూటీల‌ను తయారు చేయవచ్చు.

how tutty fruity made of..!!

పచ్చి బొప్పాయి తో చేసేటప్పుడు ముందుగా తొక్క ని తీసి, వాటిని చిన్న ముక్కలుగా చేసుకొని ఉడికించుకోవాలి. అదే పుచ్చకాయ తొక్కతో చెయ్యాలి అనుకుంటే పుచ్చకాయ లోపలి భాగబ్బి తీసివేసి.. బయటి తొక్కని కూడా తీసి వాటిని ఉడికించుకోవాలి. ఆ తర్వాత వాటిని పంచదార పాకం లో వేసి.. బయటికి తీసిన తర్వాత మనకి నచ్చిన ఫుడ్ కలర్ యాడ్ చెయ్యాలి. ఆ తర్వాత వాటిని రెండు గంటలపాటు ఎండలో ఆరబెడితే టూటీ ఫ్రూటీ లు రెడీ అయిపోతాయి.

how tutty fruity made of..!!

అయితే చాలా మందికి టూటీ ఫ్రూటీలను పుచ్చకాయ ముక్కలతో చేస్తారు అని తెలియదు. దీంతో తాజాగా పుచ్చకాయ ముక్కలతో టూటీ ఫ్రూటీ లను ఎలా చెయ్యాలో చెప్పే వీడియో ఒకటి వైరల్ గా మారింది. దీంతో పుచ్చకాయలతో టూటీ ఫ్రూటీ లను చేస్తారా.. ఇది నిజంగా షాకింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.


End of Article

You may also like