భారత సంతతికి చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త కల్యంపూడి రాధాకృష్ణ రావు 102 ఏళ్ల వయసులో యూఎస్ లో కన్నుమూశారు. ఆయనకు ఈ ఏడాది స్టాటిస్టిక్స్‌లో అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఈ పురస్కారం ఆ రంగంలో నోబెల్ బహుమతితో సమానం.
75 సంవత్సరాల పాటు స్టాటిస్టిక్స్‌లో రాధాకృష్ణ రావు చేసిన సేవలకు గాను ఈ పురస్కారం వరించింది. కెనడాలో మే 1న సీఆర్ రావు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన గురించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం..
కల్యంపూడి రాధాకృష్ణ రావు బళ్లారిలోని తెలుగు కుటుంబంలో జన్మించిన పదిమంది సంతానంలో ఎనిమిదవ వాడు. రావు తండ్రి పోలీసు ఇనస్పెక్టరు. ఆయన నూజివీడు, నందిగామలో చదివారు. ఆ తరువాత వైజాగ్ లో స్కూల్ ఫైనల్ నుంచి డిగ్రీ వరకు చదువుకున్నారు. ఆయన ప్రతి క్లాస్ లో మొదటి ర్యాంక్ తెచ్చుకున్నారు. ఆ తరువాత ఆంధ్రా యూనివర్శిటీ నుండి గణితశాస్త్రంలో ఎం.ఎస్సి పట్టా పొందాడు. అక్కడి నుండి కలకత్తా వెళ్ళిన రావు 1943లో కలకత్తా యూనివర్సిటీ నుండి గణాంకశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు.
ప్రపంచవ్యాప్తంగా గణాంకశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ తొలిసారి పొందిన అతికొద్ది మందిలో రావు ఒకరిగా నిలిచారు. ఆయన యూనివర్శిటీ మొదటి ర్యాంకు సాధించారు. అదే సంస్థలో లెక్చరర్ గా చేరారు. అలాగే ఉద్యోగిగా పరిశోధనలు మొదలుపెట్టారు. వాటిలో భాగంగానే ఆయనకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పరిశోధనలు కొనసాగించే ఛాన్స్ ను పొందారు. ఆయన రీసెర్చ్ చేసిన అంశాలతో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ వారు రావు రచనను రిలీజ్ చేశారు. అప్పటికి రావు వయస్సు 26 ఏళ్లు మాత్రమే.
965లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని కింగ్స్ కాలేజీ నుండి పిహెచ్ డి పట్టా పొందాడు. రావు కేంబ్రిడ్జ్‌లోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ మరియు ఆంత్రోపోలాజికల్ మ్యూజియంలో పనిచేశాడు. ఆ తరువాత రావు ఇండియాకి తిరిగి వచ్చి స్టాటిస్టిక్స్ శాఖను స్థాపించారు. ఆ తరువాత ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్‌గా, మరియు ఎన్నో ముఖ్యమైన పదవులను చేపట్టిన రావు, ఎన్నో సత్కారాలు అందుకున్నాడు.
1968లో పద్మభూషణ్, 2001లో పద్మవిభూషణ్ బిరుదు అందుకున్నారు. 2002లో ప్రెసిడెంట్ జార్జ్ డబ్ల్యూ బుష్ చేతుల మీదుగా ‘నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్’ ను అందుకున్నాడు. 2017లో స్టాటిస్టిక్స్‌లో అంతర్జాతీయ బహుమతిని అందుకున్నాడు. రావు బ్లాక్వెల్ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. జన్యుశాస్త్రం, జీవావరణ శాస్త్రం మరియు సామాజిక శాస్త్రాలతో సహా అనేక అనువర్తిత సమస్యల పై పనిచేశాడు. భారతదేశంలో నమూనా సర్వే పద్ధతుల అభివృద్ధిలో కూడా ప్రధాన పాత్ర పోషించాడు.








జీవితంలో చాలామందికి ప్రేమ వివాహం చేసుకోవాలని అనుకుంటారు. కొందరు ప్రేమిస్తారు. కానీ వారి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళకుండానే ఆగిపోతుంది. ప్రేమలో విఫలం అయినవారు చివరికి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారు. కానీ ప్రేమను మర్చిపోలేరు. అయితే అసలు ఒక వ్యక్తికి ప్రేమ వివాహం జరుగుతుందా లేదా అనే విషయాన్ని తమ అరచేతిలో ఉండే గుర్తులను బట్టి తెలుసుకోవచ్చని హస్తసాముద్రిక శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
అరచేతిలో చూపుడు వేలు క్రింద ఉన్న స్థానాన్ని గురు స్థానం అని అంటారు.ఈ గురు స్థానం మీద క్రాస్ మార్క్ లాంటి గుర్తు ఉంటే అది ఖచ్చితంగా ప్రేమ వివాహాన్ని సూచిస్తుంది. అలాగే మరొక గుర్తు అరచేతిలోని శుక్ర స్థానం మీద ఉంటుంది. అరచేతిలో బొటన వేలు క్రింద ఉన్న స్థానాన్ని శుక్ర స్థానం అని పిలుస్తారు. ఈ శుక్ర స్థానం మీద ఒక చతురస్రం గుర్తు ఉన్నట్లయితే ప్రేమ వివాహాన్ని సూచిస్తుంది.
అరచేతిలోని చిటికెన వేలు క్రింద ఉన్న స్థానాన్ని బుధ స్థానం అంటారు. ఈ బుధ స్థానం చివర నుండి అంటే చిటికెన వేలు చివర, అరచ్చటి చివర నుండి అడ్డంగా వ్యాపించి, రవిస్తానం వరకు కూడా వ్యాపించి ఉన్నా, అది ప్రేమ వివాహాన్ని సూచిస్తుంది. అదే విధంగా అరచేతిలో బుద్ధి రేఖ మరియు ఆయుష్హు రేఖను కలుపుతూ ఒక నిలువు గీత ఉంటే అది కూడా ప్రేమ వివాహాన్ని సూచిస్తుంది. పైన చెప్పిన ఈ నాలుగు గుర్తులలో ఏ రెండు గుర్తులు మీ అరచేతిలో ఉన్నా, వారికి ఖచ్చితంగా ప్రేమ వివాహం జరుగుతుందని హస్త రేఖా సాముద్రిక శాస్త్రం చెబుతోంది.

















“అండమాన్ జైలు’ చిరంజీవి గారి ‘వేట’ సినిమాలో చూపించినంత భయంకరంగా ఉంటుందా?” అని కోరాలో అడిగిన ప్రశ్నకు
అప్పట్లో అక్కడికి వెళ్ళడానికి సముద్ర మార్గం ఒక్కటే. అక్కడ జైలు నిర్మాణం కూడా చాలా భయంకరంగా ఉంటుంది. మొత్తం జైలులో ఉన్న ఖైదీలు ఒకరికి ఒకరు కనపడని విధంగా ఉంటుంది. ఇకపోతే అక్కడ శిక్షలు చాలా చాలా భయానకంగా ఉంటాయి. ఉదాహరణకు కొన్ని గోనె సంచితో తయారు చేసిన చొక్కా ప్యాంట్ ను వేసి ఎండలో నిలబెట్టి శిక్షించడం. సరైన పనిముట్లు ఇవ్వకుండా చేతులతో ఎండిన కొబ్బరికాయల పీచు ఒలువడం, కొబ్బరి పీచుతో తాడు తయారుచేయటం.
మిగిలిన కొబ్బరి నుంచి గానుగ ద్వారా ఒక ఎద్దు లేదా ఆవు ఒక రోజులో తియ్యగలిగే నూనె కంటే 3 రెట్లు తీపించటం, ఎదిరిస్తే కొట్టడం, మరీ తిరగబడితే గోనె సంచి చొక్కా వేసి ఇనుప కడ్డీలతో కట్టేసి ఎండలో నిలబెట్టడం. పారిపోవాలని ప్రయత్నించి పట్టుబడిన వారిని ముగ్గుర్ని కలిపి ఒకేసారి ఉరి తీయడానికి అవసరమైన ఉరి కంబం. జైలు నిర్మాణానికి ముందు తయారుచేసిన నమూనా. ఖైదీలు తప్పించుకునే అవకాశం లేకుండా తలుపులను ఇనుముతో గట్టిగా తయారు చేశారు. ఖైదీలను ఇనుప తాళ్లతో కట్టివేసే వాళ్లు ఇక్కడ.
ఈ జైల్లో ఉన్న కిటీకీల గురించి వివరంగా చెప్పాలి. ఖైదీలను ఉంచే ప్రతి గదికి ఒక చిన్న కిటికీ ఉంటుంది. అయితే అవి అందరికీ తెలిసిన కిటికీల లాంటివి కాదు. చాలా ప్రత్యేకంగా కట్టినవి. ఎలా అంటే, గది లోపలున్న ఖైదీలు కిటికీ నుంచి బయటకు చూస్తే వాళ్లకు కేవలం కిటికీకి ఎదురుగా ఉన్న కొద్ది ప్రదేశం మాత్రమే కనిపిస్తుంది. బయట ఏం జరుగుతుందో తెలియదు. కానీ, బయటి నుంచి కిటికీ గుండా లోపలికి చూస్తేమాత్రం, గదిలోని ప్రతి భాగం పూర్తిగా కనిపిస్తుంది. ఖైదీలు లోపల ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? అన్నీ చూడొచు.
ఇప్పటికీ ఈ కిటికీల నిర్మాణం అంతు చిక్కని రహస్యమే. ఆ కిటికీ నా వెనక మీరు గమనించవచ్చు. జైలుకి వేయబడే తాళం, ఇది ఎంత పెద్దది అంటే కనీసం 10*10 అంగుళాల సైజులో ఉంది. శిక్ష అనుభవించిన ఖైదీలు రాసుకున్న కొన్ని విషయాలు. అక్కడి బాధలు, జైలు జీవితం గురించి చివరిగా అన్ని పోరాటాల తర్వాత, 1943 డిసెంబర్ 30న పోర్ట్ బ్లెయిర్ లోని జింఖానా గ్రౌండ్ లో నేతాజీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. బ్రిటీష్ పాలన నుంచి విముక్తి పొందిన తొలి భారత భూభాగం అండామాన్ దీవులే అని ఆ రోజు నేతాజీ ప్రకటించారు” అని చెప్పుకొచ్చారు .
నుపుర్ చాబ్రా ఇండియాకి చెందిన అమ్మాయే. అయితే ఆమె అమెరికాలో ఉంటున్నారు. నుపుర్ చాబ్రా మైనర్ అండ్ మార్కెటింగ్ లో బ్యాచిలర్ డిగ్రీని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియాలో పూర్తి చేశారు. అంతేకాకుండా బిజినెస్ ఎకనామిక్స్ లో, ప్రిన్సిపుల్స్ ఆఫ్ అకౌంటింగ్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను కూడా పూర్తి చేశారు. ఆమె సామాజిక మధ్యమాలలో యాక్టివ్ గా ఉన్నప్పటికీ, ఆమె ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ప్రైవేట్ లో ఉంది. అయితే నుపుర్ చాబ్రా కేరింగ్ హండ్స్ ఫర్ చిల్డ్రన్ అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నడుపుతున్నారు.
ఈమె ఏఐ టెక్నికల్ రీక్రుటర్ గా, మార్కెటింగ్ మీడియా మేనేజర్ గా ఫేస్ బుక్ లో ఆరు సంవత్సరాలు పని చేశారు. ప్రస్తుతం నుపుర్ చాబ్రా శాన్ ఫ్రాన్సిస్కోలో రా బ్లాక్స్ లో రీక్రుటింగ్ మేనేజర్ గా పని చేస్తున్నారు. ఒక వైపు ఉద్యోగం చేస్తూనే, మరో వైపు కేరింగ్ హండ్స్ ఫర్ చిల్డ్రన్ ఆర్గనైజేషన్ కు ఎక్స్క్యూటివ్ క్రియేటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
లెట్స్ హాంగిన్ అనే నాన్ ప్రాఫిటబుల్ సంస్థకు కో ఫౌండర్ గా ఉన్నారు. దీనిని ఉద్యోగం కోల్పోయినవారికి సహాయం అందించడం కోసం డిజైన్ చేశారు. ఈ సంస్థ ద్వారా 2020లో ఉద్యోగం కోల్పోయిన చాలామందికి హెల్ప్ చేసినట్లు తెలుస్తోంది. 2020లో నుపుర్ సాహిల్ అనే వ్యక్తిని అక్టోబర్ 17 న వివాహం చేసుకుంది.