దూరదర్శన్.. మనకి తెల్సిన మొట్టమొదటి న్యూస్ ఛానల్. ఎన్ని బులెటిన్స్ వచ్చినా ఈ న్యూస్ కి ఉన్న క్రేజ్ వేరు. అయితే ఈ ఛానల్ లో ఇంగ్లీష్ న్యూస్ చదివేవారు గీతాంజలి అయ్యర్. అప్పట్లో ఉదయం లేవగానే ప్రతి ఇంట్లో ఆమె గొంతే వినిపించేది. 30 ఏళ్ళు దూరదర్శన్ న్యూస్ రీడర్ గా పని చేసిన ఆమె తాజాగా మరణించారు.
ఆమె కొంతకాలంగా పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నారు. బుధవారం వాకింగ్‌కు వెళ్లి వచ్చిన తరువాత ఆమె కుప్పకూలిపోయారని, ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే చనిపోయారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. కోల్‌కతాలోని లోరెటో కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన గీతాంజలి అయ్యర్, 1971లో దూరదర్శన్‌లో చేరారు. ఈమె నాలుగు సార్లు బెస్ట్ యాంకర్ అవార్డు అందుకున్నారు. 1989లో ఇందిరాగాంధీ ప్రియదర్శిని అవార్డు కూడా గెలుచుకున్నారు.

జర్నలిజం చదువుకున్న గీతాంజలి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి డిప్లొమా కూడా అందుకున్నారు. అయ్యర్ వంటి వార్తా సమర్పకులు 1970ల మధ్యలో దేశవ్యాప్తంగా చాలా ప్రభావం చూపారు. దీనికి ముందు దూరదర్శన్ చిత్రహార్ మరియు కృషి దర్శన్ వంటి కార్యక్రమాలను మాత్రమే అందించింది. గీతాంజలి ఆ తర్వాత ఖాండాన్ అనే టీవీ సిరీస్‌లో కూడా నటించింది. కొన్ని ప్రకటనల్లో కూడా ఆమె నటించింది.

2002 లో దూరదర్శన్ లో మానేసిన తర్వాత అయ్యర్ యష్ బిర్లా గ్రూప్‌లో పబ్లిక్ అఫైర్స్ డిపార్ట్మెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా పని చేసారు . 2005లో, ఆమె అంతర్జాతీయ సేల్స్ డైరెక్టర్‌గా ఒబెరాయ్ గ్రూప్‌కి మారారు. ఆమె కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి సలహాదారుగా కూడా ఉన్నారు. ఆమె ఢిల్లీలోని బ్రిటీష్ హైకమిషన్ ప్రెస్ అండ్ పబ్లిక్ అఫైర్స్ విభాగానికి డిప్యూటి హెడ్‌గా కూడా మూడేళ్లపాటు పనిచేశారు.

ఆమె మృతికి ప్రముఖ రాజకీయ నాయకులు, సీనియర్ జర్నలిస్టులు సంతాపం తెలిపారు. ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పల్లవి శేఖర్. ఈమె కుమార్తె పల్లవి రచయితగా స్థిరపడ్డారు. ఈమె ప్రస్తుతం స్పెయిన్ లో నివసిస్తున్నారు.
Also read: “జూనియర్ ఎన్టీఆర్” లాగానే… తమ “ఇంగ్లీష్” యాక్సెంట్ వల్ల ట్రోలింగ్కి గురైన 7 నటులు..!

ఎన్ని రకాల లైట్లు..
హెడ్‌లైట్ ఎంత దూరం కనిపిస్తుంది..
రెడ్ లైట్ వెలిగినపుడు ఇంజిన్ షంటింగ్ కోసం రివర్స్ లో వెళుతున్న విషయం రైల్వే సిబ్బందికి అర్ధం అవుతుంది. ఇంజిన్ షంటింగ్ చేయడం కోసం ఇంకా ముందుకు వెళ్ళే సమయంలో వైట్ కలర్ లైట్ ను ఆన్ చేస్తారు.


ప్రతిరోజూ లక్షలాది మంది రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణించే సమయంలో కానీ, వాటి కోసం వేచి చూసే సమయంలో కానీ రైల్వే స్టేషన్ లో కనిపించే రైళ్ల పై చాలా రకాల గుర్తులు కనిపిస్తుంటాయి. వాటిలో ఎక్కువగా రైలు వెనకాల ఉండే ఎక్స్ గుర్తును దాదాపు అందరు చూసే ఉంటారు. ఈ గుర్తు రైలు చివరి బోగి పై చాలా పెద్దగా రాసి ఉంటుంది. అందువల్ల తేలికగా కనిపిస్తుంది.
నిజానికి ఈ పెద్దగా రాసిన ఎక్స్ గుర్తు ఎల్లప్పుడూ ట్రైన్ ఆఖరి బోగీ పై రాస్తారు. దీని అర్థం ఏమిటంటే ఆ గుర్తు ఉన్న బోగీ ఆ రైలు యొక్క ఆఖరి పెట్టె. ఇక ప్యాసింజర్ ట్రైన్ చివరి పెట్టెలో ఎక్స్ మాత్రమే కాకుండా ఎల్వి అనే గుర్తు లేదా అక్షరాలు కూడా ఉంటాయి. ఎల్వి అనగా లాస్ట్ వెహికల్ అని అర్ధం. ఈ రెండు గుర్తులు ముఖ్యంగా రైల్వే ఉద్యోగులకు మరియు అధికారులకు సంబంధించినవి.
ఒకవేళ రైలు చివరి బోగీ మీద ఎక్స్ లేదా ఎల్వి గుర్తు కనిపించకపోతే రైల్వే ఉద్యోగి లేదా అధికారి వెంటనే అలర్ట్ అయ్యి ఆ విషయన్ని సమీప కంట్రోల్ రూమ్‌కు సమాచారం చేరవేస్తాడు. ఈ రెండు గుర్తులు రైలు చివరి బోగీ పై కనిపించకపోతే ఆ రైలు యొక్క చివరి బోగీ లేదా రైలు కొంత భాగం ఆ ట్రైన్ నుండి వేరు అయ్యిందని అర్ధం.




మాన్యాలు, ఆస్తులు పోగొట్టుకున్న ఇతర పాలేగాళ్ళు రెడ్డి నాయకత్వంలో చేరారు. వీరిలో వనపర్తి, జటప్రోలు, మునగాల, హైదరాబాదుకు చెందిన సలాం ఖాన్, కర్నూలుకు చెందిన పాపాఖాన్,పెనుగొండ, అవుకు జమీందార్లు, కొందరు చెంచులు, బోయలు కూడా ఉన్నారు. 
కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ భారత దేశంలో తొలి సూపర్ ఫాస్ట్ ట్రైన్. రైల్వే చరిత్రలో లెజెండ్. అలాగే వేగంలో రారాజు అని చెప్పవచ్చు. ప్రస్తుతం రాజధాని, దురంతో, శతాబ్ది, వందేభారత్ ట్రైన్స్ వచ్చాయి. అయితే 46 సంవత్సరాల క్రితం వచ్చిన మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఇదే. ఇండియన్ హిస్టరీలో అత్యధిక వేగం కలిగిన మొట్టమొదటి రైలుగా పేరుగాంచింది.
1997లో మార్చి 6న మొదలైన ఈ సూపర్ ఫాస్ట్ రైలు గంటకు దాదాపు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రైలు హౌరా నుండి చెన్నై మధ్య 4 రాష్ట్రాల గుండా 25 గంటల్లో, 16 వందల 61 కి.మీ. ప్రయాణిస్తుంది. ఈ రైలు ప్రతీరోజూ దాదాపు 1661 కి.మీ. ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ చెన్నైలో మొదలయితే నాన్ స్టాప్ గా 431 కిలో మీటర్లు ప్రయాణించి 6 గంటల్లో విజయవాడ చేరుకుంటుంది.
క్షణాల్లో స్టేషన్ దాటుతుందంటే దాని వేగం అలాంటిది. 46 ఏళ్ళుగా నిరంతరాయంగా తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ వరకు ప్రయాణిస్తోంది. మొదట్లో వారానికి 2 సార్లు మాత్రమే నడిచేది. ఆ తర్వాత ఈ రైలుకు డిమాండ్ పెరగటంతో ఈ ట్రైన్ ను ప్రతిరోజూ నడుపుతున్నారు. గతంలో కూడా కోరమండల్ ఎక్స్ ప్రెస్ యాక్సిడెంట్ కి గురైంది.
అయితే ప్రస్తుతం జరిగిన ఈ యాక్సిడెంట్ మాత్రం చాలా పెద్దది. ఈ ట్రైన్ ను ప్రవేశపెట్టిన తరువాత ఇలాంటి భారీ ప్రమాదం జరగలేదు. ఇప్పటి దాకా లక్షలాది మందిని సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చిన కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ కు భారీ యాక్సిడెంట్ జరగటంతో దాని హిస్టరీని, స్పీడ్ ను ఆయా ప్రాంతాలవారు జ్ఞాపకం చేసుకుంటున్నారు.














