కోలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ హీరో, డీఎండీకే అధినేత కెప్టెన్ విజయ్‌కాంత్ కన్నుమూశారు. 71 ఏళ్ళ వయసులో ఉన్న కెప్టెన్, గత కొద్ది రోజుల నుండి అనారోగ్య సమస్యలతో హాస్పటల్ లో చేరిన ఆయన, చికిత్స తరువాత డిశ్చార్జ్ అయ్యి, ఇంటికి వెళ్లారు. ఆ సమయంలోనే ఆయన మరణించినట్టుగా వార్తలు వైరల్ అయ్యాయి.
విజయ్‌కాంత్ భార్య ఆయన చికిత్స తీసుకుంటున్నట్టుగా ప్రకటించారు. అప్పటి నుండి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. మళ్లీ ఆయన అస్వస్థతకు గురికావడంతో డిసెంబర్ 26న హాస్పటల్ కి తరలించారు. కరోనా బారిన పడినట్టు డాక్టర్లు తెలిపారు. వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటూ ఈ ఉదయం విజయ్‌కాంత్ తుదిశ్వాస విడిచారు.
విజయ్‌కాంత్ అసలు పేరు విజయరాజ్ అళగరస్వామి నాయుడు. ఆయన 1952లో మదురైలో ఆగస్టు 25న జన్మించారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్రను వేశారు. తమిళ సినీ లెజెండ్ లలో ఒకరిగా నిలిచిపోయారు. తన సినీ జీవితంలో తమిళ భాషలో మాత్రమే నటించి, కెప్టెన్ ప్రభాకర్ సినిమాతో కెప్టెన్ గా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రవేశారు. ఇనిక్కుం ఇలామైతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విజయ్‌కాంత్, తన కెరీర్ లో సుమారు 150కి పైగా చిత్రాలలో నటించారు. విజయ్‌కాంత్ నటించిన అనేక సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. ఆయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే.
ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాలలో విజయ్‌కాంత్ ఎంట్రీ ఇచ్చారు. 2005లో సెప్టెంబరు 14న డిఎండికె (దేశీయ ముర్పొక్కు ద్రావిడ కళగం) అనే పార్టీని స్థాపించాడు. తెలుగులో ద్రావిడ జాతీయాభివృద్ది సమాఖ్య అని అర్ధం. 2006 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో డిఎండికె పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేయగా, విజయ్‌కాంత్ పోటీ చేసిన స్థానం మాత్రమే విజయం సాధించింది.
2011 అసెంబ్లీ ఎలెక్షన్స్ లో ఎఐఎడిఎంకె పార్టీతో పొత్తు పెట్టుకుని, 41 స్థానాలలో పోటీ చేశారు. విజయ్‌కాంత్ పోటీ చేసిన 41 స్థానాల్లో 29 గెలుచుకోని డిఎండికె పార్టీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా డిఎంకె కన్నా ఎక్కువ స్థానాలను డిఎండికె గెలుచుకుంది. విజయ్‌కాంత్ రెండోసారి ఎమ్మెల్యే పదవిని చేపట్టాడు. ప్రతి పక్షనాయకుడిగా ఉన్నారు. ఆ తరువాత 2016లో జరిగిన ఎలెక్షన్స్ లో అపజయం పొందాడు. ఆ తరువాత అనారోగ్య సమస్యలతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన కన్నుమూయడంతో తమిళ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.








డిసెంబర్ 20న 191 మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 21న 8 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. జుబేర్ ఖాన్ రామ్‌గఢ్ నియోజకవర్గం నుంచి గెలువగా, యూనస్ ఖాన్ దివానా నుంచి గెలిచారు. సంస్కృతంలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం పై వీరిద్దరు స్పందించారు. యూనస్ ఖాన్ మాట్లాడుతూ “మేం మంచి పనిచేశామని ముస్లింలు సైతం ప్రశంసించారు” అని చెప్పారు. దేశంలో సంస్కృత భాష చాలా గొప్ప పురాతనమైన భాష అని, ఆ భాషలో ప్రమాణం చేయడం వల్ల ఎంతో గర్వపడుతున్నాను” అంటూ యూనస్ ఖాన్ వెల్లడించారు.
ఇక జుబేర్ ఖాన్ ఈ విషయం పై స్పందిస్తూ “సంస్కృతం మన దేశ పురాతన భాష. మేము భారత్ లోనే జీవిస్తున్న ఇండియన్ ముస్లింలం. అందువల్ల ఇక్కడి రాజ్యాంగాన్ని, సంస్కృతిని విశ్వసిస్తాం. సోదరభావం పై విశ్వాసం ఉంది. ప్రతి మతాన్ని గౌరవిస్తాం. సీనియర్ సెకండరీ దాకా నేను సంస్కృతం చదివాను. సంస్కృతంలో రెండోసారి ప్రమాణ స్వీకారం చేశాను. ముస్లిం అయిన నేను, ప్రమాణం సంస్కృతంలో చేయడం అందరికీ నచ్చింది” అంటూ జుబేర్ ఖాన్ వెల్లడించారు.
సీఎం జగన్ ఆరోగ్యంగా ఉండేందుకే మొదటి నుండి ప్రాధాన్యతనిస్తారు. దానికి తగ్గట్లుగా ఆహారం తీసుకుంటారు. ఆయనకి మామిడికాయ తురుముతో చేసే పులిహోర అంటే చాలా ఇష్టం. ఉదయం 4.30కి సీఎం జగన్ రోజు మొదవుతుంది. ఉదయం 4.30 గంటల నుండి గంట సేపు యోగా, జిమ్ లాంటివి చేస్తారు. 5.30కి న్యూస్ పేపర్స్ చదవడంతో పాటు ముఖ్యమైన అంశాల గురించి నోట్స్ తయారు చేసుకుంటారు. ఆ సమయంలో టీ మాత్రమే తీసుకుంటారు. 7 గంటలకు జూస్ తాగుతారు.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు బదులుగా డ్రైఫ్రూట్స్ తింటారు. ఇక పాదయాత్ర చేసేనపుడు కూడా జగన్ బ్రేక్ ఫాస్ట్ కి దూరంగానే ఉన్నారు. సమీక్షలు చేసే టైమ్ లో చాక్లెట్ బైట్స్ తింటారట. మధ్యాహ్నం భోజనంలో అన్నం కన్నా పుల్కాలను తినడానికి ఇష్టపడతారు. అప్పుడప్పుడు మాత్రం రాగిముద్ద, మటన్ కీమాను తింటారు. ఇక కుండపెరుగు లేకుండా మధ్యాహ్నం భోజనం ముగించరని చెప్తుంటారు. చిత్రాన్నం అంటే జగన్ కు చాలా ఇష్టం. సాయంకాలం టీ మాత్రమే తాగుతారు. ఆయనకు పల్లీలు, మొక్కజొన్న పొత్తులన్నా ఇష్టం. వీలైనపుడల్లా వీటిని తింటారు.
పళ్ల రసాలకు ప్రాధాన్యమిస్తారు. వారాంతంలో పూర్తిగా ఫ్యామిలితో గడిపే సీఎం జగన్, ఆదివారం వస్తే చేపల పులుసు, బిర్యానీ, మటన్ లాంటి వాటిని ఆరగిస్తారు. ఎన్నిరకాల వంటకాలు ఇష్టపడినా కూడా జగన్ మితంగానే తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. టూరిజం మంత్రి రోజా సీఎం జగన్ తీసుకునే ఎనర్జీ డ్రింక్ గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. లీటరు పాలలో, పచ్చి అల్లం వేసి మరగించి, గ్లాసు పాలు అయ్యే వరకు మరగిస్తారు. అలా కాచిన పాలను రోజు ఆయన తాగుతారని రోజా వెల్లడించారు. అది ఆరోగ్యానికి చాలా మంచిదని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన కొన్ని నెలలకే ఏపీ కొత్త రాజధానిగా అమరావతిని నిర్ణయించారు. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం జరిగిన తరువాత నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ 2015 అక్టోబర్ 22న శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత పనులు వేగంగా జరిగాయి. ముందు తాత్కాలికమైన సచివాలయం, శాసనసభ రెడీ చేసి, 2017 నుండి ఉపయోగిస్తున్నారు. ఆ తర్వాత తాత్కాలిక హైకోర్టు బిల్డింగ్ ను సిద్ధం చేశారు. ఇందులో 2019 నుండి కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. వాటితో పాటు శాశ్వత వసతి కోసం పలు బిల్డింగ్స్ నిర్మించడానికి పనులు కూడా మొదలయ్యాయి. అందులో ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ క్వార్టర్స్ దాదాపు ఎనబై శాతం పనులు పూర్తయ్యాయి.
సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణంలో వెచ్చించారు. అయితే రోడ్లు, భవనాలు అర్థాంతరంగా నిలిచిపోయాయి. అమరావతి నగరాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు భారీగా వెచ్చించాయి. దాదాపుగా ఇరవై వేల కోట్లకు పైగా ఉంటాయని అమరావతి జేఏసీ హైకోర్టుకు తెలిపింది. అమరావతి కోసం కేంద్రం ఇప్పటి వరకూ దాదాపుగా రూ. 1500 కోట్లు రిలీజ్ చేసింది.
“2021 నవంబర్ 23 లెక్కల ప్రకారంగా, అమరావతి అభివృద్ధి కోసం రూ. 8,572 కోట్లు వెచ్చించారు. అందులో మౌలిక సదుపాయాల కోసం చేసిన ఖర్చు రూ.5,674 కోట్లు, 3 వేల కోట్ల రూపాయలను వడ్డీలు, కౌలు చెల్లింపు, కన్సల్టెన్సీ చార్జీలు,పెన్షన్ల నిమిత్తం ఖర్చయ్యాయి. ఈ నిధులు అమరావతి బాండ్లు, హడ్కో లోన్లు, కన్సార్షియం ద్వారా సేకరించారు. వీటికి వడ్డీల చెల్లించే భారం తమ ప్రభుత్వం భరిస్తోంది” అని ప్రభుత్వ సలహాదారు అయిన సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
1976లో జన్మించిన కల్వకుంట్ల తారక రామారావు యూఎస్ లో ఎంబీఏ చేశారు. ఆ తరువాత అమెరికాలో కొన్నేళ్ల పాటు జాబ్ చేశారు. 2006లో తన జాబ్ కి రాజీనామా చేసి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ లో చేరి తన తండ్రి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ రాజకీయ ప్రవేశం చేశారు. జూన్ 2014లో తెలంగాణ తొలి ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.డైనమిక్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు సేవలందించారు. ప్రస్తుతం ప్రతి పక్ష ఎమ్మెల్యేగా ఉన్నారు.
వ్యక్తిగత జీవితానికి వస్తే, 2003లో డిసెంబర్ 18న కేటీఆర్, శైలిమల పెళ్లి జరిగింది. ఈ దంపతులకు హిమాన్షు రావు, అలేఖ్య రావు అనే పిల్లలు ఉన్నారు. సోమవారం నాడు వీరి పెళ్లిరోజు సందర్భంగా, 20 సంవత్సరాల క్రితం నాటి పెళ్లి ఫొటోను, భార్య పిల్లలతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన కేటీఆర్, “నా అందమైన భార్య శైలిమకు 20వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. గత 2 దశాబ్దాలుగా నాకు మద్దతుగా నిలిచినందుకు మరియు నాకు ఇద్దరు అందమైన పిల్లలను అందించినందుకు, ఈ ప్రయాణంలో గొప్ప భాగస్వామిగా ఉన్నందుకు ధన్యవాదాలు.
మన ప్రయాణం ఇలాగే మరెన్నో ఏళ్లపాటు కొనసాగాలని కోరుకుంటున్నాను.” అంటూ తన భార్య శైలిమకు పెళ్లి రోజు విషెస్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కేటీఆర్ పోస్ట్ చేసిన కొన్ని గంటలలోనే ఈ ట్వీట్ కు నెటిజెనల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పోస్ట్ కి రిప్లైగా కేటీఆర్ పెళ్లి ఫోటోలతో వీడియోలను క్రియేట్ చేసి షేర్ చేస్తున్నారు.