ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు మీద తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో ఉన్న భువనేశ్వరిని కలిసి మనోధైర్యాన్ని ఇవ్వడానికి పార్టీ శ్రేణులు సంఘీభావ యాత్ర చేపట్టాయి. దాంతో వారికి నోటీసులు అందాయి.
కానీ ఇలా చేయడంలో తప్పు ఏంటి అని ప్రశ్నించారు. భువనేశ్వరిని కలిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసులు జారీ చేశారు. దాంతో ఈ విషయం మీద భువనేశ్వరి సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తన పోస్టులో భువనేశ్వరి నోటీస్ కూడా షేర్ చేస్తూ ఈ విధంగా రాశారు.
భువనేశ్వరి ఈ విషయం మీద ఈ విధంగా రాశారు. “చంద్రబాబుగారికి మద్దతుగా, రాజమండ్రిలో ఉన్న నన్ను కలిసి నాకు మనోధైర్యాన్నిఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంఘీభావయాత్ర చేపడితే అందులో తప్పేముంది? పార్టీ కార్యకర్తలు మా బిడ్డల్లాంటి వాళ్ళు. బాధలో ఉన్న అమ్మను కలిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసులు ఇవ్వడం ఏంటి?”
“ప్రజలు, మద్దతుదారులు నన్ను కలవకూడదని చెప్పడానికి ఈ ప్రభుత్వానికి హక్కెక్కడిది?” అని భువనేశ్వరి అన్నారు. అలాగే పోలీస్ నోటీసు కూడా ఇందులో షేర్ చేశారు. ఈ పోలీస్ నోటీసులో, “17వ తేదీ నుండి 19వ తేదీ వరకు జరుగుతున్న రాజమండ్రి నందు జరగబోవు చలో సోలిడారిటీ టు నారా భువనేశ్వరి అట్ సెంట్రల్ ప్రిజన్ కార్యక్రమానికి ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేవు.”
“కావున మీరు టిడిపి పార్టీ కార్యకర్త అయినందున 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు జరుగు రాజమండ్రి నందు జరగబోవు చలో సోలిడారిటీ టు నారా భువనేశ్వరి అట్ సెంట్రల్ ప్రిజన్ జరగబోవు చలో రాజమండ్రి కార్యక్రమానికి వెళ్లడానికి వీలు లేదు. అందుకు విరుద్ధంగా మీరు ప్రవర్తించిన ఎడల అట్టి వారిపై పోలీసు వారు తీసుకునే చట్టపరమైన చర్యలకు అర్హులవుతారు అని తెలియజేయడమైనది.” అని ఆ నోటీసులో ఉంది. ఇదే విషయాన్ని నారా భువనేశ్వరి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ALSO READ : నాని “హాయ్ నాన్న” టీజర్లో… మైనస్ అయిన విషయం ఇదేనా..?