టీమిండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్ గురించి తెలిసిందే. తన బ్యాటింగ్ శైలితో అందరిని ఆకట్టుకుంటూ ఉంటాడు. ఈ యంగ్ క్రికెటర్ బాగా ఫేమస్ అయింది మాత్రం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ తో లవ్ లో ఉన్నాడనే విషయం పైన. ఇద్దరు కలిసి డేటింగ్ చేస్తున్నారని విషయం అధికారికంగానే చెప్పుకుంటున్నారు.
గురువారం రాత్రి పూణే వేదికగా బంగ్లాదేశ్ పై జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో సారా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గిల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు స్టేడియంలో నుండి చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేసింది. సారా స్టేడియంలో ఉంది కాబట్టి గిల్ రెచ్చిపోయి ఆడతారంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇదే మ్యాచ్ లో గిల్ మరో విషయంలో అందరినీ ఆకర్షించాడు. అతని టీ షర్ట్ కాలర్ వద్ద గోల్డెన్ బ్యాడ్జ్ కనిపించింది. ఇది ఏంటి అంటూ అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు. సెప్టెంబర్ 2023 గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డు గిల్ కు లభించింది. అందుకే దానిని ధరించి అతని బ్యాటింగ్ చేశాడు. సెప్టెంబర్ నెలలో అద్భుతమైన బ్యాటింగ్ తో గిల్ ఈ అవార్డును గెలుచుకున్నాడు.

కేవలం ఎనిమిది ఇన్నింగ్స్ లోనే ఏకంగా 480 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఆసియా కప్ తో పాటు స్వదేశంలో ఆస్ట్రేలియాపై జరిగిన వన్డే సిరీస్ లోను గిల్ రాణించాడు.ఈ అవార్డుపై గిల్ స్పందిస్తూ తనకు ఈ అవార్డు రావడం సంతోషంగా ఉంది అన్నాడు. ఇండియా తరఫున అంతర్జాతీయ స్థాయిలో రాణించడం గర్వంగా ఉందని వ్యాఖ్యానించాడు తాను మరింతగా రాణించేందుకు దేశాన్ని గర్వింపజేసేందుకు ఈ అవార్డు మరింత ప్రోత్సహిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
Also Read: WORLD CUP 2023 : “కోహ్లీ” కి అంపైర్ సహాయం చేశాడా..? ఇందులో నిజం ఎంత..?


































ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే అందరి దృష్టి దాని పైనే ఉంటుందనే విషయం తెలిసిందే. ప్రపంచకప్ లో భాగంగా అహ్మదాబాద్లో భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక మ్యాచ్లో పాక్ 191 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ బ్యాటింగ్ దిగింది. అయితే ఈ మ్యాచ్ మొదట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఘటన చోటుచేసుకుంది.
భారత స్టార్ బ్యాటర్ కింగ్ కోహ్లి చిన్న మిస్టేక్ చేశాడు. అయితే వెంటనే దానిని గుర్తించిన కోహ్లీ సరిచేసుకున్నాడు. ఇక కోహ్లీకి సంబంధించిన ఏ విషయం అయిన క్షణాల్లో వైరల్ అవుతుందనే విషయం తెలిసిందే. కోహ్లీ తన పొరపాటును సరిచేసుకునేలోపే ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. మ్యాచ్ ఆరంభంలో భారత జట్టు ప్లేయర్స్ అంతా ఒక జెర్సీ ధరించి వచ్చారు. అయితే విరాట్ కోహ్లి ఒక్కడు వేరే జెర్సీని ధరించి వచ్చాడు.
ఈ విషయాన్ని గుర్తించిన కోహ్లీ మ్యాచ్ మధ్యలోనే వెళ్ళి, జెర్సీని మార్చుకుని వచ్చాడు. అయితే మిగతా భారత క్రికెటర్ల జెర్సీ, కోహ్లి ధరించిన జెర్సీ ఒకేలా ఉన్నాయి. కానీ జెర్సీ భుజం పైన ఉన్న స్ట్రిప్స్ ఒక్కటే డిఫరెంట్ గా ఉన్నాయి. మిగతా టీమిండియా ప్లేయర్ల జెర్సీ పై మూడు రంగుల స్ట్రిప్ ఉంది. అయితే కోహ్లి వేసుకున్న జెర్సీకి వైట్ లైన్స్ ఉన్నాయి. ఈ విషయన్ని గమనించిన కోహ్లీ వెంటనే జెర్సీని మార్చుకుని వచ్చేశాడు. అయితే అప్పటికే ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.