ఈ ఫొటోలో ఉన్న అబ్బాయి ఇప్పుడు ఇండియాలోనే పెద్ద క్రికెటర్ అయ్యాడు..! ఎవరో తెలుసా..?

ఈ ఫొటోలో ఉన్న అబ్బాయి ఇప్పుడు ఇండియాలోనే పెద్ద క్రికెటర్ అయ్యాడు..! ఎవరో తెలుసా..?

by kavitha

Ads

సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో సినీ ప్రముఖుల చిన్ననాటి ఫొటోలు ఎక్కువగా వైరల్ అవుతుండడం తెలిసిందే. అయితే వీరితో పాటు ప్రముఖ క్రికెటర్ల చైల్డ్ హుడ్ ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Video Advertisement

ఈ నేపథ్యంలో భారత స్టార్ క్రికెటర్ చిన్ననాటి ఫోటో ఒకటి నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. మైదానంలోని ఆటకు మాత్రమే కాకుండా అతని వ్యక్తిత్వానికి కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. మరి ఆ క్రికెటర్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు స్టార్‌ క్రికెటర్ గా ఎదిగారు. ఫార్మాట్ ఏదైనా సరే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో పరుగులు వర్షం కురిపిస్తాడు. తన పరుగులతో రికార్డులను కొల్లగొట్టేస్తున్నారు. క్రికెట్ గాడ్ సచిన్‌ టెండూల్కర్‌ తరువాత ఆ రేంజ్ లో పరుగులు చేస్తూ, సెంచరీలు కొడుతూ, అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆటలోనే కాకుండా వ్యక్తిత్వంలోనూ తనకు తానే సాటి. ఈ క్రికెటర్ కి సామాజిక మధ్యమాలలో భారీ ఫాలోయింగ్‌ ఉన్న ఈ స్టార్‌ క్రికెటర్ ఎవరో కాదు. అభిమానులు ప్రేమగా కింగ్ కోహ్లీ అని పిలుచుకునే విరాట్ కోహ్లీ.
విరాట్ కోహ్లీ 1988లో నవంబర్ 5న ఢిల్లీలో పంజాబీ హిందూ ఫ్యామిలిలో జన్మించాడు. తండ్రి పేరు ప్రేమ్ కోహ్లి క్రిమినల్ లాయర్‌, తల్లి సరోజ్ కోహ్లి గృహిణి. విశాల్ భారతి పబ్లిక్ స్కూల్‌లో ప్రాధమిక  విద్యాభ్యాసం చేశారు. కోహ్లీ మూడు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడే క్రికెట్ పట్ల ఆసక్తిని ప్రదర్శించాడని తెలుస్తోంది. విరాట్ తండ్రి తన కుమారుడి ఆసక్తిని గమనించి, 1998 లో వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో చేర్చాడు. శిక్షణ పొందిన కోహ్లీ పట్టుదలతో అండర్-15 ఢిల్లీ జట్టులోకి ప్రవేశించాడు.
కోహ్లీ జూనియర్ క్రికెట్ కెరీర్ అక్టోబర్ 2002లో లుహ్ను క్రికెట్ గ్రౌండ్‌లో ఆతిథ్య రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన పాలీ ఉమ్రిగర్ మ్యాచ్‌లో ప్రారంభమైంది. అరంగేట్రం మ్యాచ్‌లో కోహ్లి మొత్తం పదిహేను పరుగులు చేయగలిగాడు. ఆ తరువాత జమ్మూ కాశ్మీర్‌తో జరిగిన తదుపరి మ్యాచ్‌లో, బీసీసీఐ నిర్వహించిన గేమ్‌లో 119 స్కోరుతో కోహ్లీ తన తొలి సెంచరీని సాధించాడు. ఆ సీజన్ ముగిసే సమయానికి, కోహ్లీ 78 సగటుతో మొత్తం 390 పరుగులు చేశాడు. అలా మొదలై, రన్‌మెషిన్‌ గా పేరుతెచ్చుకున్న కోహ్లీ తనదైన శైలిలో అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతున్నాడు.

Also Read:  కోహ్లీకి ఉన్నట్టు ధోని హెల్మెట్ మీద జాతీయ జెండా ఎందుకు లేదు? కారణం తెలుస్తే ఫిదా అవ్వకుండా ఉండలేరు.!


End of Article

You may also like