తీవ్రంగా గాయపడి ఆట నుంచి తప్పుకున్న హార్థిక్…మరి బ్యాటింగ్?

తీవ్రంగా గాయపడి ఆట నుంచి తప్పుకున్న హార్థిక్…మరి బ్యాటింగ్?

by Sainath Gopi

Ads

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈరోజు జరుగుతున్న ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ మధ్యలో హార్దిక్ పాండే గాయం కారణంగా ఆట మధ్యలో మైదానం నుంచి తప్పుకున్నాడు. బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తున్న టైంలో సరిగ్గా తొమ్మిదవ ఓవర్ లో హార్దిక్ తన మూడవ డెలివరీ వేశాడు. తన వైపుకు దూసుకు వస్తున్న ఆ బాల్ ని ఓపెనింగ్ బ్యాటర్ లిట్టన్ దాస్‌ స్ట్రైట్ గా కట్ చేయడానికి ట్రై చేశాడు. ఈ క్రమంలో కుడికాలితో బంతిని ఆపడానికి ప్రయత్నించిన హార్దిక్ బ్యాలెన్స్ తప్పి ఎడమ కాలిపై బలంగా పడిపోయాడు.

Video Advertisement

 

బాటర్ కొట్టిన బంతి బౌండరీ వైపుకు దూసుకు వెళ్తున్న.. స్టేడియంలో కెమెరాలతో సహా అందరి కళ్ళు గాయంతో బాధపడుతున్న హార్దిక్ వైపే చూస్తున్నాయి. తీవ్రమైన గాయం కావడంతో హార్దిక్ నొప్పితో మెలికలు తిరిగిపోయాడు. అప్పటికే ఫీల్డ్ లోకి దిగిన ఫిజియో బేసిక్ ట్రీట్మెంట్ ఇవ్వడంతో కాస్త కోలుకున్న హార్దిక్ తిరిగి బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే చివరి నిమిషంలో రోహిత్ విరాట్ కలగజేసుకొని విశ్రాంతి తీసుకోమని చెప్పారు. దీంతో అతను మైదానం నుంచి వెళ్ళిపోయాడు. ఇక ఆ ఓవర్ చివరిలో మిగిలిన మూడు వంతులకు కోహ్లీ బౌలింగ్ వేశాడు.

ఈ నేపథ్యంలో హార్దిక్ గాయం పై పూర్తి అవగాహన కోసం స్కాన్ కి తీసుకు వెళుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అలాగే బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ మొత్తానికి హార్దిక్ ఫీల్డింగ్ కి అందుబాటులో ఉండడు అని బ్రాడ్‌కాస్టర్లు లో కూడా స్పష్టం చేశారు. 2018 లో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ తర్వాత నుంచి హార్దిక్ వెన్నెముక సమస్యల కారణంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈరోజు తగిలిన గాయం కాస్త ఆందోళన కలిగించే విధంగానే ఉంది.

watch video:

 


End of Article

You may also like