క్రికెట్..మన దేశం లో ఇదొక మతం. అందుకే దీనికి ఇక్కడ ఆదరణ ఎక్కువ. ఇతర దేశాల్లో ఫుట్‌బాల్, రగ్బీ వంటి ఆటలు ప్రాచుర్యం పొందినా క్రికెట్ స్థానం దానిదే. అయితే దేశం కోసం ఆడుతున్న సమయాల్లో గాయాలు కావడం తరచూ జరిగేదే. అలాంటప్పుడు ఆటగాళ్లు మైదానం వీడిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
కానీ తమ జట్టును, దేశాన్ని గెలిపించటం కోసం కొందరు ఆటగాళ్లు గాయాలను సైతం లెక్కచేయకుండా పోరాడటాన్ని మనం చూస్తున్నాం. చాలామంది బ్యాటర్లు, బౌలర్లు గాయాలైన సరే తమ జట్టు గెలుపుకు కృషి చేసారు. అలాంటి సందర్భాల్లో వారి తమ అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టారు. ఆ ఆటగాళ్లెవరో ఇప్పుడు చూద్దాం..
#1 అనిల్ కుంబ్లే
టీమిండియా లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 2002వ సంవత్సరంలో ఆంటిగ్వాలో వెస్టిండీస్‌తో సిరీస్‌లోని నాల్గవ టెస్ట్ మ్యాచ్‌లో తీవ్ర గాయానికి గురయ్యాడు. దవడ
విరిగి నోట్లోంచి రక్తం వస్తున్నా అతడు తన బౌలింగ్ ను ఆపలేదు. తలకు కట్టుతో కుంబ్లే బౌలింగ్ చేసిన విధానాన్ని ఎవరు మర్చిపోలేరు.

#2 నసీం షా
పాకిస్థాన్ జట్టుకు చెందిన నసీం షా ఆసియా కప్ మ్యాచ్‌లో తన కాలుకు ఇబ్బంది వచ్చి నడవలేకపోయినా తన స్పెల్ ను పూర్తి చేసాడు.

#3 గ్యారీ కిర్ స్టెన్
సౌత్ ఆఫ్రికా ఆటగాడు గ్యారీ కిర్ స్టెన్ 2003 లాహోర్ టెస్టులో పాకిస్థాన్‌పై జరిగిన మ్యాచ్ లో షోయబ్ అక్తర్ వేసిన బౌన్సర్ తో అతడి ముక్కు విరిగి పోయింది. అయినా తర్వాత బాటింగ్ కు దిగాడు గ్యారీ.

#4 మాల్కం మార్షల్
వెస్టిండీస్ కి చెందిన దివంగత ఆటగాడు మాల్కం మార్షల్ కు 1984లో ఇంగ్లండ్‌తో జరిగిన హెడ్డింగ్లీ టెస్ట్‌లో బ్రొటన వేలు విరిగింది. అయినా అతడు చిరునవ్వుతో తన బాటింగ్ ని పూర్తి చేసాడు.

#5 గ్రేమ్ స్మిత్
సౌత్ ఆఫ్రికా కి చెందిన గ్రేమ్ స్మిత్ 2009లో సిడ్నీలో ఆస్ట్రేలియా జట్టు తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో చేయి విరిగినా.. పెయిన్ కిల్లర్లు వేసుకొని తన ఆటను కొనసాగించాడు.

#6 మహేంద్ర సింగ్ ధోని
మన దేశానికి చెందిన గొప్ప కెప్టెన్, వికెట్ కీపర్ అయిన ధోని జింబాబ్వే తో జరిగిన టీ 20 సిరీస్ లో భాగంగా కీపింగ్ చేస్తున్న సమయం లో వికెట్ బెయిల్ ఒకటి ఎగిరి ధోని కంటికి తగిలింది. అయినా ధోని తన ఆటను ఆపలేదు. మ్యాచ్ తర్వాత ధోని పోస్ట్ చేసిన ఒక చిత్రం లో అతడి కన్ను బాగా దెబ్బతిని ఉంది.

అంతే కాకుండా 2006 లో ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో ధోని వెన్నుకు ఐస్ పాక్స్ పెట్టుకొని బాటింగ్ చేసాడు.
#7 శిఖర్ ధావన్
2019 వరల్డ్ కప్ లో శిఖర్ ధావన్ తన చెయ్యి ఫ్రాక్చర్ అయినా ఆస్ట్రేలియా మీద 117 పరుగులు చేసాడు.

#8 యువరాజ్ సింగ్
2011 ప్రపంచ కప్ సమయం లో యువరాజ్ సింగ్ కాన్సర్ తో పోరాడుతున్నా అద్భుతమైన ఆట తీరును కనబరిచాడు. తన ప్రాణాలకు ముప్పు అని తెలిసినా పాకిస్తాన్‌తో జరిగిన సెమీ-ఫైనల్లోకి భారత్‌ను నడిపించాడు.

#9 షేన్ వాట్సన్
ఆస్ట్రేలియా కి చెందిన షేన్ వాట్సన్ 2019 లో చెన్నై జట్టు తరపున ఆడాడు. అప్పుడు ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో క్రీజ్ లోకి వచ్చెనందుకు డీవే చేసిన సమయం లో మోకాలికి తీవ్ర గాయం అయ్యింది. అయినా కూడా రక్తమోడుతున్న కాలితోనే బ్యాటింగ్ కొనసాగించాడు. ఆ మ్యాచ్ లో వాట్సన్ 59 బంతుల్లో 80 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్ తర్వాత అతడి మోకాలికి ఆరు కుట్లు పడ్డాయి.

#10 విరాట్ కోహ్లీ
2018 లో లార్డ్స్ లో ఇంగ్లాండ్ జట్టు తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో బ్యాక్ పెయిన్ తో ఇబ్బంది పడ్డాడు. దీంతో అతడికి మైదానం లోనే ఫిజియో చెయ్యాల్సి వచ్చింది.

#11 రోహిత్ శర్మ
తాజాగా బాంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ ఫీల్డింగ్ సమయం లో గాయం తో పెవిలియన్ కి చేరాడు. కానీ జట్టుకు అవసరమైన సమయం లో ఎనిమిదో స్థానం లో బరిలోకి దిగిన రోహిత్.. చేతి గాయాన్ని మరచి వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. 28 బంతుల్లో 51 పరుగులు చేసాడు రోహిత్.



#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
#20
#21
#22
#23
#24



 కోచి వేదికగా ఈ నెల చివర్లో జరిగే వేలంలో  991మంది ఆటగాళ్ల పేర్లు నమోదు అయ్యాయి. నమోదు చేసుకున్న వారిలో వెస్టిండీస్ నుండి 33మంది ఆటగాళ్లు ఉన్నారు. అయితే ఈ 33 మందిలో డ్వేన్ బ్రావో పేరు లేదు అని తెలుస్తోంది. బ్రావో పేరు లేదని తెలిసిన దగ్గర నుండి అతను కూడా ఐపీఎల్ రిటైర్మెంట్ చెప్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. డ్వేన్ బ్రావో ముంబై జట్టుతో తన ఐపీఎల్ ప్రయాణం మొదలుపెట్టాడు. 2011లో చెన్నై జట్టుతో కలిశాడు. ఇక అప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ 2011, 2012, 2021ల్లో ఐపీఎల్ ట్రోఫీ తేవడంలో ముఖ్యపాత్ర పోషించాడు.
ఇప్పటివరకు బ్రావో 161 ఐపీఎల్ మ్యాచులు ఆడి, 158 వికెట్లు తీసాడు. గత ఏడాదిలో  పది మ్యాచులు ఆడి,  16 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే  ఒక సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ మినీ వేలానికి ముందు ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంది. అందులో భాగంగా  పద్నాలుగు మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుని, మిగతా ఆటగాళ్లను వద్దనుకుంది. వదిలేసిన వారిలో డ్వేన్ బ్రావోతో పాటు జగదీశన్, రాబిన్ ఊతప్ప, ఆడమ్ మిల్నే,క్రిస్ జోర్డాన్ లాంటి వారు ఉన్నారు.





బౌలింగ్ ఆప్షన్‌గా దీపక్ హుడాను తీసుకున్నారని అయితే అనిపించడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం జట్టులో వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు. దీపక్ హుడాను 6వ బౌలింగ్ ఆప్షన్ గా తీసుకున్నారని అ నుకుంటున్నా, అతను అయితే గొప్ప ఆల్‌రౌండర్ కాదు. అతనికంటే కూడా దీపక్ చహర్ బాగా బౌలింగ్ చేయగలడు. కానీ, తొలిమ్యాచ్‌లో దీపక్ చహర్‌ను కాకుండా శార్దూల్ ఠాకూర్ ను తీసుకున్నారు. నెక్స్ట్ మ్యాచ్‌కే ఠాకూర్‌ను పక్కన పెట్టారు. ఇది సరి అయిన పద్దతి కాదు అని నెహ్రా తెలిపారు
నెహ్రా ఆ తరువాత సంజూ శాంసన్ పై గురించి నేను ఒకవేళ సెలక్టర్ ను అయి ఉంటే మాత్రం సంజూ శాంసన్ ను పక్కన పెట్టి, హుడానే తీసుకునేవాడినని చెప్పారు. అయితే ఇదే చర్చలో పాల్గొన్న మాజీ క్రికెటర్ మురళీ కార్తిక్ వాస్తవానికి సంజూ శాంసన్ గురించి చెప్తూ,అతను కొద్ది కాలంగా బాగా అడుతున్నప్పటికి ఎందుకో అతనికి ఎక్కువ అవకాశాలు రావట్లేదు. తాజాగా ఒక్క మ్యాచ్ ఆడిన తర్వాత పక్కన పెట్టారు అని సంజూకు అండగా నిలబడ్డాడు. మరోవైపు సోషల్ మీడియాలో సంజూశాంసన్ ను వివక్షపూరితంగానే రెండో వన్డేలో తీసుకోలేదంటూ ఫ్యాన్స్ బీసీసీఐని ట్రోల్ చేస్తున్నారు.
ఐపీఎల్లో ట్యాలెంటె ఉన్న ఆటగాళ్లకు భారీ ధర పలుకుతుందనడంలో సందేహమే లేదు. వారి దురదృష్టం కొద్ది ధర కాస్త అటూ ఇటూ అయినా కూడా పోటీ మాత్రం చాలా ఉంటుంది. కానీ ఈ ఆల్‌రౌండర్ కోసం మూడు జట్లు కాచుకొని ఉన్నాయి.అయితే మరి ఆ జట్లు ఏమిటో చూద్దాం.
రాజస్థాన్ రాయల్స్..
కోల్‌కతా నైట్ రైడర్స్..









