చెన్నై సూపర్ కింగ్స్ ఐపీల్ చరిత్ర లో మోస్ట్ సక్సెసఫుల్ టీం. అది 2022 ఐపీల్ ముందు వరకు చరిత్ర. నాలుగు సార్లు ఈ ట్రోఫీ ముద్దాడిన చెన్నై జట్టు.. ఆరంభం నుంచి కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ చేతుల్లోనే ఉంది. గతేడాది ఆరంభంలో రవీంద్ర జడేజాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించినా.. అతను విఫలం అవడంతో మరోసారి ధోనీ చేతికే పగ్గాలు అందించాల్సి వచ్చింది.

Video Advertisement

 

అయితే ఐపీఎల్ 2023 తర్వాత ధోని.. ఈ లీగ్‌ నుంచి పూర్తిగా తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్ చేసే అవకాశం కనిపిస్తోంది. దేశవాళీల్లో అతను మహారాష్ట్ర కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే రుతురాజ్ కాదు అనుకుంటే కెప్టెన్ కోసం వేలంలో వెతుక్కోక తప్పదు.

players who can able to replace dhoni in CSK

ఈ క్రమంలో ధోనీ పాత్రకు సరిపోయే ముగ్గురు ఆటగాళ్లు కనిపిస్తున్నారు. ఈ నేపథ్యం లో.. ధోని తర్వాత చెన్నై ని అంత సమర్ధవంతం గా నడిపించగలిగే ఆటగాళ్లెవరో చూద్దాం..

#1 బెన్ స్టోక్స్
ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌పై ప్రస్తుతం అన్ని ఫ్రాంచైజీలు ఫోకస్ పెట్టాయి. వన్డేలకు ఇటీవలే వీడ్కోలు పలికిన ఈ స్టార్ ప్లేయర్.. టీ20 ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. టోర్నీలో ఇంగ్లండ్ తప్పక గెలవాల్సిన మ్యాచుల్లో రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. జట్టును ముందుండి నడిపించడానికి ఇష్టపడే స్టోక్స్.. ఇంగ్లండ్ టెస్టు జట్టును ఎలా మార్చేశాడో అందరికీ తెలిసిందే.

players who can able to replace dhoni in CSK

#2 జేసన్ హోల్డర్
అత్యంత చిన్న వయసులోనే వెస్టిండీస్ సారధిగా బాధ్యతలు చేపట్టి.. బడా బడా స్టార్లు లేని జట్టుతో కూడా డీసెంట్ ప్రదర్శన చేసిన కెప్టెన్ జేసన్ హోల్డర్. మైదానంలో ఎంత టెన్షన్ ఉన్నా ప్రశాంతంగా ఉండే అతన్ని చెన్నై సారధిగా నియమించినా ధోనీ పాత్రను పోషించే అవకాశం ఉంది.

players who can able to replace dhoni in CSK

#3 డ్వేన్ బ్రావో
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని టీ20 లీగుల్లో రాణించిన డ్వేన్ బ్రావో.. చాలా ఏళ్లుగా చెన్నైతో కలిసి ఉన్నాడు. ఇతను కూడా వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కావడం గమనార్హం. ధోనీకి మంచి స్నేహితుడైన తను కూడా తన చుట్టూ జట్టును నిర్మించగల సమర్థుడే.

players who can able to replace dhoni in CSK

అయితే 39 ఏళ్ల వయసు ఉండటం బ్రావో మైనస్. కానీ రుతురాజ్‌ను కెప్టెన్‌గా మలిచేందుకు కొంత సమయం కావాలని అనుకుంటే మాత్రం బ్రావోనే బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తున్నాడు.

players who can able to replace dhoni in CSK

భారత్‌కు ఎన్నో అద్భుత విజయాలు అందించిన మిస్టర్ కూల్ ధోని .. అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ధోని.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ధోని అనుభవాన్ని టీమిండియా కోసం ఉపయోగించుకోవాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ధోని మెంటార్ లేదా కోచింగ్‌లో బలమైన టీ20 జట్టును తయారు చేయాలని చూస్తోంది.