“సంజు శాంసన్” కంటే… “రిషబ్ పంత్” కి ఎక్కువ అవకాశాలు ఇవ్వడానికి… ఈ 5 విషయాలే కారణమా..?

“సంజు శాంసన్” కంటే… “రిషబ్ పంత్” కి ఎక్కువ అవకాశాలు ఇవ్వడానికి… ఈ 5 విషయాలే కారణమా..?

by Anudeep

Ads

టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్ గత కొంతకాలంగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు. టెస్టుల్లో అదరగొడుతున్న పంత్‌.. వన్డేలు, టీ20ల్లో అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతున్నాడు. తాజాగా అతగాడు మరోసారి అభిమానులను నిరాశపరిచాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి వన్డేలోనూ పేలవ ప్రదర్శనతో అందరికీ ఆగ్రహం తెప్పించాడు. దీంతో పంత్‌పై సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Video Advertisement

మరోవైపు సంజూ శాంసన్‌ కంటే కోచ్, కెప్టెన్ రిషబ్ పంత్‌ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. సంజూ శాంసన్ వన్డేలలో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ అతడు బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తోంది.

why rishab pant getting more chances in team india..??

అయితే అసలు ఎందుకు శాంసన్ కంటే పంత్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారో ఇప్పుడు చూద్దాం..

 

#1 టెస్టుల్లో అద్భుత ప్రదర్శన

అంతర్జాతీయ క్రికెట్ లో అత్యుత్తమ ఫార్మాట్ టెస్టులు. అందులో రిషబ్ పంత్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. తక్కువ మ్యాచ్లలోనే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పిచ్ లపై పంత్ సెంచరీలు బాదాడు. అలాగే టీమ్ ఇండియాకు విజయాలను అందించడంలో పలు చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ లు ఆడాడు. దీంతో పంత్ కు వరుసగా అవకాశాలు ఇస్తున్నారు.

why rishab pant getting more chances in team india..??

#2 ఎడమ చేతి వాటం బ్యాట్స్ మెన్

భారత బ్యాటింగ్ ఆర్డర్ లో చాలామంది బ్యాట్స్మెన్లు కుడి చేతితో బ్యాటింగ్ చేస్తారు. అటువంటి పరిస్థితుల్లో, కెప్టెన్ సరైన జట్టు కాంబినేషన్ కోసం రిషబ్ పంత్ కు ప్లేయింగ్ ఎలెవన్ లో అవకాశం ఇస్తాడు. సంజు శాంసన్ రైట్ హ్యాండ్ బ్యాటర్, అదే అతని మైనస్ పాయింట్.

why rishab pant getting more chances in team india..??

#3 పంత్‌ ‘X’ ఫ్యాక్టర్‌

పరిస్థితులు ఎలా ఉన్నా? రిషబ్ పంత్ తన దూకుడు బ్యాటింగ్‌తో రాజీ పడలేదు. క్రీజులోకి రాగానే విధ్వంసకర ఇన్నింగ్స్‌తో రెచ్చిపోతాడు. తద్వారా అతడ్ని కోచ్, కెప్టెన్ ఎల్లప్పుడూ టీమ్ ఇండియా ‘X’ ఫ్యాక్టర్‌గా పరిగణిస్తారు. తరచుగా ప్రత్యర్థి జట్లు అతడి కోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తాయి. ఎందుకంటే పంత్ క్రీజులో కొనసాగితే, అతడు ప్రత్యర్థిని ఓటమిపాలయ్యేలా చేస్తాడు.

why rishab pant getting more chances in team india..??

#4 విధ్వంసకర బ్యాటర్

పంత్ 2017 లో భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు. అతడు ఒక విధ్వంసకర బ్యాటర్ గా పేరుగాంచాడు. ఆస్ట్రేలియా పర్యటనలోను పంత్ ఈ విషయాన్ని నిరూపించాడు. మరోవైపు, సంజు శాంసన్ 2015 సంవత్సరంలో భారత జట్టుకు అరంగేట్రం చేశాడు. కానీ అతడి ఫామ్ లేమి కారణంగా టీమ్ ఇండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు.

why rishab pant getting more chances in team india..??

#5 వికెట్ కీపింగ్ నైపుణ్యం

అరంగేట్రం చేసిన తర్వాత నుంచి పంత్ తన వికెట్ కీపింగ్ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటూ వస్తున్నాడు. వృద్ధిమాన్ సాహాకు బదులుగా పంత్‌కు అవకాశం ఇచ్చినప్పుడు, మొదటిగా ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ వికెట్ కీపింగ్‌పై ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఆ తర్వాత, పంత్ వికెట్ కీపింగ్‌లో చాలా కష్టపడ్డాడు.

why rishab pant getting more chances in team india..??

కాగా, ఇవన్నీ అటు ఉంచితే, సంజు శాంసన్ కూడా వికెట్ కీపర్ ఏనని, అతడికి అవకాశాలు ఇస్తే, చక్కగా రాణించగలుగుతాడని అభిమానులు అంటున్నారు.లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ తప్పితే.. మిగతా అన్నింటిలోనూ పంత్‌కు శాంసన్ గట్టి పోటీ ఇస్తాడని చెబుతున్నారు. జట్టు కూర్పు విషయంలోనైనా, ఎవరినైనా తప్పించాలన్నా మొదటిగా శాంసన్ పేరు వస్తుండటం చాలా బాధాకరమని ఇప్పటికే పలువురు భారత మాజీ ప్లేయర్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


End of Article

You may also like