కొత్తదనానికి పోయి ఫ్రీ హిట్ జారవిడుచుకున్న స్మిత్..!

కొత్తదనానికి పోయి ఫ్రీ హిట్ జారవిడుచుకున్న స్మిత్..!

by Anudeep

Ads

ఆస్ట్రేలియా మరియు ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌లో ఇప్పటి వరకు మంచి ఫామ్ లో ఉన్న బ్యాట్స్ మాన్ లలో స్టీవ్ స్మిత్ ఒక్కడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఈ సిరీస్‌లో జరిగిన రెండు మ్యాచ్‌ల లో 174 పరుగులు చేశాడు. ఎక్కువగా టెక్స్ట్-బుక్ షాట్‌లపై ఆధారపడే ఈ ఆటగాడు శనివారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో వినూత్నంగా స్విచ్ హిట్ చేయడానికి ప్రయత్నించి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఫీల్డ్ లో ప్రయోగాలు చేస్తే పరిస్థితి తారుమారవుతుంది అనేదానికి స్మిత్ ప్రదర్శన ఒక ఉదాహరణగా మిగిలింది.

Video Advertisement

అసలు విషయంలోకి వెళ్తే, ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ మధ్య మొదలైన రెండో వన్డే మ్యాచ్లో ఈ ఆసక్తికర విన్యాసం చోటు చేసుకుంది. మంచి స్కోర్ తెచ్చుకుంటున్నాను అన్న కాన్ఫిడెన్స్ తో ఎదురుగా వస్తున్న బాల్ ను తప్పుగా అంచనా వేసి బొక్క బోర్లా పడ్డాడు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్.

steve smith lost free hit

స్మిత్ 57 పరుగుల వద్ద ఉన్నాడు…అదే టైం కి ఆదిల్‌ రషీద్‌ 32వ ఓవర్‌ లో ఒక నోబాల్ వేశాడు. దీంతో ఆస్ట్రేలియా టీం కి ఓ ఫ్రీ హిట్ దొరికింది. ఫ్రీగా వచ్చిన ఈ స్ట్రైక్ ను సద్వినియోగపరచుకోకుండా గొప్పలకు పోయి భారీ షాట్ కి ప్రయత్నించాడు స్టీవ్ స్మిత్. రషీద్‌ విసిరిన బంతిని లెఫ్ట్ హ్యాండ్ వైపు తిరిగి స్విచ్‌ హిట్‌ కొట్టడానికి ట్రై చేసి విఫలమయ్యాడు. ఆ తరువాత అనవసరంగా ఫ్రీగా వచ్చిన బాల్ ని వేస్ట్ చేసుకున్నందుకు తనను తానే తిట్టుకుంటూ వీడియో కి చిక్కాడు.

steve smith lost free hit

దాంతో పాపం ఇప్పుడు స్మిత్ ఫోటోలు ,వీడియో సోషల్ మీడియా లో పెట్టి “మనకు రానిది ప్రయత్నిస్తే ఇలాంటి ఫలితమే ఎదురవుతుంది కదా స్మిత్” అని కామెంట్లతో బాగా వైరల్ చేస్తున్నారు. ఆ విషయం అలా ఉంచితే ఈ మ్యాచ్లో స్మిత్ తన ఫామ్ ని తిరిగి కంటిన్యూ చేశాడు. ఈ మ్యాచ్లో 114 బాల్స్ కు గాను 94 పరుగులు సాధించి తన సత్తా చాటుకున్నాడు. కానీ కొద్దిలో సెంచరీ మిస్ అయ్యాడని అభిమానులు బాధపడుతున్నారు.

steve smith lost free hit

నిర్ణీత 50 ఓవర్లలో ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది. అందులో స్మిత్ 94, లబుషేన్‌ 58 మరియు మిచెల్‌ మార్ష్‌ 50 పరుగులు సాధించారు.


End of Article

You may also like