ఐపీఎల్ లో ఎంతో ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న జట్లలో ఒకటి ముంబై ఇండియన్స్. 8 సీజన్లలో 5 టైటిల్స్ గెలిచింది ముంబై ఇండియన్స్ జట్టు. కానీ ఈసారి మాత్రం జట్టు ప్రదర్శన ఆశించినంత స్థాయిలో లేదు. ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ 2020 సీజన్ లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఆట ప్రారంభించింది. మొత్తం 16 మ్యాచ్ లలో 16 మంది ప్లేయర్లను ఉపయోగించారు. మిగిలిన జట్లతో పోల్చి చూస్తే ఇది కొంచెం తక్కువే.
గ్రూప్ స్టేజ్ లో సన్ హైదరాబాద్ జట్టుతో జరిగిన ఆఖరి మ్యాచ్ లో బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా, రాహుల్ చహర్ లకు విశ్రాంతి ఇచ్చి వారి ప్లేస్ లో సౌరబ్ తివారి, నాథన్ కౌంటర్నైల్, జేమ్స్ పాటిన్సన్, ధవల్ కులకర్ణి లకు అవకాశం ఇచ్చారు. ఈ మ్యాచ్ ఒకటి మినహాయిస్తే మిగిలిన మ్యాచ్ లలో ముంబై ఇండియన్స్ జట్టు ఒకే టీంతో ఆడారు. ఢిల్లీ కాపిటల్స్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో జయంత్ యాదవ్ కి అవకాశం ఇచ్చారు.
దాంతో టీమ్ కి అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. కానీ ఐపీఎల్ 2021 సీజన్ లో మాత్రం ప్రేక్షకులు ముంబై ఇండియన్స్ ఆట సంతృప్తికరంగా లేదు అని అంటున్నారు. చెన్నైలో జరిగిన మొదటి ఐదు మ్యాచ్ లలో ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ ఆశించిన విధంగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు. బౌలర్లు రాణించడంతో రెండు మ్యాచ్ లలో జట్టు విజయం సాధించింది. గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టు కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తోంది.
ఇప్పటికే జట్టులో 20 మంది ప్లేయర్లను ఉపయోగించారు. డీ కాక్ క్వారంటైన్ పీరియడ్ పూర్తి అవ్వ పోవడంతో అతని స్థానంలో క్రిస్ లీన్ మొదటి మ్యాచ్ ఆడారు. క్రిస్ లీన్ 49 పరుగులతో రాణించినా కూడా ఆ తర్వాత మ్యాచ్ చోటు దక్కించుకోలేకపోయింది. రోహిత్ శర్మకి డీ కాక్ మీద నమ్మకం ఉండటంతో నాలుగు మ్యాచ్ లలో డీ కాక్ ని కొనసాగించారు.
మూడు మ్యాచ్ లలో ఫెయిల్ అయినా ఇషాన్ కిషన్ పక్కకి పెట్టి తన స్థానంలో నాథన్ కౌంటర్నైల్ తీసుకున్నారు. తర్వాత మ్యాచ్ లో నాథన్ కౌంటర్నైల్ స్థానంలో జేమ్స్ నీషామ్ తో పాటు తర్వాత ఆడమ్ మిల్నే, మార్కో జాన్సెన్ లని తీసుకున్నారు. ఐపీఎల్ 20 21 సీజన్ లో జయంత్ యాదవ్ మాత్రమే మన దేశానికి చెందిన ప్లేయర్.
పియూష్ చావ్లా, ఆదిత్య తారే, సౌరబ్ తివారీ లకి తుది జట్టులో చోటు దక్కలేదు. ఇషాన్ కిషన్ లాంటి హిట్టర్ లను పక్కన పెట్టి ఫారిన్ ప్లేయర్లను తీసుకోవడంతో రోహిత్ శర్మకి జట్టు ప్లేయర్ ల పర్ఫార్మెన్స్ పై నమ్మకం లేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి.