ప్లే ఆఫ్స్ కి వెళ్తారు.. కానీ కప్ కొట్టాలంటే CSK కి ఆ బౌలర్లు ఉండాల్సిందే.. ఎందుకంటే..?

ప్లే ఆఫ్స్ కి వెళ్తారు.. కానీ కప్ కొట్టాలంటే CSK కి ఆ బౌలర్లు ఉండాల్సిందే.. ఎందుకంటే..?

by Anudeep

Ads

ప్రస్తుతం క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ హడావిడి నడుస్తోంది. ఓ వైపు మ్యాచులమీద మ్యాచులు.. ఎవరు గెలుస్తారో అని క్రికెట్ అభిమానుల్లోనూ ఉత్కంఠ.. ఇదంతా ఒకెత్తయితే.. సోషల్ మీడియా లో ట్రెండ్ అయ్యే ట్రోల్స్.. మొత్తం గా ఈ కరోనా గడ్డు కాలం లో ఐపీఎల్ ఫన్ ను అందిస్తోంది. ఇటీవల ముంబై వర్సెస్ చెన్నై మ్యాచ్ లో చెన్నై పరాజయం పొందిన సంగతి విదితమే..

Video Advertisement

CSK ipl

ఈ మ్యాచ్ తరువాత, టీం ఇండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ CSK ను ఉద్దేశించి మాట్లాడాడు. చెన్నై టీం అన్ని రకాలుగానూ బాగుందన్నారు. అయితే.. టైటిల్ కొట్టాలంటే బౌలింగ్ విషయం లో మరింత శ్రద్ధ కనబరచాలన్నారు. ఒత్తిడి ఎక్కువవుతున్న టైం లో చెన్నై జట్టు నుంచి వరుసగా ఒక ఆరు యార్కర్లను విసరగలిగిన పేసర్లు ఒక్కరు కూడా లేరన్నారు.

irfan

ఇటీవల ముంబై తో జరిగిన మ్యాచ్ లో అదే జరిగిందని అనిపించినట్లు పేర్కొన్నారు. రోహిత్ సేన బాగా బాటింగ్ చేసిందని.. కానీ గమనించి చూస్తే.. చెన్నై జట్టు బౌలింగ్ సరిగా లేదన్న విషయం అర్థమవుతుందన్నారు. యార్కర్లను విసరగలిగిన బౌలర్లు కచ్చితం గా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఆర్సీబీ కి సిరాజ్, ముంబై కి బుమ్రా, ఢిల్లీ లో రబాడా ఇలా అందరికి యార్కర్లు విసరగలిగే బౌలర్లు ఉన్నారని కానీ చెన్నై జట్టులో ఆ లోటు ఉందన్నారు.

csk

ఆల్ రౌండ పరం గా చెన్నై మంచి జట్టే అయినా, పిచ్ పై పరుగుల్ని సేవ్ చేయగలిగిన బౌలర్లు లేకపోవడం మైనస్. సామ్ కరణ్ కొన్ని యార్కర్లను విసిరాడు కానీ.. ఆ తరువాత మరెవరు అలాంటి బౌలింగ్ చేయలేదు. సీఎస్ కే ఈ సారి టోర్నీ గెలవాలంటే.. కచ్చితం గా బౌలర్లు మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంది అంటూ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డారు.


End of Article

You may also like