సెలెబ్రిటీలు కొంత పాపులారిటీ రాగానే దానిని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. బుల్లితెర పై పాపులారిటీ సంపాదించుకుని.. సక్సెస్ ఫుల్ యాంకర్ గా దూసుకెళ్తున్న విష్ణు ప్రియ కు కూడా బాగానే ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియా లో కూడా ఆక్టివ్ గా ఉండే విష్ణుప్రియ తరచుగా తన డాన్స్ వీడియోలు, షూట్ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది.
తాజాగా ఆమె ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇటీవల ఆమె షూటింగ్ కి గ్యాప్ రావడం తో ఓ ఓయో రూమ్ ను బుక్ చేసుకుని సేద తీరారట. ఓయో రూమ్స్ చాల సేఫ్, సెక్యూర్ గా ఉంటాయని, నాకు చాలా సంతృప్తిని ఇచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది. ఓ కోడ్ ను పోస్ట్ చేసి.. ఆ కోడ్ తో బుక్ చేసుకుంటే డిస్కౌంట్ కూడా వస్తుంది అని చెప్పుకొచ్చింది. ఇదంతా కేవలం ప్రమోషన్ లో భాగమో.. లేక ఆమె ఏమి చెప్పాలనుకుందో కానీ.. నెటిజన్స్ మాత్రం ప్రమోషన్స్ చేయడానికి మరీ ఇలా చెయ్యాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.