మనం సోషల్ మీడియా కి ఎంత అడిక్ట్ అయిపోయామో చాలా మందికి నిన్న రాత్రి బాగా తెలిసివచ్చింది. నిన్న రాత్రి 9.15 నిమిషాల టైం లో వాట్సాప్ ఆగిపోయింది. ప్రపంచవ్యాప్తం గా ఈ సమస్య వచ్చింది. ఎవరికీ మెసేజెస్ సెండ్ అవ్వడం కానీ, రిసీవ్ చేసుకోవడం గాని జరగలేదు. ఇక ఫేస్ బుక్, ఇన్స్టా గ్రామ్ అప్లికేషన్స్ కూడా డౌన్ అయ్యాయి.
కొంతమంది ఈ అప్లికేషన్స్ పైనే ఆధారపడి పని చేసుకునే వారు ఎందుకు ఇలా అయ్యింది అనే విషయం అర్ధం కాక టెన్షన్ పడ్డారు. అందరికి ఇలాంటి సిట్యుయేషన్ ఎదురైందా? అన్న ఉద్దేశం తో కొంతమంది ట్విట్టర్ లో పోస్ట్ లు చేయడం మొదలుపెట్టారు. అందరు స్పందించడం తో ఈ అప్లికేషన్స్ డౌన్ అయ్యాయన్న విషయం అందరికి అర్ధమైంది. దాదాపు ఏడు గంటల పాటు ఈ మూడు అప్లికేషన్స్ స్తంభించిపోయాయి.
వాట్సాప్, ఇన్స్టా గ్రామ్ లను కూడా ఫేస్ బుక్ ఓన్ చేసుకుందన్న సంగతి తెలిసిందే. ఈ మూడు అప్లికేషన్స్ ఏడు గంటల పాటు స్ట్రక్ అవడం వల్ల జుకెర్ బర్గ్ కు దాదాపు ఏడు బిలియన్ డాలర్ల లాస్ వచ్చిందట. అంతే కాదు ఆయన పేరు బిలియనీర్స్ లిస్ట్ నుంచి కూడా తొలగించబడింది. ఈ మూడు అప్లికేషన్స్ కు ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆదరణ ఉందో.. కొన్ని గంటల పాటు అవి స్థంభించిపోయినప్పుడే తెలుస్తోంది కదా..