రామ్ గోపాల్ వర్మ సంచలనాలకు మారు పేరు ఆయన సినిమా తీసినా, ఒక ఇంటర్వ్యూ ఇచ్చినా, ఒక ట్వీట్ వేసినా, సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఆ మేటర్ గురించే మాట్లాడుకుంటారు. ఆ మధ్య పవన్ ఫాన్స్ తో ట్విట్టర్ వార్ చేసిన వర్మ. ఈ మధ్య లాక్ డౌన్ లో పలు సినిమా లు కూడా తీశారు, అవి పెద్దగా జనాలకి ఎక్కలేదనుకోండి అది వేరే విషయం. ఎన్ని సినిమాలు సక్సెస్ కాకపోయినా ఇంకా సినీ అభిమానులు ఆర్జీవీ సినిమా కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు. అది ఆయన ఫాలోయింగ్.
తాజాగా, రామ్ గోపాల్ వర్మ వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. తాను తీయబోయే సినిమాలో నటిస్తున్న హీరోయిన్ ఇనాయా సుల్తానాతో కూడా ఓ పార్టీ లో డాన్స్ వేశారు. ఏకంగా ఆమె కాళ్ళమీద పడిపోయారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే రామ్ గోపాల్ వర్మ ఆ వీడియోలో తను కాళ్ళు పట్టుకోవడం వెనుక ఉన్న కారణం గురించి చెప్పారు. “మనిషి శరీరంలో అన్ని భాగాలకు సమంగా ప్రాధాన్యత ఉంటుంది అని, కానీ కాళ్ళ మీద పడటం అనేది అవతలి వారిపై మనకు ఎంత గౌరవం ఉందో తెలియజేస్తుంది అని అన్నారు.
తాను ఆడవారి అందాన్ని ఆరాధిస్తాను అని, దాన్ని వ్యక్తపరిచేందుకు ఇలా పాదాభివందనం చేశాను అని, తాను చాలా స్వేచ్ఛగా ఉంటాను అని, చట్టపరమైన ఎలాంటి తప్పులు చెయ్యను అని అన్నారు. కానీ సమాజం ఏమైనా అనుకుంటుందేమో అని మాత్రం తను అస్సలు పట్టించుకోరు అని. ఆ అమ్మాయికి ఇష్టం. నాకు ఇష్టం. మధ్యలో మీరెవరు?” అని అన్నారు రామ్ గోపాల్ వర్మ.
Congratulations @sandeepskb128 and @inaya_sultana
Thank you DON RGV@RGVzoomin https://t.co/tqtEB9xSFP
— Shrikanth BHARAT (@Shri__Bharat) August 24, 2021
ఇంక రామ్ గోపాల్ వర్మతో ఉన్న నటి పేరు ఇనాయా సుల్తానా. ఇనాయా సుల్తానా బర్త్ డే పార్టీ సందర్భంగా ఈ వీడియో చిత్రీకరించారు. ఇనాయా సుల్తానా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న ఒక సినిమాలో నటిస్తున్నారు. అంతే కాకుండా అవ్యోం జగత్, అలాగే సునీల్ ధనరాజ్ ప్రధానపాత్రల్లో నటించిన బుజ్జి ఇలా సినిమాల్లో కూడా నటిస్తున్నారు. అలాగే ఇనాయా సుల్తానాకి ఈగల్ మీడియా వర్క్స్ సంస్థ యాంకర్ ఇన్ చీఫ్ గా నియమించారు.