గ్రామీణ నేపథ్యంలో వచ్చే చిత్రాలకు ఇటీవల కాలంలో ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ వస్తోంది. గ్రామీణ అందాలను, ఊరి కట్టుబాట్లని హత్తుకునేలా ఆవిష్కరిస్తున్నారు. అలా వచ్చిన బలగం సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన `సగిలేటి కథ` నేడు రిలీజ్ అయ్యింది. ఆ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
- చిత్రం : సగిలేటి కథ
- నటీనటులు : రవి మహాదాస్యం,విశిక కోట,నరసింహ ప్రసాద్,రాజశేఖర్, సుదర్శన్, సాయి మోహన్ తదితరులు..
- నిర్మాత : అశోక్ మిట్టపల్లి, దేవి ప్రసాద్ బలివాడ
- దర్శకత్వం : రాజశేఖర్ సూద్మూన్
- సంగీతం : జస్వంత్ పసుపులేటి
- విడుదల తేదీ : అక్టోబర్ 13, 2023

స్టోరీ :
2007లో సాగే రాయలసీమలోని సగిలేరు అనే పల్లెటూరు కథ ఇది. ఆ ఊరి పెద్దలు చౌడప్ప(రాజ శేఖర్ అనింగి), మరియు ఆర్ఎంపీ డాక్టర్ దొరసామి(రమేశ్) మిత్రులు. చౌడప్ప కుమారుడు కుమార్ (రవి మహాదాస్యం) కువైట్ నుంచి తన ఊరికి వస్తాడు. కుమార్ చూడగానే కృష్ణవేణి(విషిక కోట)తోప్రేమిస్తాడు.ఆమె దొరసామి కూతురు.ఆమె కూడా కుమార్ ని ప్రేమిస్తుంది. తమ ప్రేమ గురించి ఇద్దరి ఇంట్లోవారికి చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటారు.
ఆ ఊరిలో వర్షాలు పడకపోవడంతో ప్రజలు అనావృష్టితో ఇబ్బందులు పడతుంటారు.ఊరి పెద్ద లందరు ఈ సమస్య తీరాలంటే గంగాలమ్మ జాతర చేయాలని తీర్మానిస్తారు. కానీ జాతర చేసే సమయంలో అడ్డంకి ఏర్పడుతుంది. ఆ సమస్యను ఊరిపెద్దలు ఎలా పరిష్కరించారు? కుమార్,కృష్ణవేణి ప్రేమకు, గంగాలమ్మ జాతరకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అనేది మిగిలిన కథ.
రివ్యూ :
సీనియర్ జర్నలిస్టు, రైటర్ బత్తుల ప్రసాదరావు ‘సగిలేటి కథలు’ లోని ఒక స్టోరీ ఆధారంగా దర్శకుడు రాజశేఖర్ సుడ్మూన్ ఈ సినిమాని తెరకెక్కించాడు . గ్రామీణ నేపథ్యంతో వినోదాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కించాడు. రాయలసీమ గ్రామీణ వాతావరణాన్ని, భాష, యాస, ఎమోషన్స్ ని మనుషుల మనస్తత్వాలను, కల్చర్ ఈ చిత్రంలో చూపించేందుకు ప్రయత్నం చేశారు.
స్టోరీ పరంగా కొత్తగా లేదు, హీరోహీరోయిన్ల రొటీన్ ప్రేమకథ. రోషం రాజు పాత్ర కోడి కూర కోసం పడే పాట్లు నవ్వు తెప్పిస్తాయి. చౌడప్ప తన మిత్రుడిని చంపిన తర్వాత స్టోరీ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. మూవీ అంతా ఒకెత్తు అయితే, సినిమా చివర్లోని ట్విస్ట్ మరోక ఎత్తు. అప్పటి దాకా మెల్లగా సాగిన స్టోరీ, కొన్ని క్యారెక్టర్స్,క్లైమాక్స్‌లో వారు ఇచ్చే ట్విస్టులు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. నూతన నటీనటులైనా, ప్రతీ ఒక్కరు కూడా నటనతో ఆకట్టుకున్నారు. హీరో రవి మహాదాస్యం, హీరోయిన్ విషికా కోట తమ నటనతో ఆకట్టుకున్నారు. రోషమ్ రాజు క్యారెక్టర్ బాగుంది. తనదైన కామెడీతో రోషమ్ రాజు ఆకట్టుకున్నాడు.
ప్లస్ పాయింట్స్ :
- ఎంచుకున్న పాయింట్,
- సినిమాటోగ్రఫీ,
- బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్:
- కథనం,
- నూతన నటీనటులు.
- లాజిక్ లేని సీన్స్.
రేటింగ్ :
2.5 / 5
ట్యాగ్ లైన్ :
లాజిక్కులు వెతకకుండా మూవీ చూసేవారికి, గ్రామీణ నేపథ్యంలో వచ్చే సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది.
watch trailer :
Also Read: నీతోనే నేను సినిమా ఎలా ఉందంటే





టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన రోజు నుండి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్‌ను ఐటీ ఉద్యోగులు దగ్గర నుండి ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కూడా ఖండిస్తూ వచ్చారు. నందమూరి కుటుంభ సభ్యులు కూడా స్పందించారు. అయితే ఈ విషయం పై ఆ కుటుంబంలోని జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఎటువంటి స్పందన రాకవపోవడం అనేది అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తరుపున ప్రచారం చేసిన తారక్, కొంతకాలం నుండి పార్టీకి దూరంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అరెస్ట్‌పై ఎలాంటి ప్రకటన చేయలేదని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మౌనంగా ఉండడం పై పార్టీ నాయకుల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఎన్టీఆర్ కి మద్ధతుగా మాట్లాడుతున్నారు.
తాజాగా ఈ విషయం పై జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్ రాజీవ్ కనకాల స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ పై ఎన్టీఆర్ సైలెంట్ గా ఉండడం గురించి అడుగగా, రాజీవ్ కనకాల మాట్లాడుతూ, “ఎన్టీఆర్ స్పందించకపోవడానికి రీజన్ సినిమాలతో బిజీగా ఉండడమే కారణం” అని తాను అనుకుంటున్నట్లుగా తెలిపారు.
“ఆర్ఆర్ఆర్ మూవీ, ఆ తరువాత కరోనా, ఈ విరామంలో ఎన్టీఆర్ కనీసం 4 చిత్రాలు అయినా చేసేవారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర మూవీలో నటిస్తున్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీ మీద దృష్టి పెట్టారని, పూర్తి సమయాన్ని దేవర కోసం కేటాయిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ దృష్టి మొత్తం చిత్రాలపైనే పెట్టాలని అనుకుని ఉండొచ్చని తాను భావిస్తున్నట్టు” గా రాజీవ్ కనకాల తెలిపారు.
ఐ ఫోన్ సిరీస్ లు వచ్చిన వెంటనే అమ్ముడవుతాయి. రీసెంట్ గా కొత్తగా ఐఫోన్ 15, ప్రో మాక్స్ రిలీజ్ అయ్యాయి. అలా రాగానే ఐ ఫోన్ లవర్స్ ఎగబడి మరి వాటిని కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే ఐఫోన్ అంటే ఇష్టం ఉన్న ఒక బిచ్చగాడు చిల్లర నాణేలను యాపిల్ స్టోర్‌కు తీసుకువచ్చి, ఆ నాణేలతో యాపిల్ ఫోన్ ను కొనుగోలు చేశాడు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ఆ వీడియోలో మాసిపోయిన బనియన్, లుంగీతో శరీరం అంతా మురికితో ఒక బిచ్చగాడు, జనాలతో రద్దీగా ఉన్న యాపిల్ స్టోర్‌కు వెళ్ళాడు. ఒక సంచీని భుజానికి వేసుకుని ఉన్నాడు. అయితే స్టోర్ లో ఉన్నవారు ఏం జరుగుతుందో అర్థం కాక అతన్ని చూడడం మొదలుపెట్టారు. ఆ బిచ్చగాడు కొత్తగా రిలీజ్ అయిన ఐఫోన్ 15 ప్రో మాక్స్ యాపిల్ ఫోన్ కొనడం కోసం స్టోర్‌కు వచ్చినట్లు చెప్పాడు. అది విన్నవారు అతను జోక్ చేస్తున్నాడని భావించారు. అయితే అతను తాను తీసుకువచ్చిన సంచీలో ఉన్న డబ్బును చూపించడంతో అందరూ షాక్ అయ్యారు.
సంచిలో తీసుకువచ్చిన చిల్లర అంతా స్టోర్‌లోని ఫ్లోర్ పై పోసి, వాటిని తీసుకుని యాపిల్ ఫోన్ 15 ప్రో మాక్స్ ఇవ్వామని అడిగాడు. ఇక ఆ స్టోర్ సిబ్బంది అందరూ ఆ నాణేలను లెక్కించగా, రూ.1.59 లక్షల ఉంది. అవి తీసుకుని అతనికి ఐఫోన్ ను ఇచ్చారు.దీనికి సంబంధించిన వీడియోను తీసి, సామాజిక మధ్యమంలో షేర్ చేయగా, ప్రస్తుతం వైరల్ గా మారింది. కానీ కొంత మంది మాత్రం ఇది ప్రాంక్ వీడియో అని అంటున్నారు. మరి కొంత మంది అయితే నిజంగానే ఇలా జరిగింది అంటున్నారు. నెటిజెన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

























#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16


ఇండియన్ క్రికెటర్ యశస్వీ జైస్వాల్ ని ఇంటర్వ్యూ చేసిన యాంకర్ పేరు గరిమా భరద్వాజ్. ఆమె ప్రముఖ జర్నలిస్ట్ మరియు న్యూస్ యాంకర్. యశస్వి జైస్వాల్ ను ఇంటర్వ్యూ చేసిన తర్వాత గరిమా వైరల్‌గా మారింది. దాంతో ఆమె ఎవరా అని నెట్టింట్లో వెతుకుతున్నారు. ఆమె ప్రస్తుతం ‘ది లలన్‌టాప్’ అనే పాపులర్ షోలో పని చేస్తుంది.
ఆమె సక్సెస్ ఫుల్ స్పోర్ట్స్ జర్నలిస్ట్. అంతకు ముందు దైనిక్ జాగరణ్, పాఠక్ పత్రిక, ఇండియా న్యూస్‌లతో పాటు అనేక మీడియా సంస్థలకు పనిచేసింది. గరిమా భరద్వాజ్ 1998లో ఢిల్లీలో జన్మించింది. అక్కడే పెరిగింది. ప్రస్తుతం ఆమె వయసు 25 సంవత్సరాలు. ఆమె మోతీ రామ్ మెమోరియల్ గ్రిల్స్ సీనియర్ స్కూల్ లో ప్రాధమిక విద్యను పూర్తిచేశారు. ఆ తర్వాత ఆమె బాచిలర్స్ ఇన్ జర్నలిజంని గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీలో చేశారు. ఆ తర్వాత జర్నలిజం రంగంలోకి అడుగుపెట్టింది.
డిల్లీలో నివసిస్తున్న గరిమా భరద్వాజ్ 2021 ఆగస్ట్ నుండి ‘ది లలన్‌టాప్’ లో సబ్ ఎడిటర్ గా పనిచేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే గరిమా భరద్వాజ్ యశస్వీ జైస్వాల్ ను ఇంటర్వ్యూ చేసిన వీడియో వైరల్ అయిన తర్వాత ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు ఒక్కసారిగా పెరిగారు. ప్రస్తుతం ఆమెను 50 వేలకు పైగా ఫాలో అవుతున్నారు.