జగపతి బాబు ‘లెజెండ్’ తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. వరుసగా భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. టాలీవుడ్ తో పాటుగా తమిళ, హిందీ, కన్నడ భాషలలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టుల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. అయితే జగపతి బాబు మెయిన్ రోల్ లో రూపొందిన రుద్రంగి నేడు రిలీజ్ అయ్యింది. ఆ సినిమా ఎలా ఉందో చూద్దాం..
- సినిమా : రుద్రంగి
- నటీనటులు : జగపతి బాబు,విమలా రామన్, మమతా మోహన్ దాస్,ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, కాలకేయ ప్రభాకర్, ఆర్ఎస్ నంద తదితరులు తదితరులు
- నిర్మాత : ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్
- దర్శకత్వం : అజయ్ సామ్రాట్
- సినిమాటోగ్రఫీ : ఎన్.సుధాకర్ రెడ్డి
- సంగీతం : నాఫల్ రాజా
- విడుదల తేదీ : జులై 7, 2023.

స్టోరీ:
మల్లేష్( ఆశిష్ గాంధీ), గానవి లక్ష్మణ్(రుద్రంగి) బావ మరదలు. వీరికి చిన్నప్పుడే వివాహం అవుతుంది. తల్లిదండ్రులు లేని ఇద్దరినీ వాళ్ళ తాత పెంచుతాడు. అయితే ఆ ఊరిలో ఉండే ఒక దొర (కాలకేయ ప్రభాకర్) మల్లేష్ తాతని చంపుతాడు. ఆ సమయంలో ఇద్దరు దూరమవుతారు. అదే ఊరికి ఉన్న మరో దొర భీమ్ రావు దేశ్ ముఖ్ (జగపతి బాబు). భీమ్ రావు పై కాలకేయ ప్రభాకర్ అనుచరులు దాడి చేయగా, మల్లేష్ అతన్ని రక్షిస్తాడు. దాంతో భీమ్ రావు మల్లేష్ చేరదీస్తాడు. ఇద్దరికీ శత్రువుగా మారిన కాలకేయ ప్రభాకర్ ను చంపేస్తారు.

భీమ్ రావు జనాలను పీడిస్తూ, ఆ ఊరిలోని అమ్మాయిలపై అకృత్యాలను చేస్తుంటాడు. అతనికి ఇద్దరు భార్యలు ఉన్నప్పటికీ అకృత్యాలను చేస్తుంటాడు. అతని పెద్ద భార్య మీరా బాయ్ (విమలా రామన్), రెండవ భార్య జ్వాలా భాయ్ (మమతా మోహన్ దాస్)ని కూడా బాధ పెడుతుంటాడు. ఈ క్రమంలో అతని చూపు రుద్రంగి పై పడుతుంది. అప్పటి నుండి మల్లేష్, భీమ్ రావు శత్రువులుగా మారుతారు. ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలని అందరిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. మల్లేష్ రుద్రంగిని ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైంది అనేది మిగతా కథ
రివ్యూ:
‘బహుబలి’కి డైలాగ్ రచయితగా పని చేసిన అజయ్ సామ్రాట్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఒకప్పుప్పటి కాలంలో దొరలు పెత్తనం చెలాయిస్తూ ప్రజలను అణగదొక్కడం లాంటివి ఈ మూవీలో సహజంగా చూపించాడు. ప్రధామర్ధాన్ని వేగంగా నడిపించిన దర్శకుడు, సెకండాఫ్ మొదట్లో బోర్ అనిపించేలా తీశాడు. అయితే మూవీ క్లైమాక్స్ ను మళ్ళీ ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు.
భీమ్ రావు క్యారెక్టర్ లో జగపతిబాబును తప్ప ఇంకెవ్వరిని ఊహించుకోలేనంత అద్భుతంగా నటించారు. భీమ్ రావు క్యారెక్టర్ కి ప్రాణం పోశారు. మల్లేష్ గా ఆశిష్ గాంధీ మెప్పించారు. జ్వాలాబాయ్ పాత్రలో మమతా మోహన్‌దాస్ యాక్టింగ్ బాగుంది. ఆమె నటించిన సన్నివేశాలలో మమతా మోహన్‌దాస్ డామినేషనే కనిపిస్తుంది.
భీమ్ రావు పెద్ద భార్య మీరాబాయ్ క్యారెక్టర్ లో విమలా రామన్ ఆకట్టుకుంటుంది. టైటిల్ పాత్రలో నటించిన గనవి లక్ష్మణ్ ఈ మూవీకి పెద్ద అసెట్ గా నిలిచింది. కనిపించేది కాసేపే అయినా ఇంపాక్ట్ ని చూపించింది. కరుణం పాత్రలో ఆర్ ఎస్ నందా నవ్వులు పూయించాడు. మిగిలినవారు తమ పాత్రలు మేరకు నటించారు.
టెక్నికల్ విషయానికి వస్తే నాఫల్ రాజా అందించిన పాటలు అంతగా రిజిస్టర్ కావు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫి ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిర్మాణ విలువలు కథకి తగినట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
- జగపతిబాబు నటన,
- మమతా మోహన్‌దాస్ నటన,
- బ్యాక్ గ్రౌండ్ స్కోర్
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్లు:
- సెకండాఫ్
- కనెక్ట్ కానీ ఎమోషన్స్
- కొన్ని బోరింగ్ సీన్స్
రేటింగ్:
2.5/5
ట్యాగ్ లైన్ :
తెలంగాణ దొరల బ్యాక్ డ్రాప్ ని మరో కోణంలో చూపించిన మూవీ. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే ఒకసారి చూడదగ్గ మూవీ.
watch trailer :






ఉత్తరప్రదేశ్ లోని బరేలీకి చెందిన జ్యోతి మౌర్యకు సంబంధించిన రకరకాల పోస్ట్‌లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పిసిఎస్ అధికారి అయిన జ్యోతి మౌర్య ఉద్యోగం వచ్చిన తర్వాత తన భార్య నమ్మకద్రోహం చేసిందని ఆమె భర్త అలోక్ మౌర్య చేశారు. అంతేకాకుండా తన భార్య వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందని ఆరోపించాడు. ఆమె పిసిఎస్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న సమయంలో తన సహాయాన్ని ఉపయోగించుకుందని అలోక్ ఆరోపించారు.
తాజాగా అలోక్ మౌర్య, జ్యోతి మౌర్యల పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ కార్డులో అలోక్ పారిశుధ్య కార్మికుడు అని కాకుండా గ్రామ పంచాయతీ అధికారి అని ఉంది. వైరల్ వెడ్డింగ్ కార్డ్ గురించి చెప్పడానికి జ్యోతి మౌర్య తండ్రి పరాస్ నాథ్ మౌర్య ముందుకు వచ్చారు. పెళ్లి సమయంలో అలోక్ పారిశుధ్య కార్మికుడిగా పనిచేసిన విషయాన్ని చెప్పలేదని జ్యోతి తండ్రి అన్నారు. దానికి బదులుగా అలోక్ గ్రామ పంచాయతీ అధికారినని చెప్పాడని అన్నారు.
అలోక్ మౌర్య ఇప్పుడు తాను పారిశుద్ధ్య కార్మికుడిని అని అరుస్తున్నాడని, కానీ పెళ్లికి ముందు, అలోక్ మరియు అతని కుటుంబం అబద్ధాలు చెప్పారని ఆయన వెల్లడించారు. తప్పుడు సమాచారం వల్లనే పెళ్లి జరిగిందనీ, అలాంటి పెళ్లి వల్ల ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి అని అన్నారు. జ్యోతి మౌర్య తండ్రి ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలోని చిరాయిగావ్లో నివసిస్తున్నారు.
1 నిమిషం 46 సెకన్ల నిడివి ఉన్న సలార్ టీజర్ ఆసక్తికరంగా ఉంది. దీనిని చూస్తుంటే కేజీఎఫ్ ఫ్లేవర్ లోనే ఈ మూవీ వస్తున్నట్టుగా అనిపిస్తోంది. టీజర్ లో పవర్ ఫుల్ డైలాగ్ తో ఆకట్టుకుంది. ‘సింహం, ఏనుగు, చీతా చాలా ప్రమాదం. కానీ జురాసిక్ పార్క్ లో కాదు. ఎందుకంటే అక్కడ ఉంది’ అని ఓ పెద్దాయన డైలాగ్ చెప్పినపుడు రెబల్ స్టార్ ప్రభాస్ పేరును చూపించారు.
ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు. టీజర్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ డీఫెరెంట్ లుక్ లో కనిపించారు. ఇది కేజీఎఫ్ లోని అధీరా లుక్ ను పోలీ ఉంది. టీజర్ లో ప్రభాస్ ను క్లియర్ గా చూపించలేదు. ప్రభాస్ విలన్స్ తో ఫైట్ చేస్తున్న సీన్స్ ను చూపించారు.
ఈ చిత్రం రెండు భాగాలుగా రానుందని టీజర్ చివరలో దర్శకుడు ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చారు. ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ అంటూ టీజర్ ఎండ్ లో వేశారు. ఇలా ఈ ఈ టీజర్ కేజీఎఫ్ తో రిలేటెడ్ గా ఉంది. సెప్టెంబర్ 28న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
పది సంవత్సరాల క్రితం ‘జులాయి’ మూవీతో ప్రారంభం అయిన త్రివిక్రమ్ – అల్లు అర్జున్ జర్నీ ‘అల వైకుంఠపురంలో’ వరకు వచ్చింది. వీరి కాంబోలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో తెరకెక్కాయి. మళ్లీ వీరి కాంబో ఎప్పుడు వస్తుందా అని బన్నీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. తాజాగా వీరిద్దరు మరోసారి కలిసి సినిమా చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా కన్ఫర్మ్ చేశారు.
అల్లు అర్జున్ కు ఇది 22వ చిత్రం. త్రివిక్రమ్-బన్నీ కాంబోలో నాలుగవ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. ఈ సినిమాని గీత ఆర్ట్స్, హారిక అండ్ హాసిని కలిసి నిర్మిస్తున్నారు. ఈ ప్రకటనతో బన్నీ అభిమానుల్లో సంతోషం రెట్టింపైంది. ఇక ఈ మూవీ ఎలా ఉండబోతుంది. ఈ మూవీలో త్రివిక్రమ్ అల్లు అర్జున్ ను ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ రూపొందుతుందని తెలుస్తోంది.
అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పుష్పకు సీక్వెల్ గా రానుంది. ఇదిలా ఉంటే త్రివిక్రమ్-బన్నీ నాలుగో మూవీ ప్రకటిస్తూ రిలీజ్ చేసిన వీడియో పై నెట్టింట్లో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి మీరు చూడండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
తొలిసారిగా మామ, మేనల్లుడు కలిసి బ్రో సినిమాలో నటిస్తుండడంతో ఈ మూవీ గురించి మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్ ఫుల్ లెంగ్త్ హీరోగా నటిస్తుండగా, పవన్ కల్యాణ్ దేవుడిగా నటిస్తున్నారు. తేజ్ పక్కన హీరోయిన్లుగా ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ నటిస్తున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్ మరియు నటుడు సముద్రఖని డైరెక్షన్ చేస్తుండగా, దర్శకుడు త్రివిక్రమ్ డైలాగ్స్ ను రాశారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
బ్రో సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుంది. మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా వేగంగా జరుగుతున్నాయి. మూవీ యూనిట్ టీజర్ రిలీజ్ తో ప్రమోషన్లను ప్రారంభించాలని భావిస్తోంది. జూలై మూడవ వారంలో బ్రో సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేసుకుంటోంది. ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
పవన్ కల్యాణ్ జ్వరంతో బాధపడుతూ కూడా బ్రో టీజర్ కి డబ్బింగ్ చెప్పారు. డబ్బింగ్ చెప్పే టైంలో టీజర్ చూసిన పవన్ కళ్యాణ్ చిన్నపిల్లాడిలా నవ్వారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా బ్రో టీజర్ రిలీజ్ అవడంతో దీనిపై సోషల మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు చూడండి..
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18


#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18












