- చిత్రం : హిట్ 2
- నటీనటులు : అడివి శేష్, మీనాక్షి చౌదరి, రావు రమేష్, తనికెళ్ల భరణి, కోమలి ప్రసాద్.
- నిర్మాత : ప్రశాంతి తిపిర్నేని, నాని (వాల్ పోస్టర్ సినిమా)
- దర్శకత్వం : శైలేష్ కొలను
- సంగీతం : ఎంఎం శ్రీ లేఖ, సురేష్ బొబ్బిలి
- విడుదల తేదీ : డిసెంబర్ 2, 2022

స్టోరీ :
సినిమా హర్షవర్ధన్ భార్య పాత్రతో మొదలు అవుతుంది. కృష్ణ దేవ్ (అడివి శేష్) వైజాగ్ కి ఎస్పీగా వస్తాడు. ఆర్య (మీనాక్షి చౌదరి) అతని గర్ల్ ఫ్రెండ్. వాళ్ళిద్దరూ లివ్ ఇన్ లో ఉంటారు. తర్వాత అక్కడి సోషల్ పబ్ లో సంజన అనే ఒక అమ్మాయి మర్డర్ జరుగుతుంది. తర్వాత చూస్తే అది ఒకరు కాదు నలుగురు ఒకటే చోట హత్య చేయబడ్డారు అని తెలుస్తుంది. ఈ విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేసే పనిలో కృష్ణ దేవ్ ఉంటాడు. అదే సమయంలో ఆ హత్యలు చేసిన వ్యక్తి కృష్ణ దేవ్ కి మరి కొన్ని హత్యలు చేయబోతున్నట్టు చెప్తాడు. ఈ విషయాన్ని కృష్ణ దేవ్ ఎలా కనిపెట్టాడు? అసలు హంతకులు ఎవరు? ఈ హత్యలు ఎందుకు చేస్తున్నారు? చివరికి ఇవన్నీటిని కృష్ణ దేవ్ ఆపగలిగాడా? ఇవన్నీ తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

రివ్యూ :
మంచి కథలను ఎంచుకోవడంలో, వాటిని తెరపై చూపించి సక్సెస్ అవ్వడంలో ఇటీవలి కాలంలో చాలా గొప్ప గుర్తింపు పొందిన హీరో అడివి శేష్. అడివి శేష్ మంచి నటుడు మాత్రమే కాకుండా మంచి రచయిత కూడా అని తన గత చిత్రాలు చూస్తే అర్థం అవుతుంది. ఆ సినిమాలు అన్నీ కూడా ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ కి చెందినవి. దాంతో అడవి శేష్ అంటే ఇలాంటి సినిమాలు చాలా బాగా చేస్తారు అని అంటారు.

ఇప్పుడు ఈ సినిమా కూడా దగ్గర దగ్గర అలాంటి కథతోనే వచ్చింది. మొదటి భాగం అయిన హిట్ లాక్డౌన్ కి ముందు విడుదల అయ్యి చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా కథ కూడా ఒక అమ్మాయి మరణించడం, ఆ మిస్టరీ సాల్వ్ చేయడం అలాగే ఉంటుంది. కానీ కథలో కొన్ని బలమైన పాయింట్స్ ఈ సారి యాడ్ చేశారు. సినిమా మొత్తం కూడా నెక్స్ట్ ఏమవుతుంది అనే సస్పెన్స్ తో నడుస్తోంది.

ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాకి కావాల్సిన అంశాలు అన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్ లో సగం జరిగిన తర్వాత సినిమాలో హత్యలు చేసేది ఎవరు అనేది తెలిసిపోతుంది. దాంతో కొంచెం సస్పెన్స్ తగ్గిందేమో అనిపిస్తుంటుంది. కానీ సినిమా చివరిలో మళ్లీ నెక్స్ట్ పార్ట్ కి సంబంధించి ఒక పెద్ద విషయాన్ని చెప్తారు. దాంతో ఇప్పుడు ఈ సినిమాకి మాత్రమే కాదు నెక్స్ట్ సినిమాకి కూడా ఇప్పటినుంచి సస్పెన్స్ స్టార్ట్ చేశారు అని అనిపిస్తుంది.

కానీ హంతకుడిగా చూపించిన వ్యక్తి మాత్రం అతను కాకుండా ఇంకా ఎవరినైనా ఈ పాత్రలో పెట్టి ఉంటే బాగుండేది ఏమో అని అనిపిస్తుంది. ఈ పాత్రకి ఆ నటుడు అంత కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది. కానీ ఏదేమైనా సరే సినిమాలో నిజంగా హంతకుడు ఎవరు అని కనిపెట్టడం మాత్రం ప్రేక్షకులకు చాలా కష్టం. నిజంగా హంతకుడు ఎవరు అని తెలిసిన తర్వాత ప్రేక్షకులు అందరూ కూడా ఒకసారి షాక్ కి గురవుతారు.
ప్లస్ పాయింట్స్ :
- కథ
- స్క్రీన్ ప్లే
- నటీనటుల పెర్ఫార్మెన్స్
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
- సినిమాటోగ్రఫీ
- సినిమా చివరి వరకు సస్పెన్స్ ని అలాగే ఎక్కడా తగ్గకుండా చూడడం
మైనస్ పాయింట్స్:
- సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్
- హంతకుడి పాత్ర
రేటింగ్ :
3.25/5
ట్యాగ్ లైన్ :
మొదటి పార్ట్ అయిన హిట్ ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ గా ఎంత గుర్తింపు అయితే సంపాదించుకుందో, ఇప్పుడు ఈ సినిమా కూడా అలాగే మంచి స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులకి ఎక్కడా కూడా ఆసక్తి తగ్గనివ్వకుండా చేస్తుంది. మర్డర్ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలని ఎక్కువగా ఇష్టపడే వారిని, అలాగే మొదటి పార్ట్ చూసినా చూడకపోయినా కూడా, ఒకవేళ చూసి ఈ సినిమాపై ఎక్కువ అంచనాలు పెట్టుకున్న ప్రేక్షకులని కూడా హిట్-2 సినిమా అస్సలు నిరాశ పరచదు.

నమ్రత తాజాగా కొడుకు గౌతమ్ వీడియో ఒకటి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసారు. ఈ వీడియో సూపర్ స్టార్ అభిమానులను ఖుషి చేస్తుంది. ఆ వీడియో ఏంటీ అనుకుంటున్నారా, అది గౌతమ్ ఫస్ట్ థియేటర్ ప్రొడక్షన్ వీడియో. ఎప్పుడూ సైలెంట్ గా కనిపించే గౌతమ్ గతంలో స్విమ్మింగ్లో రికార్డ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. నమ్రతా షేర్ చేసిన గౌతమ్ స్విమ్మింగ్ వీడియో కూడా వైరల్ అయ్యింది. తాజాగా గౌతమ్ తన స్కూల్లో క్లాస్మెట్స్తో కలిసి స్కిట్ చేశాడు.
తన మిత్రులతో కలిసి చక్కని హావా భావాలతో నటించాడు. దానిలో గౌతమ్ లుక్ కూడా డిఫరెంట్గా ఉంది. గౌతమ్ ఇంగ్లీష్ మాడ్యులేషన్ సూపర్ గా ఉంది. ఈ స్కిట్ లో గౌతమ్ని చూసి మహేష్ అభిమానులు, నెటిజన్లు, మహేష్ లానే ఉన్నాడని, ఫ్యూచర్ ప్రిన్స్ అని కామెంట్స్ చేస్తున్నారు. నమ్రత్ షేర్ చేసిన గౌతమ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మహేష్ అన్నయ్య రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ప్రస్తుతం అమెరికాలో నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు. త్వరలో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గౌతమ్ తన స్టడిస్ పూర్తయిన తరువాత హీరోగా ఎంట్రీ ఇస్తాడని సమాచారం.








నయనతార ఇంట్లో ఎనిమిది మంది పనివాళ్లు పని చేస్తారు. అయితే పనిచేసేవారిలో ఒకరికి 4 లక్షల అప్పు ఉందని తెలియగానే, వెంటనే నయనతార వారికి ఉన్న 4 లక్షల రూపాయల అప్పు తీర్చేసింది. పని వారి కష్టం తెలుసుకుని, తీర్చే గొప్ప మనసు నా కోడలిదని, అంతేకాకుండా తన దగ్గర పనిచేసేవాళ్లను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. అలా చేసేందుకు పెద్ద మనసు ఉండాలి. తన కోడలు పది మంది చేసే పనిని తనొక్కతే చేయగలదు అంటూ నయనతారను పొగిడింది విగ్నేష్ తల్లి మీనా కుమారి.
అయితే విగ్నేష్ తల్లి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇటీవలే నయనతార దంపతులు సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులుగా మారారు. మరో వైపు నయనతార పెళ్లి తర్వాత కూడా సినిమాలలో అదే ఉత్సాహంతో నటిస్తోంది.ప్రస్తుతం ఆమె చేతి నిండా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక అత్యదిక పారితోషికం తీసుకుంటున్న స్టార్ హీరోయిన్లలో ఇప్పటికీ నయనతార టాప్ ప్లేస్ లో ఉంది.
చిరంజీవికి ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలో నాకు తెలుసని మణిశర్మ చెప్పారు. ముందు ఇచ్చిన బీజీఎం వద్దని, దర్శకుడు కొరటాల శివ మీరు ఎలా అనుకుంటున్నారో అలా వద్దు. చాలా కొత్తగా ఉండాలని అన్నారని, దాంతో బీజీఎం కొరటాల శివ కోరిక మేరకు మార్చాల్సి వచ్చిందని మణిశర్మ చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం మణిశర్మ అన్న మాటలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దాంతో నెటిజన్లు ఆచార్య సినిమా పై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ పై స్పందించారు.
ఏ చిత్ర బృందం అయినా తాము తీసిన సినిమా హిట్ అవ్వాలనే తీస్తారని, అవికొన్నిసార్లు అవి హిట్ అవుతాయి. మరి కొన్నిసార్లు ప్లాప్ అవుతాయని, దానికి ఎవరిని విమర్శించడం కరెక్ట్ కాదని కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇంతవరకు మణిశర్మ, చిరంజీవి కాంబోలో వచ్చిన చిత్రాలన్నీ మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. చూడాలని ఉంది, ఇంద్ర, బావగారు బాగున్నారా, ఠాగూర్ ఇలా చేసిన సినిమాలన్ని మ్యూజికల్ హిట్స్. మృగరాజు, జై చిరంజీవ సినిమాలకు కూడా మణిశర్మ మంచి సంగీతాన్ని ఇచ్చాడు. అదేంటో ఒక్క ‘ఆచార్య’ సినిమాకి ఆ సెంటిమెంట్ పని చేయలేదు.
ఇక అసలు షయానికొస్తే, బాలకృష్ణ, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న వీరసింహా రెడ్డి మూవీ నుండి జై బాలయ్య పాట శుక్రవారం రిలీజ్ అయ్యింది. తమన్ సంగీతం అందించిన ఈ పాట పై సోషల్ మీడియాలో పెద్ద దుమారం వచ్చింది. ఈ సాంగ్ పై నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి. దీనిని ఓసేయ్ రాములమ్మ సాంగ్ తో పోలుస్తూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఆయన మళ్లీ కాపీ కొట్టారని విమర్శిస్తున్నారు. మరి కొందరు ఈ పాట రాసిన రచయిత రామజోగయ్య శాస్త్రీని కూడా ట్రోల్ చేస్తున్నారు. ఆయన పేరులోని సరస్వతీ పుత్ర పేరును తొలగించాలని అంటున్నారు.