Ads
టీమిండియాకు భారీ షాక్ తగిలింది. వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్ సందర్భంగా చీలమండల గాయం అయ్యింది మన స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకు.వరల్డ్‌కప్ అనంతరం భారత్ ఆడబోయే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్‌లకు కూడా దూరం కానున్నాడు.
Video Advertisement
హార్థిక్ గాయానికి శస్త్రచికిత్స చేయాలని డాక్టర్లు సూచించినట్లు తెలుస్తుంది. అతను గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు కనీసం రెండు నెలల సమయం పట్టవచ్చని సమాచారం. ఈ మధ్యలోనే భారత్ స్వదేశంలో ఆస్ట్రేలియాతో, సౌతాఫ్రికాను వారి గడ్డపై ఢీకొట్టాల్సి ఉంది.
కాగా, వరల్డ్‌కప్ అనంతరం నవంబర్ 23 నుంచి భారత్ స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. అనంతరం డిసెంబర్ 10 నుంచి 2024 జనవరి 7 వరకు సౌతాఫ్రికాతో 3 వన్డేలు, 3 టీ20లు, 2 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది.ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ బెర్త్‌లు ఖరారైన విషయం తెలిసిందే. నిన్న సౌతాఫ్రికాతో జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలుపొంది తుది పోరుకు అర్హత సాధించింది. అంతకుముందు భారత్.. న్యూజిలాండ్‌ను 70 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరింది.
ఇది ఇలా ఉండగా హార్దిక్ పాండ్యా కి బదులు ఆస్ట్రేలియా తో ఆడే T20 సిరీస్ మ్యాచ్లులో రుతురాజ్ గైక్వాడ్ ని తీసుకునే అవకాశం ఉంది అంది సమాచారం.సేమి ఫైనల్ విడుదల అవ్వాల్సిన టీం లిస్ట్ ఫైనల్స్ తరువాత నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది.మొదటి T20 ఆట విశాఖపట్నం లో నవంబర్ 23 న జరగనుంది,చివరి ఆట డిసెంబర్ 3 న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం లో జరగనుంది.
యశస్వి జైస్వాల్, శుభమాన్ గిల్, రింకు సింగ్, సుర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, KL రాహుల్, ఇషాన్ కిషన్,రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్,రుతురాజ్ గైక్వాడ్ లతో కూడిన టీం ఈ సిరీస్ లో ఆడే అవకాశం ఉంది అని సమాచారం. ఇంక వరల్డ్ కప్ ఫైనల్స్ తరువాత అధికారిత ప్రకటన రావాల్సి ఉంది.
End of Article