ఆస్ట్రేలియాని ఒడించాలి అంటే సూర్యకుమార్ బదులు… ఈ ప్లేయర్ ని తీసుకోవడమే కరెక్ట్..! ఎవరంటే..?

ఆస్ట్రేలియాని ఒడించాలి అంటే సూర్యకుమార్ బదులు… ఈ ప్లేయర్ ని తీసుకోవడమే కరెక్ట్..! ఎవరంటే..?

by Mounika Singaluri

Ads

వరల్డ్ కప్ సమరానికి ఇక రెండు రోజుల్లో ముగింపు పలకనుంది. 2023 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచులు కూడా పూర్తి అయిపోయాయి.ఫైనల్ లో తలపడే జట్లు ఏవో అందరికీ తెలిసిపోయాయి. నవంబర్ 19వ తారీఖున అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్ లో ఇండియా ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.

Video Advertisement

గురువారం జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికాని ఓడించి ఫైనల్స్ కి అడుగుపెట్టింది. అయితే ఫైనల్ లో ఆస్ట్రేలియాని ఓడించాలంటే భారత్ టీం లో మార్పులు చేయాల్సినదే అని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇప్పటివరకు భారత్ 1983, 2003, 2011లో మూడుసార్లు వరల్డ్ కప్ ఫైనల్స్ కి చేరుకుంది. ఇది నాలుగోసారి భారత ఫైనల్స్ కి చేరడం. ఆస్ట్రేలియా కూడా ఫైనల్స్ ఆడిన అనుభవం ఉన్న జట్టు. రెండు కూడా నువ్వా నేనా అన్న రీతిలో పోరాడుతాయి. ఇప్పటికే భారత్ జట్టు అహ్మదాబాద్ చేరి ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఆస్ట్రేలియా కూడా శుక్రవారం అహ్మదాబాద్ చేరి ప్రాక్టీస్ ప్రారంభిస్తుంది.ఈ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా పై నెగ్గాలంటే భారత జట్టులో కొన్ని మార్పులు చేయాలని అంటున్నారు. ప్రస్తుతం భారత్ కి ఐదు బౌలింగ్ ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఆరో బౌలింగ్ ఆప్షన్ కూడా ఉంటే రోహిత్ సేనకి మరింత బలం చేకూరుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

బ్యాటింగ్ లో భారత్ మంచి ఫామ్ లో ఉంది. కాబట్టి సూర్య కుమార్ యాదవ్ ను తప్పించి అతని స్థానంలో స్పిన్ బౌలర్ అశ్విన్ ను తీసుకువస్తే భారత్ కి మరింత బలం చేకూరుతుందని అంటున్నారు.అశ్విన్ బౌలింగ్ లో బ్యాటింగ్ చేయడం ఆసీస్ బ్యాటర్ లకు అంత ఈజీ కాదు.వార్నర్, ట్రవిస్ హెడ్,స్టార్క్,హెజెల్ వుడ్ ఇలా నాలుగు లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్ మెన్ ఆసీస్ లో ఉన్నారు. వీరికి అశ్విన్ బౌలింగ్ లో బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు.ఆసీస్ ను తక్కువ స్కోర్ కే కట్టడి చేయాలి అంటే ఆరో బౌలర్ ఉండాల్సిందే అని అంటున్నారు.మరీ టీం మనేజ్ మెంట్, రోహిత్ కలిసి ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

 

Also Read:శుభ్‌మన్ గిల్ గాయం నిజం కాదా..? ఇదంతా రోహిత్ ప్లానా..?


End of Article

You may also like