దక్షిణాఫ్రికాతో టీమ్ ఇండియా ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇలా ఓటమిని ఎదుర్కోవడం మూలాన కొన్ని మార్పులు చేస్తే టీమ్ ఇండియా కి మంచిదని తెలుస్తోంది. భారత్ కి ఓటమి ఎదురు కావడంతో 2022 టీ 20 ప్రపంచ కప్‌ లో సెమీ-ఫైనల్స్‌కు వెళ్లే ఛాన్స్ ని కాస్త డిఫికల్టీ చేసుకుంది. అయితే ఓటమిని ఎదుర్కోవడం మూలాన కొన్ని మార్పులు చేస్తే మంచిదని టీమ్ ఇండియా మాజీ స్పిన్నర్ హర్బజన్ సింగ్ అన్నారు.

Video Advertisement

మరి మాజీ స్పిన్నర్ హర్బజన్ సింగ్ ఏం అన్నారనేది ఇప్పుడే చూద్దాం. ఇది మరీ అంత కష్టమైనా సమయం కాదు కానీ కే ఎల్ రాహుల్ ఫెయిల్ అవ్వడం అనేది ఆలోచించాలని అన్నారు.

అయితే మాజీ స్పిన్నర్ హర్బజన్ సింగ్ ఓపెనింగ్ విషయంలో జాగ్రత్త పడాలని.. ఓపెనర్స్ కాబినేషన్ మార్చాలని అన్నారు. ఫామ్‌ తో కే ఎల్ రాహుల్ ఇబ్బంది పడుతుంటే కనుక రిషబ్ పంత్‌ను తీసుకు రావాలని నేను అనుకుంటున్నానని హర్భజన్ చెప్పారు. అలానే దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో దినేష్ కార్తీక్ కూడా ఫెయిల్ అయ్యాడని.. పంత్ ని టీమ్ లో పెట్టి లోయర్ మిడిల్ ఆర్డర్‌లో కార్తీక్ బదులు దీపక్ హుడా ని పెట్టాలని హర్భజన్ చెప్పారు.

రోహిత్ శర్మ తో కలిసి రిషబ్ పంత్ ఆటను స్టార్ట్ చేయగలడని అన్నారు. లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ బ్యాట్స్ మేన్స్ ని ఓపెనర్స్ గా పంపొచ్చు అని చెప్పారు. దీపక్ హుడా కి బౌలింగ్ చేసేందుకు అవకాశం ఇవ్వొచ్చని అన్నారు. బౌలర్లు విషయానికి వస్తే.. రవిచంద్రన్ అశ్విన్ కాకుండా యుజ్వేంద్ర చాహల్‌ను టీమ్ లో పెట్టాలన్నారు.

నాలుగు ఓవర్లలో 43 పరుగులు అశ్విన్ ఇచ్చాడని… యుజ్వేంద్ర చాహల్‌ని టీమ్ లో పెడితే మంచిదని హర్భజన్ చెప్పారు. పైగా యుజ్వేంద్ర చాహల్‌ కి టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం ని కూడా ఇవ్వలేదన్నారు హర్భజన్. కనుక రవి చంద్రన్ అశ్విన్ కాకుండా యుజ్వేంద్ర చాహల్‌ను టీమ్ లో పెట్టాలన్నారు.