మీకు చిప్స్ తినే అలవాటు ఉందా..? కానీ ఆ చిప్స్ ని ఎలా తయారు చేస్తారో తెలుసా..?

మీకు చిప్స్ తినే అలవాటు ఉందా..? కానీ ఆ చిప్స్ ని ఎలా తయారు చేస్తారో తెలుసా..?

by kavitha

Ads

స్నాక్స్ అనగానే చాలా మందికి గుర్తొచ్చేది చిప్స్‌ అని చెప్పవచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు లొట్టలేసుకుంటూ  తింటుంటారు. ఫ్రెండ్స్ తో చాట్ చేసినా, జర్నీలోనూ, సినిమాలు చూస్తున్నప్పుడు చిప్స్ ప్యాకెట్లు వెంట తీసుకెళ్తుంటారు.

Video Advertisement

చిప్స్ ఇష్టపడే వారిని దృష్టిలో పెట్టుకుని, వివిధ కంపెనీలు రకరకాల ప్లేవర్లతో చిప్స్‌ను తయారు చేసి, కలర్ ఫుల్  ప్యాకెట్లలో ప్యాక్ చేసి మార్కెట్లోకి పంపుతూ ఉంటారు. అయితే చిప్స్ ని చాలా ఇష్టంగా తినే వారిలో ఎక్కువ మందికి, చిప్స్ ని ఫ్యాక్టరీల్లో ఏ విధంగా తయారు చేస్తారో తెలియదు. ప్రస్తుతం చిప్స్ ని ఫ్యాక్టరీల్లో తయారుచేసే వీడియో ఒకటి  నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
బంగాళదుంపలతో ఫ్యాక్టరీలో చిప్స్ తయారు చేసే ప్రాసెస్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మార్కెట్‌ నుంచి తెచ్చిన బంగాళదుంపల సంచులు ఓపెన్‌ చేయడం నుంచి, చిప్స్‌ ప్యాకింగ్ వరకు మొత్తం ప్రాసెస్ ను చూపించారు. అనికైత్ లూత్రా అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో విపరీతంగా వైరల్‌ అవుతోంది.
ఈ వీడియోలో కార్మికులు బంగాళాదుంపల సంచులను మెషిన్లలో వేస్తుంటారు. అక్కడి నుంచి మరో మెషీన్ లోకి వెళ్లిన బంగాళాదుంపలు, నీటిలో శుభ్రమవుతాయి. ఆ తరువాత మరో మెషీన్ లోకి వెళ్లడంతో అక్కడ దుంపల తొక్కలు తొలగిపోతాయి. ఆ తరువాత చిప్స్ ఆకారంలో బంగాళాదుంపలను కట్ చేసి మరుగుతున్న వేడి నూనెలో వేస్తారు.
ఇలా రెడీ అయిన చిప్స్ ను చివరకు ప్యాకింగ్ దగ్గరకు వెళ్తాయి. అక్కడున్నవారు ఆ చిప్స్ ను ప్యాక్ చేసి, బాక్సులలో పెట్టి, షాప్స్ కు పంపించడానికి సిద్ధం చేస్తారు. ఈ వీడియో పై నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో 6లక్షలకు పైగా లైక్‌లను పొందింది.

https://www.instagram.com/p/Cxk3aywovft/

Also Read: నిన్నటి నుండి ఎక్కడ చూసినా ఈ అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు..! ఇంతకీ ఈమె ఎవరో తెలుసా..?


End of Article

You may also like