భారత్ పాకిస్థాన్ మధ్య నిన్న జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు కన్నుల పండుగగా సాగింది. ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్ లు ఒక ఎత్తు ఈ ఒక్క మ్యాచ్ ఒక ఎత్తు అన్నట్టు టీమ్ ఇండియా అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

Video Advertisement

దీనికి కారణం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై భారత్ ఘనవిజయం. ఈ మ్యాచ్ లో భారత్ పాకిస్థాన్ పై 228 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 357 పరుగుల లక్ష్యాన్ని సాధించే క్రమంలో పాకిస్థాన్ ప్లేయర్లు కాస్త తడబడ్డారు.

comments on jadeja

ప్రశాంతంగా సాగే ఈ ఆట నేపథ్యంలో పాక్ ప్లేయర్ సల్మాన్ ముఖానికి గాయం అయింది. ఈసారి టీమిండియాలో బ్యాటింగ్ ఫుల్ ఫామ్ లో ఉండగా బౌలింగ్ అంతకుమించి స్ట్రాంగ్ గా కనిపించింది. దీంతో పాక్ టాప్ ఆర్డర్ తేలిపోయింది.. ఇక ఆ తర్వాత వచ్చిన వారు కూర ఎలా చేయాలో అర్థం కాక బంతులు ఎదుర్కోలేక తికమక పడ్డారు.

comments on jadeja

మొత్తానికి ఫీల్డ్ లోకి హెల్మెట్ లేకుండా బ్యాటింగ్ చేయడానికి వచ్చిన సల్మాన్…ఆ ఒక్క కారణంగా ముక్కు పగలగొట్టుకున్నాడు. రవీంద్ర జడేజా బౌలింగ్ లో ఎదురుగా వస్తున్న బాలు స్వీప్ షార్ట్ గా మార్చడానికి ప్రయత్నించగా…ఆ బాల్ బాట్ అంచును తాకి బౌండరీ వైపు వెళ్లకుండా నేరుగా సల్మాన్ ముఖం వైపుకు వచ్చింది. దీంతో బాల్ ముఖానికి తగిలి రక్తం కూడా కారింది.

this player should play in asia cup 2023 ind vs pak

ఇన్నింగ్స్ 21వ ఓవర్లో చివరి బంతి వేస్తున్న రవీంద్ర స్పిన్నరే కదా బౌలింగ్ వేసేది ఏమవుతుందిలే…అని సల్మాన్ ఈజీగా తీసుకోవడంతో…అతని ముఖం పచ్చడి అయ్యింది. కంటి కింద పెద్ద గాయం కాగా బాగానే రక్తం వచ్చింది. దెబ్బ తీవ్రత ఎక్కువగా ఉండడంతో అతను నొప్పితో విలవిలలాడిపోయాడు. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దెబ్బ తగిలితే తగిలింది.. అయ్యో అనడం పక్కనపెట్టి…తలకు హెల్మెట్ పెట్టుకుంటే బాగుండేదిగా , మరందుకే హెల్మెట్ వాడమని చెప్పేది..అంటూ నటిజన్ లు సల్మాన్ పై తమ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు