24.75 కోట్లు పెట్టి కొన్న ప్లేయర్… కానీ రెండు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేదు.. పైగా 100 పరుగులు.! ఎవరంటే.?

24.75 కోట్లు పెట్టి కొన్న ప్లేయర్… కానీ రెండు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేదు.. పైగా 100 పరుగులు.! ఎవరంటే.?

by Mohana Priya

Ads

ఐపీఎల్ మొదలు అయ్యింది. ప్రపంచం అంతా కూడా టీవీ స్క్రీన్ లకి అతుక్కుపోతుంది. అసలు ఐపీఎల్ కి ఉన్న క్రేజ్ వేరు. అందులో ఆడే ప్లేయర్లకి కూడా అంతే పాపులారిటీ ఉంటుంది.సాధారణంగా క్రికెట్ లో బౌలర్ల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. బాటర్లని భయపెడుతూ పరుగులు చేయించడం, వికెట్లు మీద వికెట్లు తీయడం అనేది క్రికెట్ లో చాలా కీలకం. అందుకే బౌలర్లని చాలా జాగ్రత్తగా ఆచితూచి ఎంపిక చేసుకుంటారు. కానీ అలా ఎంపిక చేసుకున్న తర్వాత కూడా కొంత మంది సరిగ్గా ఆడకుండా, వారి పేలవమైన ప్రదర్శనతో టీం మొత్తానికి భారంగా మారతారు.

Video Advertisement

comments on mitchell starc

ఇప్పుడు అలాగే జరుగుతోంది. ఐపీఎల్ లో ఒక ప్లేయర్ మినీ వేలంలో 24.75 కోట్లకి అమ్ముడుపోయారు. కానీ టీం ఓటమికి కారణం అవుతున్నారు. ఇప్పటి వరకు ఆడిన ఒక్క మ్యాచ్ లో కూడా సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయారు. ఆ ప్లేయర్ పేరే మిచెల్ స్టార్క్. ఆస్ట్రేలియాకి చెందిన స్టార్ ప్లేయర్ మిచెల్ స్టార్క్, 8 సంవత్సరాల తర్వాత మళ్లీ ఐపీఎల్ లోకి అడుగు పెట్టారు. ఇప్పటి వరకు రెండు మ్యాచ్ లు ఆడారు. కానీ తన ప్రదర్శనతో టీం కి ఎటువంటి లాభం లేకపోయింది. మొదటి మ్యాచ్ లో హైదరాబాద్ జట్టుతో తలపడ్డారు. ఇందులో మిచెల్ స్టార్క్ ఆడిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు గెలిచింది. కానీ ఇందులో మిచెల్ స్టార్క్ ప్రదర్శన అంత చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు.

comments on mitchell starc

ఈ మ్యాచ్ లో 53 పరుగులు సమర్పించుకున్న మిచెల్ స్టార్క్, ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. ఆ తర్వాత బెంగుళూరు జట్టుతో ఆడిన మ్యాచ్ లో కూడా మంచి ప్రదర్శన ఇవ్వలేకపోయారు. 4 ఓవర్ల బౌలింగ్ లో 47 పరుగుల స్కోర్ చేశారు. కానీ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. ఇప్పటివ రకు వాడిన రెండు మ్యాచ్ లలో 12.50 ఎకానమీతో 8 ఓవర్లకి 100 పరుగులు సమర్పించుకున్నారు. ఈసారి కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ ట్రోఫీని తమ ఇంటికి తీసుకు వెళుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ మిచెల్ స్టార్క్ టీం విఫలం అవ్వడానికి కారణం అవుతున్నారు. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ లలో ఎంతో నిరాశపరిచే పర్ఫార్మెన్స్ ని ప్రదర్శించారు. ఈ కారణంగానే మిచెల్ స్టార్క్ పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ALSO READ : IPL2024 GT VS MI:ఈజీగా గెలిచే మ్యాచ్ లో కూడా “ముంబై ఇండియన్స్” ఓడిపోవడానికి 3 ప్రధాన కారణాలు ఇవే.!


End of Article

You may also like