Ads
టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్‌తో అందరినీ ఆకర్షిస్తాడు. అలాగే తన సరదా స్టైల్‌తో కూడా అందరిని ఆకర్షిస్తున్నాడు.
Video Advertisement
అయితే ఆసియా కప్‌లో భారత్, బంగ్లాదేశ్ సూపర్-4 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ చేసిన ఫన్నీ స్టైల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
బ్రేక్ సమయాల్లో విరాట్ కోహ్లీ వాటర్ బాటిల్స్ తీసుకుని ఫన్నీ స్టైల్‌లో సరదాగా కనిపించాడు. కోహ్లీ స్టైల్ ఆటగాళ్లకు ఎంతగానో నచ్చింది. అయితే విరాట్ కోహ్లీ నీరు అందిస్తూ పరిగెత్తిన తీరు నెటిజన్లుకు సరదా అనిపిస్తుంది. ఈ వీడియోలో కోహ్లీ సంతోషంగా ఉండటంతో పాటు ఆటగాళ్లకు వాటర్, డ్రింక్స్ ఇస్తున్నాడు.
సోషల్ మీడియాలో పోస్ట్ అయిన గంటకే ఈ వీడియోకి ఎన్నో లైక్‌లు, వ్యూస్ వచ్చాయి. కొందరు నెటిజన్లు అయితే కోహ్లీ భాయ్ డిఫరెంట్ అని, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాయ్ అని నెటిజన్లు అంటున్నారు. మరికొందరైతే స్టార్ హోదా ఉన్న క్రికెటర్ ఆటగాళ్లకు డ్రింక్స్, వాటర్ బాటిల్ ఇవ్వడంతో ఆయన చేసిన పనికి ప్రశంసిస్తున్నారు. దట్ ఈజ్ విరాట్ కోహ్లీ అని కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు.
End of Article