Ads
Surya Kumar Yadav in Asia Cup 2023: ఆసియా కప్ 2023లో రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ మొదటి ఓటమిని చవిచూసింది. సూపర్ 4 లో భాగంగా జరిగిన ఆఖరి మ్యాచులో బంగ్లాదేశ్ టీమిండియా పై గెలిచింది. కానీ ఈ మ్యాచ్ ఫలితం భారత జట్టు పై అంతగా ప్రభావం చూపించదు.
Video Advertisement
కారణం ఏమిటంటే, ఇప్పటికే ఇండియా, శ్రీలంక జట్లు ఫైనల్స్‌కు వెళ్ళాయి. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17న జరుగనుంది. తాజాగా బంగ్లాదేశ్ తో ఆడిన మ్యాచ్ లో టీంఇండియా పరాజయం పొందిన తరువాత నెటిజెన్లు సూర్యకుమార్ యాదవ్ ను ట్రోల్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ కి దిగిన బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు స్కోర్ చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ దిగిన భారత జట్టులో శుభ్‌మన్ గిల్ సెంచరీ చేసినా, టార్గెట్ ఛేదించలేక 259 రన్స్ కే ఆల్ అవుట్ అయ్యింది. ఈ మ్యాచ్ లో ఆడిన క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ప్రదర్శన మీద క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం ఏమిటంటే, ఆసియా కప్ 3 టోర్నీలో బంగ్లాదేశ్ మ్యాచ్ ముందువరకు సూర్యకుమార్ యాదవ్ కి అవకాశం రాలేదు. ఈ మ్యాచ్ లో మేనేజ్మెంట్ జట్టులో కొన్ని మార్పులు చేసింది. దానిలో భాగంగా విరాట్ కోహ్లీకి విశ్రాంతిని ఇచ్చింది. సూర్యకుమార్ యాదవ్ కు జట్టులో చోటు కల్పించింది. అయితే సూర్యకుమార్ రాక రాక వచ్చిన ఛాన్స్ ను సద్వినియోగం చేసుకోలేకోయాడు.
బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 34 బాల్స్ ను ఎదుర్కొన్న సూర్యకుమార్ యాదవ్ 3 ఫోర్లతో 26 రన్స్ మాత్రమే చేసి, బంగ్లాదేశ్ సారధి షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యి, మైదానం నుండి వెనుదిరిగాడు. షాట్ సెలెక్షన్ మిస్టేక్ వల్ల అవుట్ అయ్యాడు. దీంతో వన్డేల్లో సూర్యకుమార్ యాదవ్ కన్నా మెరుగైన రికార్డు కలిగిన సంజూ శాంసన్‌ను సెలెక్ట్ చేయకుండా సూర్యను సెలెక్ట్ చేసిన బీసీసీఐ పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇలాంటి ప్లేయర్ ను ప్రపంచకప్ కు ఎంపిక చేయడం పై క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
End of Article