మొన్న ఏమో వాటర్‌బాయ్… ఇప్పుడు ఏమో..? ఏంటి కోహ్లీ ఇది..?

మొన్న ఏమో వాటర్‌బాయ్… ఇప్పుడు ఏమో..? ఏంటి కోహ్లీ ఇది..?

by kavitha

Ads

వెస్టిండీస్, భారత జట్టు మధ్య జరిగిన మూడవ వన్డేలో టీం ఇండియా 200 పరుగుల తేడాతో వెస్టిండీస్ పై ఘన విజయం సాధించి, సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. ఈ సిరీస్ తో విండీస్‌ పై 2007- 2023 మధ్య వరుసగా 13 వన్డే సిరీస్‌లు గెలిచి రికార్డ్ క్రియేట్ చేసింది.

Video Advertisement

అయితే ఈ సిరీస్ లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌ చూడాలని ఎదురుచూసిన ఫ్యాన్స్ కు మాత్రం నిరాశే మిగిలింది. టీం ఇండియా మేనేజ్‌మెంట్‌ ఈ సిరీస్ లో మొదటి వన్డే మ్యాచ్ నుండే ప్రయోగాలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే.ఇక బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు చేయడంతో విరాట కోహ్లీ, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్ కి దిగడానికి రెడీ అయ్యారు. కానీ మొదటి వన్డేలో కోహ్లి బ్యాటింగ్‌ కి రాకముందే టీం ఇండియా విజయం సాధించింది. దాంతో విరాట్ బ్యాటింగ్ చూసే ఛాన్స్ అభిమానులకు దొరకలేదు. ఇక ఆ తరువాత జరిగిన రెండో వన్డేలో వీరిద్దరిని విశ్రాంతి పేరుతో  మ్యాచ్ కు దూరంగా ఉంచారు. కానీ ఆ మ్యాచ్ లో భారత జట్టు ఘోరమైన పరాజయాన్ని పొందింది.చివరిది అయిన మూడవ మ్యాచ్ లో కూడా మళ్ళీ వీరిద్దరికి విశ్రాంతినిచ్చారు. దీంతో ఈ సిరీస్ మొత్తంలో కోహ్లీ ఆటను  చూడాలనుకున్న ఫ్యాన్స్ కు నిరాశే ఎదురయ్యింది. కానీ హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీలో రెండో వన్డేలో పరాజయం పొందినా, మూడవ వన్డేలో మాత్రం 200 పరుగుల తేడాతో గెలిచి, సిరీస్ ను కైవసం చేసుకోవడంతో భారత క్రికెట్ ఫ్యాన్స్ సంతోష పడుతున్నారు.
ఇదిలా ఉండగా, మైదానంలో కోహ్లీ బ్యాటింగ్ చూడలేకపోయినా, మొదటి వన్డేలో వాటర్‌బాయ్‌ గా విరాట్‌ కోహ్లి కనిపించాడు. అలాగే ఆఖరి వన్డేలో సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌గా వచ్చాడు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. ఆ వీడియోకి ‘‘కోహ్లీ గ్రౌండ్ లో ఉంటే చాలు, కానీ బ్యాటింగ్‌ మెరుపులను మిస్ అవుతున్నాం’’ అని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

Also Read: ధోనీ, కోహ్లిలతో ఆడే ఈ ప్లేయర్ కి 100 కోట్ల ఆస్తి ఉందా..? క్రికెట్ వైపు ఎలా వచ్చాడంటే..?


End of Article

You may also like