ఈ “పాకిస్తాన్ క్రికెటర్” మీద భారతీయ లాయర్ ఎందుకు కేసు వేశారు..? నోటీస్ లో ఏం ఉందంటే..?

ఈ “పాకిస్తాన్ క్రికెటర్” మీద భారతీయ లాయర్ ఎందుకు కేసు వేశారు..? నోటీస్ లో ఏం ఉందంటే..?

by Mohana Priya

Ads

హైదరాబాద్ లో అక్టోబర్ 6 వ తేదీన నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో జరిగిన ఒక విషయం మీద పాకిస్తాన్ కీపర్, బాటర్ మహ్మద్ రిజ్వాన్ మీద వినీత్ జిందాల్ అనే భారతీయ న్యాయవాది ఐసీసీలో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే, ఆ రోజు మ్యాచ్ మధ్యలో రిజ్వాన్ మైదానంలో నమాజ్ చేశారు.

Video Advertisement

అంత మంది భారతీయుల ముందు ఇలా ప్రార్థన చేయడం అనేది తన కులాన్ని చూపించడం అవుతుంది అని, క్రీడ అనే ఒక వృత్తిలో ఉన్నప్పుడు ఇలాంటి పని చేయడం అనేది క్రీడా స్ఫూర్తికి ప్రభావం చేసే పని అని వినీత్ అన్నారు.

complaint on mohammad rizwan world cup 2023

తన ఫిర్యాదులో వినీత్ ఈ విషయంపై మాట్లాడుతూ, “మైదానంలో ప్రార్థన చేయడం, శ్రీలంకపై తన ప్రదర్శనని గాజాకి అంకితం చేయడం ఇవన్నీ కూడా మతపరమైన విషయాలు” అని అన్నారు. అంతే కాకుండా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ కి, పాకిస్తాన్ కి మధ్య జరిగిన మ్యాచ్ లో మన ఇండియా గెలిచిన సంగతి తెలిసిందే.

complaint on mohammad rizwan world cup 2023

తన కంప్లైంట్ కి సంబంధించి స్టేట్మెంట్ కూడా వినీత్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. ఇందులో ఈ విషయం మీద వివరంగా రాశారు. ఇందులో వినీత్ మాట్లాడుతూ, క్రీడకి సంబంధం కాని విషయం ఏదైనా కూడా, క్రీడా స్ఫూర్తిని పెంపొందించదు అని, అలాంటివి చేయకూడదు అని, మైదానంలో ఉన్నప్పుడు క్రీడకి మాత్రమే పరిమితం అయ్యి ఉండాలి అని అర్థం వచ్చేలాగా రాశారు. అంతే కాకుండా 2021 లో కూడా రిజ్వాన్ మైదానంలో నమాజ్ చేశారు అని ఇందులో పేర్కొన్నారు.

complaint on mohammad rizwan world cup 2023

“క్రీడలు అనేది అంతర్జాతీయంగా నిర్వహించడానికి కారణం ఏంటంటే, ఇలా చేయడం వల్ల ఒక దేశానికి మరొక దేశానికి మధ్య కులం, మతం, జాతి అనే వాటితో సంబంధం లేకుండా ఒక మంచి సంబంధం ఏర్పడుతుంది అనే కారణంతోనే ఇలా చేస్తారు” అని వినీత్ ఇందులో అన్నారు. దాంతో రిజ్వాన్ మీద కఠినమైన చర్య తీసుకోవాలి అని వినీత్ ఇందులో రాశారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ALSO READ : 1P/SEC తో టెలికాం రంగంలో రెవల్యూషన్ తీసుకొచ్చిన “టాటా డొకోమో”…ఎందుకు సడన్ గా క్లోజ్ అయ్యింది.?


End of Article

You may also like