ఇదెక్కడి యాడ్ రా మావా…? ఐస్ క్రీం తింటే ముద్దు పెట్టేసినట్టే అంట..? మీరూ చూసి నవ్వుకోండి..!

ఇదెక్కడి యాడ్ రా మావా…? ఐస్ క్రీం తింటే ముద్దు పెట్టేసినట్టే అంట..? మీరూ చూసి నవ్వుకోండి..!

by Anudeep

Ads

ఏదైనా ప్రోడక్ట్ ను ప్రమోట్ చేయాలంటే అడ్వర్టైజ్మెంట్ తప్పనిసరి. ఇందుకోసం ఆక్టర్స్ ను ఎంపిక చేసుకుని.. షూటింగ్ చేసి.. ఆ వీడియోలను టివి లలోను, యూట్యూబ్ వంటి సోషల్ మీడియాలలోను అడ్వర్టైజ్మెంట్ గా ఇచ్చేస్తుంటారు. మనం సినిమా చూస్తున్నప్పుడో.. లేక ఏదైనా వీడియో చూస్తున్నప్పుడో ఈ వీడియో లు చూసి ప్రోడక్ట్ గురించి తెలుసుకుంటూ ఉంటాం.

Video Advertisement

cornetto 1

అయితే, ఈ అడ్వర్టైజ్మెంట్ లను మనం స్కిప్ చేయకుండా చూడాలంటె అవి ఎంతో క్రియేటివ్ గా ఉండాలి. లేకపోతె అడ్వర్టైజ్మెంట్ అనగానే మనకు వచ్చే చిరాకు తో వాటిని స్కిప్ చేసుకుంటూ పోతాం. కానీ, ప్రోడక్ట్ ప్రమోషన్ కి అడ్వర్టైజ్మెంట్ ను చాలా క్రియేటివ్ గా తీర్చిదిద్దితేనే ఉపయోగం ఉంటుంది. అయితే, ఇవి సరిగ్గా తీయకపోతే చూడడానికి ఎంత చిరాకు తెప్పిస్తాయి ఓ కోరా యూజర్ ఇలా వివరించారు.

cornetto 2

ఓ కోర్నెట్టో కోన్ ఐస్ క్రీం అడ్వర్టైజ్మెంట్ గురించి ఉపాసన అనే యూజర్ ప్రస్తావించారు. ఈ అడ్వర్టైజ్మెంట్ లో ఓ అమ్మాయి నడుస్తూ.. అటు పక్కన కూర్చున్న అబ్బాయిలను చూస్తుంది. వారిలో ఓ అబ్బాయి ఆమెకు బాగా నచ్చుతాడు. అయితే, ఏమి మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయి కోర్నెట్టో కోన్ ఐస్ క్రీం ను కొనుక్కుని తింటుంది. ఆమె పెదవులను ఐస్ క్రీం పై పెట్టగానే.. ఆమె ఇష్టపడ్డ అబ్బాయికి ముద్దు పెట్టించుకున్న ఫీల్ కలుగుతుంది.

cornetto 3

మరో రోజు.. ఆ అబ్బాయి అదే ఐస్ క్రీం కొనుక్కుని తింటాడు.. ఆమె యోగా చేస్తూ ఉంటుంది. ఆ అబ్బాయి ఐస్ క్రీం తిన్నా కూడా.. ఆమెకు ముద్దు పెట్టించుకున్న ఫీల్ వచ్చేస్తుంది. దీనికి వెనక ఉండే సైంటిఫిక్ ఎక్సప్లనేషన్స్ గురించి మనం మాట్లాడద్దు.. కానీ, రియల్ లైఫ్ లో అస్సలు పోసిబుల్ కానీ ఇలాంటివాటిని అడ్వర్టైజ్మెంట్ లు గా తీస్తే అవి మరింత ఇబ్బందిని కలిగిస్తాయి.

cornetto 4

ఒక అమ్మాయి ఓ అబ్బాయిని ఇష్టపడ్డా కూడా చెప్పడానికి నానా తంటాలు పడుతుంది.. ఒక ఐస్ క్రీం తినేస్తే అది ఎలా పాజిబుల్ అవుతుంది అసలు. ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ లు చూసినప్పుడల్లా నవ్వొస్తూ ఉంటుంది కదా.

watch video:


End of Article

You may also like