Ads
కరోనా కారణంగా ఆగిపోయిన క్రికెట్ లీగ్ సన్ని మళ్లీ మొదలవుతున్నాయి.ఇక అందులో భాగంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌ను దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు నిర్వహించేందుకు బీసీసీఐ సన్నద్ధం అవుతుంది.ఈ టైంలో కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) కు మరియు ఐపీఎల్ కు క్లాష్ అవ్వకుండా ఉండడం కోసం విండీస్ క్రికెట్ బోర్డు జాగ్రత్తలు తీసుకుంది.అందుకోసం ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 10 వరకు సీపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించాలని విండీస్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది.దీని ఫలితంగా ఐపీఎల్ ఆడేందుకు ప్లేయర్స్ కు 9రోజులు విశ్రాంతి లభిస్తుంది.
Video Advertisement
ఇక ఈ టోర్నీని మొదట ఆరు దేశాలలో నిర్వహించాలి అనుకున్న విండీస్ బోర్డ్ ప్రస్తుతానికి ఈ టోర్నీని ప్రేక్షకులు లేకుండా ట్రినిడాడ్, టొబాగోలో నిర్వహించాలని నిర్ణయించింది. మొత్తానికి ఈ సీజన్ లో 6 టీంలు 33 మ్యాచులు ఆడనున్నాయి.
End of Article