ఈ 13 మంది క్రికెటర్లకు ఉన్న బిజినెస్ ల గురించి మీకు తెలుసా.? ఎవరికి ఏ బిజినెస్ లు ఉన్నాయంటే.?

ఈ 13 మంది క్రికెటర్లకు ఉన్న బిజినెస్ ల గురించి మీకు తెలుసా.? ఎవరికి ఏ బిజినెస్ లు ఉన్నాయంటే.?

by Mohana Priya

Ads

సాధారణంగా ఎంతో మంది కేవలం ఒక కెరియర్ కి మాత్రమే పరిమితం అవ్వకుండా వేరే వాటిలో కూడా తమ సంపాదనను ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అలా మన క్రికెటర్లు కూడా కేవలం క్రికెట్లో రాణించడం మాత్రమే కాకుండా, వేరే ఎన్నో వ్యాపారాలలో అడుగు పెట్టి ముందుకు సాగుతున్నారు. అలా వ్యాపార రంగంలో ఉన్న మన క్రికెటర్లు కొంత మంది ఎవరో, అలాగే వారి వ్యాపారాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

#1 సచిన్ టెండూల్కర్

సచిన్ టెండూల్కర్ హైదరాబాద్ కి చెందిన స్మార్ట్ రన్ ఇండియా అనే స్టార్టప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు.

Cricketers and their business Ventures

#2 విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీకి తన సొంత బ్రాండ్లు WROGN, One 8 ఉన్నాయి. అలాగే ఒక సోషల్ మీడియా టెక్ స్టార్ట్ అప్, స్పోర్ట్స్ కాన్వో, అలాగే చిజెల్ జిమ్స్ లో కూడా విరాట్ కోహ్లీ ఇన్వెస్ట్ చేశారు. బిజినెస్ స్టాండర్డ్ కథనం ప్రకారం 2015 లో విరాట్ కోహ్లీ ఒక వ్యాపారంలో 90 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేశారు. అలాగే హాంగ్ కాంగ్ కి చెందిన జీవ్ అనే ఒక సంస్థలో కూడా ఇన్వెస్ట్ చేశారు.

Cricketers and their business Ventures

#3 యువరాజ్ సింగ్

యువరాజ్ సింగ్ యు వి కెన్ అనే ఒక క్లోతింగ్ బ్రాండ్ లో ఇన్వెస్ట్ చేశారు. అలాగే బ్యూటీ అండ్ వెల్నెస్ కి సంబంధించిన వ్యోమో లో, ట్రావెల్ కి సంబంధించిన జెట్ సెట్ గో లో, పిల్లల స్పోర్ట్స్ కి సంబంధించిన స్పోర్టీ బీన్స్, కార్టిసన్ అనే ఒక ఆటోమోటివ్ సర్వీసెస్ మార్కెట్ ప్లేస్ లో, అలాగే ఆన్లైన్ హెల్త్ కేర్ సర్వీసెస్ అందించే మార్కెట్ ప్లేస్ అయిన హెల్తియన్స్ లో కూడా ఇన్వెస్ట్ చేశారు.

Cricketers and their business Ventures

#4 రాబిన్ ఉతప్ప

రాబిన్ ఊతప్ప కేఫైన్ వెంచర్స్, అలాగే ఐ టిఫిన్, హెల్తీ మైండ్స్ అనే బెంగళూరుకు చెందిన స్టార్ట్ అప్ లో కూడా ఇన్వెస్ట్ చేశారు.

Cricketers and their business Ventures

#5 హర్ష భోగ్లే

హర్ష భోగ్లే ఫైనాన్స్ కి సంబంధించిన చెక్ బుక్ అనే ఒక స్టార్ట్ అప్ లో ఇన్వెస్ట్ చేశారు.

Cricketers and their business Ventures

#6 అనిల్ కుంబ్లే

అనిల్ కుంబ్లే టెన్విక్ అనే స్పోర్ట్స్ ట్రైనింగ్ అండ్ కన్సల్టింగ్ కంపెనీకి కో ఫౌండర్ గా ఉన్నారు. అలాగే స్పెక్ట కామ్ అనే ఒక చిప్స్ లాగా కనిపించే స్టిక్కర్స్ కంపెనీకి కూడా ఫౌండర్ గా ఉన్నారు అనిల్ కుంబ్లే. ఈ స్టిక్కర్స్ బ్యాట్స్మెన్ బాల్ ని ఎంత పవర్ తో కొట్టాడు అనేది కనుక్కుంటుంది.

Cricketers and their business Ventures

#7 మహేంద్ర సింగ్ ధోని

మహేంద్ర సింగ్ ధోనీ కూడా గల్ఫ్ పెట్రోల్ కి సీఈఓ గా ఉన్నారు. అంతే కాకుండా ధోని కి సెవెన్ అనే ఒక ఫిట్నెస్ ప్రొడక్ట్స్ దుస్తుల బ్రాండ్ కూడా ఉంది. అంతే కాకుండా తరచుగా మనకు అడ్వర్టైజ్మెంట్ లో కనిపించే  కార్స్ 24 తో పాటు ఖాతా బుక్ లో కూడా ఇన్వెస్ట్ చేశారు.

Cricketers and their business Ventures

#8 ఉమేష్ యాదవ్

ఉమేష్ యాదవ్ కోల్కతాకు చెందిన స్టార్ట్ అప్ అయిన ఫ్యాషన్ ఓవ్ అనే ఒక ఆన్లైన్ రివ్యూ అండ్ కామర్స్ పోర్టల్ లో ఇన్వెస్ట్ చేశారు.

Cricketers and their business Ventures

#9 జహీర్ ఖాన్

2005 లో జహీర్ ఖాన్ జహీర్ ఖాన్’స్ అనే ఒక రెస్టారెంట్ మొదలుపెట్టారు. టాస్ అనే పేరుతో పూణేలో ఒక స్పోర్ట్స్ లాంజ్ కూడా ఓపెన్ చేశారు. అలాగే ప్రో స్పోర్ట్ ఫిట్నెస్ పేరుతో ఒక ఫిట్నెస్ వెంచర్ కూడా మొదలుపెట్టారు. ముంబైలో రెండు ప్రో స్పోర్ట్ సెంటర్స్ ఉన్నాయి. ఈ ప్రో స్పోర్ట్, ఫిట్నెస్ ట్రైనింగ్ అలాగే ఫిజియోథెరపీ సర్వీసెస్ ఇస్తుంది.

Cricketers and their business Ventures

#10 క్రిస్ గేల్

క్రిస్ గేల్ ట్రిపుల్ సెంచరీ 333 అనే స్పోర్ట్స్ బార్ ని ఓపెన్ చేశారు. అలాగే రెస్టారెంట్ కూడా ఉంది. యాటిట్యూడ్ డాట్ కామ్ అనే ఒక ఫ్యాషన్ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు క్రిస్ గేల్.

Cricketers and their business Ventures

#11 మహేల జయవర్ధనే

మహేల జయవర్ధనే, కుమార సంగక్కరతో కలిసి శ్రీలంకలోని కొలంబోలో మినిస్ట్రీ ఆఫ్ క్రాబ్ అనే ఒక రెస్టారెంట్ ని ఓపెన్ చేశారు. అలాగే ముంబైలో కూడా బ్రాంచ్ తెరిచే ఆలోచనలో ఉన్నట్టు అప్పుడు మహేల జయవర్ధనే తెలిపారు.

Cricketers and their business Ventures

#12 గ్యారీ కిర్స్టన్

గ్యారీ కిర్స్టన్ కేప్ ఆఫ్రికా టూర్స్ తో కలిసి గ్యారీ కిర్స్టన్ ట్రావెల్స్ అండ్ టూర్స్ మొదలుపెట్టారు. అలాగే ప్యాడీ అప్టన్, డేల్ విలియమ్స్ తో కలిసి పర్ఫామెన్స్ జోన్ అనే కంపెనీకి ఓనర్ గా ఉన్నారు. గ్యారీ కిర్స్టన్ క్రికెట్ అకాడమీ అనే ఒక క్రికెట్ కోచింగ్ సెంటర్ కూడా మొదలుపెట్టారు.

Cricketers and their business Ventures

#13 సౌరవ్ గంగూలీ

సౌరవ్ గంగూలీ సౌరవ్’ స్ ద ఫుడ్ పెవిలియన్ పేరుతో ఒక రెస్టారెంట్ మొదలుపెట్టారు. ఆ తర్వాత ఫ్లిక్ స్ట్రీ అనే ఒక డిజిటల్ స్టార్టప్ లో ఇన్వెస్ట్ చేశారు. అలాగే ISL (ఇండియన్ సూపర్ లీగ్) లోని ఎట్లాటికో డే కోల్కతా (ATK) కి కూడా కో ఓనర్ గా ఉన్నారు.

Cricketers and their business Ventures


End of Article

You may also like