ఈ 10 మంది ఒకప్పుడు టాప్ క్రికెటర్స్…కానీ జైలు పాలయ్యారు.! కారణాలు ఏంటో చూడండి.!

ఈ 10 మంది ఒకప్పుడు టాప్ క్రికెటర్స్…కానీ జైలు పాలయ్యారు.! కారణాలు ఏంటో చూడండి.!

by Mohana Priya

Ads

సెలబ్రిటీలు కూడా మామూలు మనుషులే. వారు కూడా ఎప్పుడో ఒకసారి పొరపాటు చేసి ఉండొచ్చు. కానీ వారు సెలబ్రిటీలు కాబట్టి వారు చేసిన చిన్న చిన్న పొరపాట్లు కూడా బయటికి వస్తాయి. అయితే క్రికెట్ కి చెందిన కొంత మంది సెలబ్రిటీలు కూడా వారు చేసిన తప్పుల వల్ల ఇబ్బందులకు గురయ్యారు. క్రికెట్ కంట్రీ కథనం ప్రకారం ఆ క్రికెటర్లు ఎవరో వారు చేసిన పొరపాటు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

#1 మార్క్ వెర్ములేన్ – ప్రేక్షకుడి పై దాడి

జింబాబ్వే బ్యాట్స్మెన్ అయిన మార్క్ వెర్ములేన్ లాంక్షైర్ లీగ్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న ఒక వ్యక్తిపై బాల్, మెటల్ బౌండరీ మార్కర్ ని విసిరి కొట్టారు. దాంతో సంవత్సరం పాటు నిషేధించబడ్డారు.

Cricketers who got into trouble with the law

#2 నవజోత్ సిద్ధూ – కల్పబుల్ హోమోసైడ్ (హత్య)

డిసెంబర్ 2006 లో నరహత్య కారణంగా సిద్ధూ దోషిగా తేలారు. సిద్దూకి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. 1988లో ఒక రోడ్డు యాక్సిడెంట్ లో సిద్ధూ వల్ల తగిలిన గాయాలతో ఒక 65 సంవత్సరాల వ్యక్తి చనిపోయారు. అప్పీల్ తర్వాత ఫిబ్రవరి 2007లో సిద్దూకి అమృత్సర్ పార్లమెంటరీ స్థానానికి పోటీ చేసేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు నిలిపివేసింది.

Cricketers who got into trouble with the law

#3 పీటర్ రోబక్ – దాడి

మాజీ సోమర్ సెట్ కెప్టెన్ అయిన పీటర్ రోబక్ తన తన ఇంటికి కోచింగ్ తీసుకోవడానికి వచ్చిన ముగ్గురు సౌత్ ఆఫ్రికన్ యువ క్రికెటర్ల పై దాడి చేసిన కారణంగా 2001లో దోషిగా తేలారు. ఇంటి నియమాలను పాటించడంలో విఫలం అయితే కఠినమైన పనిష్మెంట్ ఇస్తాను అని ముందే వారిని హెచ్చరించారు. ఆ ముగ్గురూ తప్పులు చేయడంతో వారిపై దాడి చేశారు. రోబక్ ఆ తర్వాత సస్పెండెడ్ సెంటెన్స్ లో ఉన్నప్పుడు జైలు నుండి తప్పించుకున్నారు. పరిస్థితిని తానే తప్పుగా అర్థం చేసుకున్నాను అని రోబక్ కోర్టు ముందు అంగీకరించారు.

Cricketers who got into trouble with the law

#4 హాన్సీ క్రోన్జే, మహ్మద్ అజారుద్దీన్, సలీమ్ మాలిక్, సల్మాన్ బట్ – అవినీతి చర్యలు, మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్

యువ ప్లేయర్లకు డబ్బు రుచి చూపించి అవినీతి చర్యలకు పాల్పడ్డారు. వీరిలో క్రోన్జే విమాన ప్రమాదంలో మరణించారు.

Cricketers who got into trouble with the law

#5 జాకబ్ మార్టిన్ – అక్రమ రవాణా

2003లో మనుషులను అక్రమ రవాణా చేస్తున్న కారణంగా 2011 ఏప్రిల్ లో మార్టిన్ ని అరెస్ట్ చేశారు.

Cricketers who got into trouble with the law

#6 కింగ్  హెన్రీ VIII – క్రికెట్ పై తప్పుగా మాట్లాడడం

కింగ్ హెన్రీ ని నేరస్తుడిగా పరిగణించాలా లేదా అనేది ఒక మనిషి ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. కానీ క్రికెట్ గురించి మాత్రం చాలా తప్పుగా మాట్లాడారు. 1536 లో తన రాజ్యంలోని యువకులతో క్రికెట్ లాంటి పనికిమాలిన ఆటలు వాడే బదులు ఆర్చరీ (విలువిద్య) నేర్చుకోమని చెప్పారు.

Cricketers who got into trouble with the law

#7 ఎడ్వర్డ్ పూలే – గ్యాంబ్లింగ్, మ్యాచ్ ఫిక్సింగ్

న్యూజిలాండ్ లో జరిగిన ఎంసీ సీ పర్యటనలో ఒక మ్యాచ్ లో వేసిన బెట్ కారణంగా ఎడ్వర్డ్ పూలే ఇబ్బందులకు గురయ్యారు. దీని కారణంగా ఎడ్వర్డ్ పూలే జైలుకు వెళ్లాల్సి వచ్చింది. జూన్ 1873లో క్రికెట్ లో ఇలాంటి అవినీతి చర్యలకు పాల్పడిన కారణంగా తన దేశం నుండి బ్యాన్ చేయబడ్డారు.

Cricketers who got into trouble with the law

#8 క్రిస్ లూయిస్ – కొకైన్ అక్రమ రవాణా

ఇంగ్లాండ్ మాజీ ఆల్రౌండర్ అయిన క్రిస్ లూయిస్ బ్రిటన్ కి కోకైన్ అక్రమంగా రవాణా చేస్తున్న కారణంగా 2009లో 13 సంవత్సరాల జైలు శిక్షకి గురయ్యారు.

Cricketers who got into trouble with the law

#9 మాంటెక్ రూట్ – సీరియల్ కిల్లర్ ఆరోపణలు, జాక్ ది రిప్పర్ నిందితుడు

1888లో 31 సంవత్సరాలు ఉన్నప్పుడు రూట్ తేమ్స్ నదిలో మునిగి పోయారు. వైట్ ఛాపెల్ హత్యలకు రూట్ కారణం అని, జాక్ ది రిప్పర్ అనే సీరియల్ కిల్లర్ చేసిన హత్యలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి.

Cricketers who got into trouble with the law

#10 టెర్రీ జెన్నర్ – వైట్ కాలర్ రాబరీ

ఆస్ట్రేలియాకు చెందిన లెగ్ స్పిన్నర్ అయిన టెర్రీ జెన్నర్ 1988లో గ్యాంబ్లింగ్ లో తను చేసిన అప్పులు చెల్లించడానికి తన యజమాని దగ్గర నుంచి డబ్బులు దొంగిలిస్తూ పట్టుబడ్డారు. దాంతో టెర్రీ జెన్నర్ ఆరున్నర సంవత్సరాలు జైల్లో ఉన్నారు.

Cricketers who got into trouble with the law

#11 లెస్లీ హిల్టన్ – హత్య

తన భార్యని హత్య చేసినందుకు లెస్లీ హిల్టన్ కి ఉరి శిక్ష విధించారు. వివాహేతర సంబంధం ఉన్న కారణంగా లెస్లీ హిల్టన్ తన భార్యని ఏడు సార్లు షూట్ చేశారు.

Cricketers who got into trouble with the law


End of Article

You may also like