మన దేశంలో ఐపీఎల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక్కసారి ఐపీఎల్ సీజన్ మొదలైతే మిగిలిన షోస్ అన్ని ఒక వైపు, ఐపీఎల్ ఇంకొకవైపు అన్నట్టు ఉంటుంది. చాలా ఇళ్లలో ఐపీఎల్ కోసం బానే డిస్కషన్స్ జరుగుతాయి.

winners of most valuable player award in ipl

అయితే ఈసారి ఐపీఎల్ అర్ధాంతరంగా ఆగిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. అందుకు కారణం కరోనా కేసులు పెరగడమే. ఆ విషయం పక్కన పెడితే, ఐపీఎల్ లో ఎంతో మంది ప్లేయర్లు ఒక టీం నుండి వేరొక టీం కి వెళ్లారు. అలా కొంత మంది ప్లేయర్లు ముంబై ఇండియన్స్ జట్టుకి అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి ఆడారు. ఆ ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 రాబిన్ ఉతప్ప

రాబిన్ ఊతప్ప మొదట ముంబై ఇండియన్స్ జట్టులో ఆడారు. తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున 2 సీజన్స్ లో ఆడారు. ఆ తర్వాత 2011లో ఆక్షన్ లో పూణే వారియర్స్ ఇండియా జట్టు రాబిన్ ఊతప్ప ని ఎంచుకున్నారు.

Cricketers who played for Mumbai Indians and RCB

#2 దినేష్ కార్తీక్

దినేష్ కార్తీక్ ముంబై ఇండియన్స్ జట్టు తరపున రెండు సీజన్స్ లో ఆడారు. 2013లో దినేష్ కార్తీక్ ముంబై ఇండియన్ జట్టు లో ఉన్నప్పుడు జట్టు ఐపీఎల్ టైటిల్ కూడా గెలుచుకుంది. 2014లో డిల్లీ డేర్ డెవిల్స్ తరపున ఆడిన దినేష్ కార్తీక్ 2015 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడారు.

Cricketers who played for Mumbai Indians and RCB

#3 వినయ్ కుమార్

వినయ్ కుమార్ కూడా ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నప్పుడు జట్టు టైటిల్ గెలుచుకుంది. 2008-2010 లో వినయ్ కుమార్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడారు.

Cricketers who played for Mumbai Indians and RCB

#4 జహీర్ ఖాన్

జహీర్ ఖాన్ ఐపిఎల్ జర్నీ ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తో మొదలు పెట్టారు. 2009, 2010లో ముంబై ఇండియన్స్ తరపున ఆడారు. 2011లో మళ్ళీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడారు. ఆ తర్వాత 2014లో మళ్లీ ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఆడారు.

Cricketers who played for Mumbai Indians and RCB

#5 ఆర్పి సింగ్

ఆర్పి సింగ్ 2012లో ముంబై ఇండియన్స్ తరపున ఆడారు. ఆ తర్వాత 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడారు.

Cricketers who played for Mumbai Indians and RCB

#6 మనీష్ పాండే

మనీష్ పాండే కూడా ఐపీఎల్ మొదటి సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఆడారు. 2009 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడారు.

Cricketers who played for Mumbai Indians and RCB

#7 యుజ్వేంద్ర చహల్

యుజ్వేంద్ర చాహల్ మొదట ముంబై ఇండియన్స్ తరపున ఆడారు. ఆ తర్వాత 2014లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడారు.

Cricketers who played for Mumbai Indians and RCB