Ads
క్రికెట్‌ను జెంటిల్‌మెన్ గేమ్ అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కు భారీ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రీడ ద్వారా గల్లీ నుండి వచ్చిన వారు గొప్ప క్రికెటర్లుగా అవడమే కాకుండా తమ ఆట ద్వారా తమ దేశానికి పేరును తెచ్చారు.
Video Advertisement
కొందరు తమ ఆటతో క్రికెట్ ప్రపంచాన్ని ఉపేసి క్రికెట్ చరిత్రలో నిలిచిపోయారు. అయితే మరికొందరు క్రికెటర్లు తీవ్రమైన వివాదాల ద్వారా క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించారు. వారు గొప్ప ఆటగాళ్లు అయినప్పటికీ వివాదాలలో చిక్కుకుని తమ కెరీర్ ను అర్ధాంతరంగా ముగుసేట్టు చేసుకున్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం..
1. ఎస్. శ్రీశాంత్:
శ్రీశాంత్ పేస్ బౌలింగ్‌కి ఎంతోమంది అభిమనులున్నారు. టీమ్ ఇండియా తరుపున ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు. అతను క్రికెట్ మైదానంలో చాలా విజయాలు సాధించాడు. తన ప్రదర్శనలతో చాలా సందర్భాలలో భారత జట్టు గెలుపుకి కారణం అయ్యి వార్తల్లో నిలిచాడు. కానీ మైదానంలో అతని ఆట కన్నా, వివాదాల కారణంగా అతని పేరు ఎక్కువగా వినిపించేది.
ఐపీఎల్ లో రాజస్థాన్ జట్టు తరుపున ఆడుతున్నప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడి జీవితకాల నిషేధానికి గురయ్యాడు. ఫిక్సింగ్ విషయం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. క్రికెటర్లతో పాటు క్రికెట్ అభిమానులు షాక్ అయ్యారు. ఆ తరువాత దానిని 7 ఏళ్లకు తగ్గించారు.
2. మహ్మద్ ఆసిఫ్:
పాకిస్తాన్ జట్టులోని గొప్ప బౌలర్లలో మహ్మద్ ఆసిఫ్ ఒకరు. ఆసిఫ్ బంతిని రెండు వైపులా స్వింగ్ చేయడంలో పేరు తెచ్చుకున్నాడు. అతను కెరీర్ మొదలు పెట్టిన రోజులలో బాగా ఆడలేకపోయాడు. మెరుగైన ప్రదర్శన కోసం డ్రగ్స్‌ని ఉపయోగించాడు. దాంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ క్రికెట్ ఆడకుండా ఒక సంవత్సరం పాటు అతన్ని నిషేధించింది.
ఆ తరువాత 2008 ఐపీఎల్ లో స్టెరాయిడ్‌లను ఉపయోగించి వార్తల్లో నిలిచాడు. దాంతో అతన్ని రెండు సీజన్ల పాటు నిషేధించారు. 2010లో ఇంగ్లండ్ పై జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ స్కామ్ లో దోషిగా రుజువు అవడంతో ఐదేళ్ల నిషేధంతో పాటు ఒక సంవత్సరం జైలు శిక్షను ప్రభుత్వం విధించింది.
3. షోయబ్ అక్తర్:
క్రికెట్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ బౌలర్లలో షోయబ్ అక్తర్ ఒకరు. గంటకు 150 కిమీ వేగంతో బౌలింగ్ చేయగలిగిన బౌలర్లలో షోయబ్ ఒకరు. అలాగే పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బౌలర్లలో ఒకరిగా రికార్డ్ సృష్టించాడు. అంత గొప్ప బౌలర్ కెరీర్ ముగియడానికి కారణం వివాదాలు. 2003లో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో బాల్ టాంపరింగ్‌కు పాల్పడడంతో 6 మ్యాచ్ ల నిషేధం విధించబడింది.
అది అక్కడితో ఆగలేదు. 2006లో అతను బౌలింగ్ ను మెరుగుపరిచే డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. దాంతో అతని పై రెండేళ్ల నిషేధం విధించబడింది. తరువాత కోర్టులో అప్పీల్ చేసి వచ్చిన ఆరోపణల నుంచి రిలీఫ్ పొందాడు. 2007లో T20 ప్రపంచ కప్ ఆడే సమయంలో, తన సహచరుడిని మొహమ్మద్ ఆసిఫ్ ను బ్యాట్‌తో కొట్టినందుకు అతను మళ్లీ జట్టు నుండి సస్పెండ్ అయ్యాడు.
4. ఆండ్రూ సైమండ్స్:
ఆండ్రూ సైమండ్స్ అసాధారణమైన బ్యాట్స్‌మెన్. ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్లలో ఒకరు. కానీ, అతనికున్న మద్యం అలవాటు వల్ల కెరీర్ ముగిసింది. సైమండ్స్ అహంకార క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. 2005లో, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందు, సాయంత్రం మద్యం సేవించినందుకు అతన్ని జాతీయ జట్టు నుండి తొలగించారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు CA జరిమానా విధించింది. 2009లోసైమండ్స్ మద్యం మత్తులో రేడియో ఇంటర్వ్యూ ఇవ్వడం అతని కెరీర్‌లోనే అతిపెద్ద వివాదంగా నిలిచింది. చర్చ సందర్భంగా, అతను బ్రెండన్ మెకల్లమ్‌ను తప్పుగా పిలవడంతో సైమండ్స్ కాంట్రాక్ట్‌లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకూడన్న క్లాజును సీఏ చేర్చింది. క్రికెట్ బోర్డుతో ఒప్పందం పై సంతకం చేసిన తర్వాత, రగ్బీ గేమ్‌లో మద్యం సేవించడంతో అతని కెరీర్ కు ముగింపు వచ్చింది.
5. కెవిన్ పీటర్సన్:
కెవిన్ పీటర్సన్ ఇంగ్లాండ్‌కు సూపర్‌స్టార్‌గా మారాడు. అతను ఎంత గొప్ప బ్యాట్స్ మెన్ అనేది అతను సాధించిన పరుగులు చెప్తాయి. జట్టు విజయంలో ఎన్నోసార్లు కీలక పాత్ర వహించాడు. కెప్టెన్ గా కూడా రాణించాడు. అయితే అతనికి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, సహచరులు, కోచ్‌తో సత్సంబంధాలు లేకపోవడం, అది అతను బహిరంగంగా చెప్పడంతో వివాదాలు మొదలయ్యాయి. పీటర్ మూర్స్ కెప్టెన్సీ లో ఆడటం సౌకర్యంగా లేదని బహిరంగంగా ప్రకటించాడు. దాంతో ECB వారిద్దరినీ వారి పదవుల నుండి తొలగించింది.
2012 లో అతను దక్షిణాఫ్రికా జట్టులోని కొంతమంది సభ్యులకు అవమానకరమైన మెసేజ్ లను పంపాడు. వివాదానికి దారి తీసింది. అప్పటి నుండి అతనికి కోచ్ కి మధ్య దూరం ఏర్పడింది. 2014 యాషెస్‌లో ఇంగ్లండ్ తరఫున అద్భుత అడినప్పటికీ, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అతన్ని ఎంపిక చేయలేదు. పీటర్సన్, 39 ఏళ్ల మాజీ బ్యాట్స్‌మెన్ లలో ఒకరిని మాత్రమే ఎంచుకోవాలని ఆండీ ఫ్లవర్ ECB కి చెప్పాడం వల్లే పీటర్సన్ ను ఎంచుకోలేదని తెలుస్తోంది. అలా అతని కెరీర్ ముగింపు దిశగా సాగింది.
Also Read: కోహ్లీ VS గంభీర్..! అసలు వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏంటో తెలుసా.. ??
End of Article