Ads
చెన్నై సూపర్ కింగ్స్ ఐపీల్ చరిత్ర లో మోస్ట్ సక్సెసఫుల్ టీం. అది 2022 ఐపీల్ ముందు వరకు చరిత్ర. కానీ లేటెస్ట్ గా జరిగిన 15 వ ఎడిషన్ లో పాయింట్ల పట్టికలో 9 వ స్థానం లో నిలిచింది ధోని సారధ్యం లోని సీఎస్కే టీం. ఎన్నో అంచనాల మధ్య సీజన్ ను ఆరంభిద్దామనుకున్న ఆ జట్టుకు ధోని సారధ్య బాధ్యతలనుండి తప్పుకోవడంతో పెద్ద దెబ్బ పడ్డది. ధోని స్థానంలో కెప్టెన్ అయినా జడేజా ఘోరంగా విఫలమయ్యాడు. టీం కూర్పు సరిగా కుదరలేదు. పేసర్ దీపక్ చాహర్ గాయం తో టోర్నీ మొత్తానికి దూరం అయ్యాడు. స్టార్ ఆటగాళ్లు ఫామ్ లేకపోవడం లాంటి అనేక కారణాలున్నాయి.
Video Advertisement
ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి తప్పుకున్న ధోని కి ఐపీల్ ను కూడా ఘనంగా వీడ్కోలు ఇవ్వాలనుకుంటుంది సీఎస్కే మేనేజ్మెంట్. దాంట్లో భాగంగా 2023 లో జరగబోయే 16 వ ఎడిషన్ కు మంచి టీం కాంబినేషన్ ను సెట్ చేద్దామనుకుంటుంది. దాంట్లో భాగంగా ఆ జట్టు నుంచి కొందరు ఆటగాళ్లకు ఉద్వాసన పలుకుదామనుకుంటుంది. ఈ నేపథ్యం లో నలుగురు ఆటగాళ్లను వదిలేద్దామనుకుంటుంది.
రాబిన్ ఊతప్ప..
2021 లో కేకేఆర్ ఉతప్పను వదులుకోవడం తో అతడిని కొనుగోలు చేసిన చెన్నై. ఆ సీజన్ లో చాలా మ్యాచ్ లు బెంచ్ కే పరిమితమయ్యాడు. కానీ సురేశ్ రైనా గాయపడటంతో జట్టులోకి వచ్చి ఫస్ట్ మ్యాచ్‌లో విఫలమైనా కీలక క్వాలిఫయర్, ఫైనల్లో మాత్రం సత్తా చాటాడు. దాంతో అతన్ని మళ్లీ కొనుగోలు చేసిన చెన్నై సురేశ్ రైనాను వదులుకుంది.
అయితే ఈ సీజన్లో మాత్రం ఊతప్ప ఆ జోరును కొనసాగించలేకపోయాడు. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో 3, 30, 1, 1,0, 1 దారుణంగా విఫలమయ్యాడు. దాంతో అతన్ని ఓపెనర్‌గా తప్పించిన సీఎస్కే.. డేవాన్ కాన్వేకు అవకాశం ఇచ్చింది. ఊతప్పను మిడిలార్డర్‌కు డిమోట్ చేసింది. మొత్తం 12 మ్యాచ్‌ల్లో 20.90 సగటుతో ఊతప్ప 230 పరుగులే చేశాడు. అతని కెరీర్ కూడా చివరి దశలో ఉండటంతో సీఎస్కే వదిలేయాలనుకుంటుంది.
క్రిస్ జోర్డాన్..
టీ20 స్పెషలిస్ట్ అయిన క్రిస్ జోర్డాన్ ఇంగ్లండ్‌ను టీ 20 టీం లో రెగ్యులర్ మెంబెర్. కాగా ఈ ఆటగాడిని చెన్నై మెగా వేలంలో రూ.3.60 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ జోర్డాన్ అస్సలు రాణించలేదు. చెత్త బౌలింగ్‌తో దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసాడు. అంతేకాకుండా ఓవర్‌కు 8.9 చొప్పున పరుగులిచ్చాడు.గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18వ ఓవర్లో 25 పరుగులిచ్చి జట్టు ఓటమికి కారణమయ్యాడు. ఆ మ్యాచ్ తర్వాత జోర్డాన్‌ను బెంచ్‌కే పరిమితం చేశారు.
తుషార్ దేశ్ పాండే..
భారత అనామక ప్లేయర్ తుషార్ దేశ్ పాండే రూ.20 లక్షల కనీస ధరకు చెన్నై కొనుగోలు చేసింది. ఇతని పై అంచనాలేమి లేనప్పటికీ దీపక్ చాహర్‌కు బ్యాకప్‌గా ఉంటాడని భావించి అతనిపై సీఎస్కే నమ్మకం ఉంచింది. కానీ దీపక్ చాహర్ గాయంతో దూరమవ్వడంతో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడించగా. దేశ్ పాండే దారుణంగా విఫలమయ్యాడు. ఒక్క వికెట్ మాత్రం తీసి ఓవర్‌కు 10 పరుగుల చొప్పున సమర్పించుకున్నాడు. దాంతో అతన్ని బెంచ్‌కే పరిమితం చేశారు. అతనికి బదులు సిమ్రన్‌జిత్ సింగ్, ముఖేష్ చౌదరిలకు అవకాశం ఇవ్వగా వారు సత్తా చాటారు. ముఖ్యంగా కెప్టెన్ ధోనీని ఆకట్టుకున్నారు. దాంతో తుషార్ దేశ్ పాండేకు డోర్లు మూసుకుపోయాయి. ఈ క్రమంలోనే సీఎస్కే అతన్ని వదులుకోనుంది.
ఆడమ్ మిల్నే..
న్యూజిలాండ్ పేసర్ ఆడమ్ మిల్నేను సీఎస్కే వదులుకునే అవకాశం ఉంది. లీగ్‌లో ఒకే ఒక మ్యాచ్ ఆడిన ఆడమ్ మిల్నే గాయంతో జట్టుకు దూరమయ్యాడు. దాంతో సీఎస్కే శ్రీలంక పేసర్, జూనియర్ మలింగా మతీషా పతిరణతో అతని స్థానాన్ని భర్తీ చేసుకుంది. మతీషా తనదైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. దాంతో అతన్ని ధోనీ.. జట్టులో ఉంచుకోవాలనుకుంటుంది. ఈ క్రమంలోనే ఆడమ్ మిల్నేను వదిలేయనుంది.
End of Article