ఎట్టకేలకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు ఒక అద్భుత విజయం దక్కింది. ఇక ప్లేఆఫ్ నుంచి నిష్క్రమిస్తుందని అంచనాలు వేసిన విశ్లేషకుల అంచనాలను తారుమారు చేసింది. రాజస్థాన్ తో తలపడిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు జాసన్ రాయ్, కెప్టేన్ విలియంసన్ ల అద్భుత పోరాటం తో ఆ జట్టు ఏడు వికెట్ల తేడా తో అద్భుతమైన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Video Advertisement

David Warner SRH Player

David Warner SRH Player

అయితే ఈ మ్యాచ్ లో ఎక్కడ కూడా హైదరాబాద్ ఆటగాడు ఆస్ట్రేలియన్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ కనపడలేదు. దీనితో నెటిజన్స్ అందరూ ప్రశ్నల వర్షం కురిపించారు. ట్విట్టర్, ఇంస్ట్గ్రామ్ లో అడిగారు. డేవిడ్ వార్నర్ కు ఏమైంది? అతను ఎందుకు ఈ మ్యాచ్ లో ఆడటం లేదు ? ఎందుకు జట్టులోకి తీసుకోలేదు ? అంటూ ప్రశ్నించారు.

David Warner SRH Player

David Warner SRH Player

డేవిడ్ అన్నను మళ్ళీ ఆరెంజ్ జెర్సీ లో చూస్తామో లేదో అని భావోద్వేగం అయ్యారు. ఇక SRH హెడ్ కోచ్ వ్యాఖ్యలు కూడా టీం లో ఉంటారా లేదా అనే మాటకి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఆయనేమన్నారంటే ! ‘ఇంత వరకు ఆ అంశాల గురించి ఆలోచించలేదని, మెగా వేలం ముందుందని అప్పుడు ఏమైనా జరగొచ్చని’ కామెంట్స్ చేసారు. ఇక రాజస్థాన్ తో గత రాత్రి జరిగిన మ్యాచ్ లో వార్నర్ హోటల్ రూమ్ కి మాత్రమే పరిమితం అయ్యారు.

David Warner SRH Player

David Warner SRH Player

ఇక నెటిజన్స్ వేసిన ప్రశ్నలకి సమాధానం ఇస్తూ డేవిడ్ వార్నర్ ఇలా రిప్లై ఇచ్చారు” ఇక ముందు నేను కనిపించక పోవచ్చు కానీ మీరు నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండండి . అంటూ భావేద్వేగంగా చెప్పారు. ఒక సీజన్లో ఫెయిల్ అయినంత మాత్రాన పక్కన పెడుతారా అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. డేవిడ్ వార్నర్ SRH కి 2016 లో టైటిల్ ని సాధించి పెట్టారు.