Home Sports Adda IPL 2022 ఆక్షన్‌లో హైలైట్ అయిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా..? అతని బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

IPL 2022 ఆక్షన్‌లో హైలైట్ అయిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా..? అతని బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

by Mohana Priya

ఐపీఎల్ 2022 కోసం క్రికెట్ అభిమానులు అందరూ ఎదురుచూస్తున్నారు. సాధారణంగానే క్రికెట్ అంటే భారతదేశంలో ఉన్నక్రేజ్ ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ ఐపీఎల్ అంటే ఆ క్రేజ్ ఇంకా పెరుగుతుంది. ఐపీఎల్ మొదలయ్యే ఎన్నో నెలలో ముందునుండే అసలు ఈ సారి ఏ టీంలో ఏ ప్లేయర్స్ ఉంటారు అనే విషయంపై ఆసక్తి నెలకొంటుంది. అయితే ఇటీవల ఐపీఎల్ ఆక్షన్ జరుగుతోంది.

ఇప్పటివరకు చాలా మంది ప్లేయర్లని చాలా జట్లు బిడ్ చేశారు. డేవిడ్ వార్నర్ ని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తీసుకున్నారు. డేవిడ్ వార్నర్ చెన్నై సూపర్ కింగ్స్ కి కానీ, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కానీ కొనుగోలు చేస్తుంది అని అనుకున్నారు.

details about delhi capitals co owner kiran kumar

కానీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి వార్నర్ ఆడబోతున్నారు. అయితే ఈ వేలంలో ఒక వ్యక్తి మాత్రం హైలైట్ అయ్యారు. ఆయన మరెవరో కాదు ఢిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్ గ్రంధి కిరణ్ కుమార్. కిరణ్ కుమార్ వేసిన వ్యూహాలకి అందరూ ఆశ్చర్యపోయారు. తక్కువ ధరకే అమ్ముడయ్యే ప్లేయర్స్ అని ఎక్కువ ధరకి అమ్ముడయ్యేలా చేశారు. డేవిడ్ వార్నర్ ని తక్కువ ధరకే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సొంతం చేసుకునేలా చేశారు కిరణ్ కుమార్.

details about delhi capitals co owner kiran kumar

అలాగే పృథ్వీ షా, కెఎస్ భరత్, కుల్దీప్ యాదవ్, సర్ఫరాజ్ ఖాన్, మిచెల్ మార్ష్ , ముస్తాఫిజుర్ రెహమాన్. శార్దూల్ ఠాకూర్  విషయంలో కూడా చాలా వ్యూహాత్మకంగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు కిరణ్ కుమార్. 19 ప్లేయర్స్ కేవలం 4.60 కోట్లకి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి వచ్చేలా చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన గ్రంధి మల్లికార్జున రావు కుమారుడు కిరణ్ కుమార్. కిరణ్ కుమార్ జిఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి సీఈఓ, ఎండీ, డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంకా ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.

You may also like