“స్పూన్ తో తినిపించాలా ఏంటి..?” అంటూ… “జడేజా”పై ధోనీ కామెంట్స్..!

“స్పూన్ తో తినిపించాలా ఏంటి..?” అంటూ… “జడేజా”పై ధోనీ కామెంట్స్..!

by Sunku Sravan

Ads

ధోని ఆధ్వర్యంలో చెన్నై విజయాన్ని అందుకుంది. ఆయన సారథ్య బాధ్యతలు స్వీకరించిన మొదటి మ్యాచ్ లోనే విక్టరీని అందుకుంది. ఈ సీజన్ ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించింది. ఫస్ ఆఫ్ లో సన్రైజర్స్ చేతిలో ఘోరంగా విఫలమైన చెన్నై, ఈ గెలుపుతో ప్రతీకారం తీర్చుకున్నది.

Video Advertisement

ఇక మిగిలిన మ్యాచుల్లోనూ ఇలాగే ఆటతీరు కొనసాగించి దూకుడు పెంచనున్నట్టు తెలుస్తోంది. ఈ విజయంతో ఆరు పాయింట్లు ఎగబాకింది.

ధోనీ సారథ్యంలో: మొన్నటి వరకు పరుగులు చేయడానికి ఎంతో కష్టపడ్డ ఓపెనర్ రుతురాజు ఒక్కసారి గా విజృంభించారు. 57 బంతులలో 99 పరుగులు చేసి అద్భుతం సాధించాడు. మరొక ఓపెనర్ కాన్వె 55 బంతులలో ఆరు సిక్సులు, 8 ఫోర్లు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ దెబ్బతో స్కోరు 200 దాటింది. ఈ క్రమంలో ధోనీ క్రీజులోకి వచ్చిన ఎక్కువ సమయం నిలవలేకపోయాడు.

ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత ధోనీ మాట్లాడుతూ మాజీ కెప్టెన్ రవీంద్ర జడేజా అపజయాల గల కారణాలను బయటపెట్టాడు. గత సీజన్లో జట్టు చాలా అద్భుతంగా రాణించిందని దాన్నిబట్టే కెప్టెన్ జడేజా తన బాధ్యత నిర్వర్తింస్తాడని భావించానని అన్నారు. రెండు మ్యాచుల్లో జడేజా పనితీరును చూశానని, మ్యాచులు జరుగుతున్న కొలది రాటుతేలుతాడని అనుకున్నానని తెలియజేశాడు.

స్ఫూన్ తో తినిపించలేం: కెప్టెన్ గా ఉన్న రవీంద్ర జడేజా సొంత నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ప్రతిదీ స్ఫూన్ ద్వారా తినిపించలేమని ఒక్కసారి కెప్టెన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక అంచనాల మీద ఉంటాయని వ్యాఖ్యానించారు.

స్పిన్నర్లు బాగా ఆడారు: కెప్టెన్ గా నేను ఎలాంటి మ్యాజిక్ చేయలేదని, ఒక భారీ లక్ష్యం నిర్దేశించి దాన్ని కాపాడుకోగలమని పేర్కొన్నారు. ఆరవ ఓవర్లో మ్యాచ్ పై పట్టుబిగించమని తెలియజేశారు. స్పిన్నర్లు మ్యాచ్ ను చేజరానివ్వలేదని అన్నాడు. బౌలర్లు సత్తా చాటారు అని తెలియజేశాడు.

బౌలర్లకు ఏం చెప్పాడంటే:జట్టులో యంగు బౌలర్లు ఉన్నారని, వారికి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం మనపై ఉందని తెలియజేశారు. ఒక ఓవర్లో బ్యాటర్ 4 సిక్స్ లు కొడితే ఆ మిగిలిన రెండు బంతుల్లో పరుగులు ఇవ్వకుండా కాపాడుకోవాలని, ఈ విషయాన్ని నేను ఎప్పుడూ చెబుతూ ఉంటానని పేర్కొన్నారు. ఇకముందు జరిగే మ్యాచ్ లన్నీ ఇదే స్ఫూర్తితో ఆడతామని తెలియజేశారు.


End of Article

You may also like